అన్వేషించండి

నెలకు రూ.3500 EMIతో Honda CB350 బైక్‌ కొనవచ్చా? డౌన్‌పేమెంట్‌ ఎంత కట్టాలి?

తెలుగు రాష్ట్రాల్లో హోండా CB350 తాజా ఎక్స్‌షోరూమ్, ఆన్‌రోడ్ ధరలు & తక్కువ ఈఎమ్‌ఐ ప్లాన్ల వివరాలు ఇక్కడ తెలుసుకోండి. స్టైలిష్ బైక్ సొంతం చేసుకునే ఛాన్స్!

Honda CB350 Price, Down Payment, Loan and EMI Details: హోండా నుంచి వచ్చిన క్లాసిక్ మోటార్ సైకిల్ హోండా CB350కి బైకర్స్‌లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రీమియం లుక్స్ & మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్‌తో మార్కెట్లో రచ్చ చేస్తోంది. మీరు విజయవాడ లేదా మరేదైనా తెలుగు నగరంలో ఈ బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?, అయితే దీని తాజా ధరలు, మైలేజ్ & ఫైనాన్స్ EMI లెక్కలు వివరంగా తెలుసుకుందాం.

హోండా CB350 ఫీచర్లు

ఈ బైక్ 348.36 cc ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 21.07 PS పవర్ & 30 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో 5 స్పీడ్ గేర్‌బాక్స్, అసిస్ట్ & స్లిప్పర్ క్లచ్, హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ (HSTC), డిజిటల్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఆల్ LED లైటింగ్ & డ్యూయల్ ఛానల్ ABS వంటి అడ్వాన్స్డ్ సెటప్ ఉన్నాయి. లీటరుకు దాదాపు 35 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

విజయవాడలో ఎక్స్‌షోరూమ్ & ఆన్‌రోడ్ ధరలు

విజయవాడలో Honda CB350 బేస్ వేరియంట్ DLX ఎక్స్‌షోరూమ్ ధర ₹ 1,97,003. ఆర్టీఓ ఛార్జీలు, ఇన్సూరెన్స్ & ఇతర రిజిస్ట్రేషన్ రుసుములు కలిపి దీని తాజా ఆన్‌రోడ్ ధర సుమారు ₹ 2,36,272.

హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ & ఆన్‌రోడ్ ధరలు

హైదరాబాద్‌లో కూడా Honda CB350 బేస్ వేరియంట్ DLX ఎక్స్‌షోరూమ్ ధర ₹ 1,97,003. ఆర్టీఓ ఛార్జీలు, ఇన్సూరెన్స్ & ఇతర రిజిస్ట్రేషన్ రుసుములు కలిపి భాగ్యనగరంలో దీని తాజా ఆన్‌రోడ్ ధర సుమారు ₹ 2,41,997.

కనీస డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?

విజయవాడలో ఫైనాన్స్ రూపంలో ఈ బైక్ కొనుగోలు చేయాలనుకుంటే, ప్రముఖ బ్యాంక్‌లు లేదా ఫైనాన్స్ కంపెనీల రూల్స్ ప్రకారం, మీ సిబిల్‌ స్కోర్‌ను బట్టి ఆన్‌రోడ్ ధరపై కనీసం 10% నుంచి 15% వరకు డౌన్‌పేమెంట్ చెల్లించాలి. అంటే మీరు సుమారు 24,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు కనీస డౌన్‌పేమెంట్ చెల్లించి బైక్‌ను ఇంటికి తీసుకెళ్లవచ్చు. మిగిలిన మొత్తాన్ని లోన్ రూపంలో ఫైనాన్స్ చేసుకోవచ్చు.

బ్యాంక్ వడ్డీ రేట్లు & ఫైనాన్స్ ఆప్షన్లు

ప్రస్తుతం ప్రముఖ బ్యాంక్‌లు & ఫైనాన్స్ సంస్థలు ద్విచక్ర వాహనాల రుణాలపై సంవత్సరానికి 8% నుంచి 14% వడ్డీ రేటును వసూలు చేస్తున్నాయి. మీ సిబిల్ స్కోర్, క్రెడిట్ ప్రొఫైల్ ఆధారంగా ఈ వడ్డీ రేటు మారే అవకాశం ఉంది.

ఉదాహరణకు.. 10% వార్షిక వడ్డీతో 2, 3, 4, 5 ఏళ్ల EMI లెక్కింపు

మీరు రూ.30,000 డౌన్‌పేమెంట్‌ చేస్తే, మిగిలిన రూ.2,06,272ను లోన్‌గా తీసుకోవాలి. ఈ మొత్తాన్ని 10% వార్షిక వడ్డీకి తీసుకున్నారని భావిస్తే, EMI వివరాలు:

2 సంవత్సరాల రుణవ్యవధికి (24 నెలలు): ప్రతి నెలా సుమారు 10,314 EMI కట్టాలి.

