అన్వేషించండి

Honda Activa 7G వచ్చేస్తోంది - కొత్త ఫీచర్లు, పవర్‌ఫుల్‌ ఇంజిన్‌తో యూత్‌కు గాలమేసే అట్రాక్టివ్‌ డిజైన్‌

Honda Activa 7G జనవరి 2026లో భారత మార్కెట్‌లో లాంచ్ కానుంది. మరింత శక్తిమంతమైన ఇంజిన్‌, మోడర్న్‌ ఫీచర్లు, అద్భుతమైన మైలేజ్‌తో ఈ స్కూటీ యువత హృదయాలను గెలుచుకోనుంది.

Honda Activa 7G Details: భారత స్కూటీ మార్కెట్‌లో ఎప్పటిలాగే హోండా మరోసారి సెన్సేషన్‌ సృష్టించబోతోంది. దేశంలో అత్యధికంగా అమ్ముడైన స్కూటీ సిరీస్‌గా ఉన్న ఆక్టివా, ఇప్పుడు మరో కొత్త రూపంలో రాబోతోంది. హోండా ఆక్టివా 7G నూతన మోడల్‌ జనవరి 2026లో లాంచ్‌ కానుందని సమాచారం.

ధర & లాంచ్‌ వివరాలు
హోండా ఆక్టివా 7G ఎప్పుడు మార్కెట్‌లోకి వస్తుందా అన్న ఆసక్తి హోండా అభిమానుల్లో తారస్థాయిలో ఉంది. రిపోర్టుల ప్రకారం, హోండా ఆక్టివా 7G ఎక్స్‌-షోరూమ్‌ ధర ₹80,000 నుంచి ₹90,000 మధ్య ఉండే అవకాశం ఉంది. ఇది 6G కంటే కొంచెం ఎక్కువైనా, కొత్త ఫీచర్లు, డిజైన్‌ దృష్ట్యా “విలువకు తగిన స్కూటీ”గా నిలుస్తుందనడంలో సందేహం లేదని రిపోర్ట్స్ చెబుతున్నాయి. 

హోండా ఆక్టివా 7G... TVS Jupiter 125, Suzuki Avenis 125, Hero Xoom 125 వంటి స్కూటర్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. అంతేకాదు, Honda PCX 125 అనే ప్రీమియం స్కూటీని కూడా 2026 ఫిబ్రవరిలో లాంచ్‌ చేయాలని ఈ బ్రాండ్‌ ప్లాన్‌ చేస్తోంది.

డిజైన్‌ & లుక్‌
హోండా ఆక్టివా 7G డిజైన్‌లో హోండా చిన్న చిన్న మార్పులు చేసి మొత్తం లుక్‌ను మరింత ప్రీమియంగా మార్చింది. ఆక్టివా 6G బాడీ స్టైల్‌నే కొనసాగించినా, కొత్త మోడల్‌లో స్లీక్‌ బాడీ ప్యానెల్స్‌, క్రోమ్‌ ఫినిషింగ్‌, ఆకర్షణీయమైన కలర్‌ ఆప్షన్లు చేరుస్తున్నారు. యూత్‌ కోసం స్పెషల్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌ మోడల్‌ను కూడా తీసుకురావచ్చు, ఇందులో కొత్త గ్రాఫిక్స్‌ & యూనిక్‌ కలర్‌ థీమ్‌లు ఉండనున్నాయి.

ఇంజిన్‌ & పనితీరు
పెర్ఫార్మెన్స్‌ విషయానికి వస్తే, ఆక్టివా 7Gలో 109cc సింగిల్‌ సిలిండర్‌ ఎయిర్‌-కూల్డ్‌ ఇంజిన్‌నే కొనసాగిస్తారు. ఇది BS6 నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. ఈ ఇంజిన్‌ సుమారు 7.6 bhp పవర్‌, 8.8 Nm టార్క్‌ ఇస్తుంది. 

మైలేజ్‌
స్మూత్‌నెస్‌, రిలయబిలిటీకి పేరుగాంచిన ఈ ఇంజిన్‌తో, లీటరు పెట్రోలుతో 45 నుంచి 50 కి.మీ. దూరం ప్రయాణించవచ్చని అంచనా. 5.3 లీటర్ల ఫ్యూయల్‌ ట్యాంక్‌తో ఈ స్కూటర్‌ 250 కి.మీ. వరకు ప్రయాణించగలదు. అంటే, నగర వినియోగానికి పర్ఫెక్ట్‌ స్కూటీ అని చెప్పవచ్చు.

ఫీచర్లు & టెక్నాలజీ

- ఫీచర్ల పరంగా 7G మరో లెవెల్‌లో ఉండవచ్చు. ఇంజిన్‌ స్టార్ట్‌-స్టాప్‌ స్విచ్‌, సైలెంట్‌ స్టార్టర్‌ సిస్టమ్‌, డ్యూయల్‌ ఫంక్షన్‌ స్విచ్‌ వంటి ఫీచర్లు రైడింగ్‌ అనుభవాన్ని చాలా బెటర్‌ చేస్తాయి.

- టెలిస్కోపిక్‌ ఫ్రంట్‌ సస్పెన్షన్‌, 12-అంగుళాల ముందరి చక్రాలు, 10-అంగుళాల వెనుక చక్రాలు రైడింగ్‌ కంఫర్ట్‌ పెంచుతాయి.

- యూత్‌ మైండ్‌లోకి దూసుకువెళ్లేలా డిజిటల్‌ డిస్‌ప్లే, బ్లూటూత్‌ కనెక్టివిటీ, స్మార్ట్‌ కీ సిస్టమ్‌ వంటి హైటెక్‌ ఫీచర్లను కూడా అందించే అవకాశం ఉంది.

ఆక్టివా 7Gతో, హోండా కంపెనీ, స్కూటర్‌ మార్కెట్‌లో తన డామినేషన్‌ను కొనసాగించబోతోంది. అందమైన రూపం, శక్తిమంతమైన ఇంజిన్‌, టాప్‌ క్లాస్‌ మైలేజ్‌తో ఈ స్కూటర్‌ యూత్‌ను ఖచ్చితంగా ఆకట్టుకోవచ్చు. మీరు స్టైలిష్‌, రిలయబుల్‌ & ఎకానమికల్‌ స్కూటర్‌ కోసం చూస్తున్నట్లయితే - ఆక్టివా 7G మీకోసమే వస్తోంది!.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

సరికొత్తగా మార్కెట్లోకి Skoda Slavia Facelift.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే.. ఫీచర్ల వివరాలు
సరికొత్తగా మార్కెట్లోకి Skoda Slavia Facelift.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే.. ఫీచర్ల వివరాలు
బజాజ్ చేతక్ EVని ఇంటికి తెచ్చుకోవడానికి లోన్‌ ఫెసిలిటీ.. కనీస డౌన్‌పేమెంట్‌, EMI పూర్తి వివరాలు
Bajaj Chetak C2501 ఎలక్ట్రిక్ స్కూటర్‌.. నెలకు కేవలం రూ.1500 EMIతో మీ సొంతం!
చలికాలంలో కారు తీసుకుని బయటకు వెళ్తున్నారా? ఈ 5 యాక్సెసరీస్ ఉంటే టెన్షన్ ఉండదు!
ఈ చలికాలంలో కారు డ్రైవింగ్ సేఫ్‌గా సాగాలంటే.. ఈ 5 యాక్సెసరీస్ తప్పనిసరి!
గూగుల్‌ మ్యాప్స్‌ మిర్రరింగ్‌ ఉన్న 8 బైక్‌లు.. పూర్తిగా కొత్త ప్రదేశంలోనూ ఈజీగా దారి తెలుసుకోవచ్చు!
బైక్‌ స్కీన్‌పైనే గూగుల్‌ మ్యాప్‌ కనిపిస్తుంది.. ధర కేవలం రూ.1 లక్షల నుంచి స్టార్ట్‌!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
Chandrababu And Pawan Kalyan Meeting: ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
Rahul Gandhi Climbed Barricades: ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన రాహుల్ గాంధీ..
ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని ఊపిన రాహుల్ గాంధీ..
Highest Tax in India: దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
RTC Conductor Cheating: రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
Telangana Congress BC CM : తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
Dharani I Love You: రాజమౌళి 'మగధీర' అసోసియేట్ దర్శకత్వంలో 'ధరణి ఐ లవ్ యు'...
రాజమౌళి 'మగధీర' అసోసియేట్ దర్శకత్వంలో 'ధరణి ఐ లవ్ యు'...
Singareni Workers Bonus: సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి కానుక.. ప్రతి కార్మికుడికి రూ.1,10,250 బోనస్‌!
సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి కానుక.. ప్రతి కార్మికుడికి రూ.1,10,250 బోనస్‌!
Embed widget