3 సంవత్సరాల రుణవ్యవధికి (36 నెలలు): ప్రతి నెలా సుమారు 7,449 EMI చెల్లించాలి.

4 సంవత్సరాల రుణవ్యవధికి (48 నెలలు): ప్రతి నెలా సుమారు 6,016 EMI పడుతుంది.

5 సంవత్సరాల రుణవ్యవధికి (60 నెలలు): ప్రతి నెలా సుమారు 5,157 EMI సరిపోతుంది.

ఇది కూడా చదవండి: Honda CB350 సిరీస్‌కు భారీ అప్‌డేట్స్‌.. కొత్త ధరలు, వేరియంట్లు, డెలివరీ డేట్‌ వివరాలు ఇవిగో

మీరు రూ.లక్ష డౌన్‌పేమెంట్‌ చేసి మిగిలిన రూ. 1,36,272ను లోన్‌గా తీసుకుంటే, 10% వార్షిక వడ్డీ అని భావిస్తే, EMI వివరాలు:

2 సంవత్సరాల రుణవ్యవధికి (24 నెలలు): ప్రతి నెలా సుమారు 6,814 EMI కట్టాలి.

3 సంవత్సరాల రుణవ్యవధికి (36 నెలలు): ప్రతి నెలా సుమారు 4,921 EMI చెల్లించాలి.

4 సంవత్సరాల రుణవ్యవధికి (48 నెలలు): ప్రతి నెలా సుమారు 3,975 EMI పడుతుంది.

5 సంవత్సరాల రుణవ్యవధికి (60 నెలలు): ప్రతి నెలా సుమారు 3,407 EMI సరిపోతుంది.

మీరు రూ.లక్ష డౌన్‌పేమెంట్‌ చేసి 4 సంవత్సరాల రుణవ్యవధిని ఎంచుకుంటే నెలకు సుమారు రూ.4000 EMIతో Honda CB350 DLX వేరియంట్‌ కొనవచ్చు. అలాగే, 5 సంవత్సరాల రుణవ్యవధిని ఎంచుకుంటే నెలకు సుమారు రూ.3400 EMIతో Honda CB350 DLX వేరియంట్‌ కొనవచ్చు.

బైక్ లోన్ తీసుకునే ముందు వివిధ బ్యాంక్‌లు & ఫైనాన్స్ కంపెనీలు ఇచ్చే వడ్డీ రేట్లను సరిపోల్చుకోవడం మంచిది. తక్కువ కాలపరిమితితో లోన్ ఎంచుకుంటే వడ్డీ భారం తగ్గుతుంది. అలాగే ప్రాసెసింగ్ ఫీజు, ప్రీక్లోజర్ ఛార్జీల గురించి డీలర్‌షిప్ వద్ద ముందే స్పష్టత తీసుకోండి.

ఇది కూడా చదవండి: 501cc ఇంజిన్‌, 28hp పవర్‌తో Honda CB500 లాంచ్‌.. మూడు వేరియంట్లు, వాటి ధరల లిస్ట్‌

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

కారు ధరకు బైక్.. Royal Enfield Classic 650 హైపర్‌షిఫ్ట్- ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే
కారు ధరకు బైక్.. Royal Enfield Classic 650 హైపర్‌షిఫ్ట్- ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే
Maruti Baleno కంటే Toyota Glanza రేటు ఎందుకు ఎక్కువ? ధర, ఫీచర్లు, మైలేజీలో అసలు తేడాలివే!
టయోటా గ్లాంజా vs మారుతి బలెనో.. ఈ ట్విన్‌ కార్స్‌లోనూ తేడాలున్నాయ్‌?, కొనే ముందే తెలుసుకోండి
సన్‌రూఫ్ నుంచి 360 డిగ్రీ కెమెరా వరకు.. Mahindra XUV 3XOలో ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయో తెలుసా?
మహీంద్రా XUV 3XOలో 12 వేరియంట్లు.. ఏది కొంటే బెస్ట్? మీ బడ్జెట్‌కు తగ్గ మోడల్ ఏది?
Tesla Roadster: రాకెట్‌లా గాల్లోకి దూసుకెళ్లే కారు.. రోడ్డుపై 0.81 సెకన్లలో 100 కి.మీ వేగం! టెస్లా కొత్త రోడ్‌స్టర్‌లో ఇన్ని వింతలా?
గాల్లో ఎగిరిన టెస్లా కారు.. ఒక్క సెకనులో 100km స్పీడ్‌.. ప్రపంచాన్ని షేక్‌ చేస్తున్న 'ఫ్లైయింగ్‌ కార్‌' వీడియో
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget