అన్వేషించండి

Bike for children: పిల్లల కోసం హీరో విడా స్పెషల్ బైక్.. సింగిల్ ఛార్జ్‌తో 3 గంటలు రయ్ రయ్, ధర వివరాలు

Bike for Kids | హీరో విడా పిల్లల కోసం ఎలక్ట్రిక్ డర్ట్ బైక్ DirtE K3 ని మార్కెట్లోకి విడుదల చేసింది. బైక్ బరువు 22 కేజీలు కాగా, తల్లిదండ్రులు దీన్ని కంట్రోల్ చేస్తారు.

Hero MotoCorp కంపెనీకి చెందిన Vida బ్రాండ్ భారతదేశంలో పిల్లల కోసం ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ డర్ట్ బైక్‌ను ప్రారంభించింది. దీని పేరు Vida Dirt.E K3. 4 నుంచి 10 సంవత్సరాల పిల్లలను దృష్టిలో ఉంచుకుని బైక్ తయారు చేసింది కంపెనీ. వేగం, బైక్ నడపడం ఇష్టపడే పిల్లల కోసం ఈ చిన్న బైక్ రూపొందించారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే, వేగం,  కంట్రోల్ పూర్తిగా తల్లిదండ్రుల చేతుల్లో ఉంటాయి. దాంతో ఇది పిల్లల భద్రతను నిర్ధారిస్తుంది.

ప్రారంభ ధర, వెల్‌కం ఆఫర్

Hero Vida Dirt.E K3 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 69,990గా ఫిక్స్ చేశారు. ఈ ధర మొదటి 300 మంది కస్టమర్‌లకు మాత్రమే వర్తిస్తుందని హీరో విడా పేర్కొంది. ఆ తర్వాత దీని ధర పెరిగే అవకాశం ఉంది. కంపెనీ ఈ బైక్‌ను మొదటిసారిగా భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2025లో ప్రదర్శించింది. తరువాత అంతర్జాతీయ ప్రదర్శనలో దాని ప్రొడక్ట్ నమూనాను ప్రవేశపెట్టింది. ఇప్పుడు భారతదేశంలో చిన్నపిల్ల బైక్ అధికారికంగా ప్రారంభించారు.

తేలికపాటి బైక్, పిల్లలకు అనుగుణంగా డిజైన్

Vida Dirt.E K3 కేవలం 22 కిలోల బరువు కలిగి ఉంటుంది. ఇది చిన్న పిల్లలు కూడా సులభంగా నడిపేలా, మెయింటైన్ చేసేలా చేస్తుంది. ఇందులో 3 రకాల సీటు ఎత్తులు ఉన్నాయి. దాంతో పిల్లల తమ ఎత్తుకు అనుగుణంగా బైక్‌ను సెట్ చేయవచ్చు. పిల్లలు పెద్దయ్యాక, బైక్‌ను కూడా అదే విధంగా మార్చవచ్చు. సీటు, హ్యాండిల్, వీల్ స్థానాన్ని సర్దుబాటు చేయవచ్చు. ఇది ఎక్కువ కాలం ఉపయోగించడానికి వీలు కల్పిస్తుంది.

భద్రతకు పూర్తి ప్రాధాన్యత 

ఈ ఎలక్ట్రిక్ డర్ట్ బైక్‌లో పిల్లల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో తొలగించగల ఫుట్‌పెగ్‌లు ఉన్నాయి. దీని వలన పిల్లలు అవసరమైతే బైక్‌ను నెట్టడం ద్వారా కూడా నడపవచ్చు. పడిపోతే గాయాలు కాకుండా హ్యాండిల్‌పై సాఫ్ట్ చెస్ట్ ప్యాడ్ ఇచ్చారు. ఇది మాగ్నెటిక్ కిల్ స్విచ్‌ను కూడా కలిగి ఉంది. ఇది పడిపోయిన వెంటనే బైక్‌ను ఆపివేస్తుంది. ప్రస్తుతం, ఇది వెనుక బ్రేక్‌ను మాత్రమే కలిగి ఉంది. కానీ భవిష్యత్తులో డిమాంగ్ తగ్గట్లుగా ముందు బ్రేక్‌ను కూడా తీసుకురావచ్చు.

యాప్ నియంత్రణ, బ్యాటరీ, స్పీడ్ ఎంపికలు

Vida Dirt.E K3 మొబైల్ యాప్ సపోర్ట్‌ను సైతం కలిగి ఉంది. ఈ యాప్ ద్వారా తల్లిదండ్రులు ఆ బైక్ వేగాన్ని, టార్క్  నియంత్రించవచ్చు. ఇది రిమూవ్ చేయగల 360Wh బ్యాటరీ, 500W మోటార్‌ను కలిగి ఉంది. బైక్‌లో 3 రైడ్ మోడ్‌లు ఉన్నాయి. వీటిలో 8 km/h, 17 km/h సహా 25 km/h గరిష్ట వేగం అందుబాటులో ఉంది. ఈ బైక్ పిల్లలకు ఎలక్ట్రిక్ విభాగంలో ఒక కొత్త, సురక్షితమైన ఎంపికగా భావిస్తున్నారు. అడ్వెంచర్ తరహా ఆలోచన, తాము సైతం బైక్ డ్రైవింగ్ చేస్తున్నామని భావించే పిల్లల కోసం ఈ బైక్ తీసుకొచ్చారు.

Also Read: Ather 450 XE Price: ఒక్క ఛార్జ్ తో 161 కిలోమీటర్ల రేంజ్.. ఏథర్ 450 X ఈ స్కూటర్ ధర, ఫీచర్లు ఇవే

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

కొత్త బ్రెజ్జాలో అదిరిపోయే 6 మార్పులు - టర్బో పవర్‌, వెంటిలేటెడ్‌ సీట్లు, 5 స్టార్‌ రేటింగ్‌తో మరింత బలంగా మారుతి SUV
2026 మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌ - పాత మోడల్‌తో పోలిస్తే కొత్తగా వచ్చిన మార్పులేంటి?
XP100, Power100, Speed100పై కేంద్రం కీలక ప్రకటన - E20ని మించిన ఇంధనంపైనా క్లారిటీ
ప్రీమియం పెట్రోల్ వాడేవారికి గుడ్ న్యూస్ - ఇథనాల్ ఒక్క చుక్క కూడా ఉండదని కేంద్రం క్లారిటీ!
Nissan Tekton కొనాలా, వద్దా? పూర్తి విశ్లేషణ - కొనడానికి 3 కారణాలు, దూరంగా ఉండడానికి 3 కారణాలు
Nissan Tekton కొనడం తెలివైన పనేనా? మీరు తప్పక తెలుసుకోవాల్సిన ప్లస్‌లు, మైనస్‌లు
హైవే మీద, నగరంలోనూ అదరహో! MG Windsor EV 15,000 15,000km లాంగ్ టర్మ్ రివ్యూ
లాంగ్‌టర్మ్‌లో MG Windsor EV ఎలా ఉంది? 15,000km సుదీర్ఘ ప్రయాణంలో బయటపడిన నిజాలు

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jr NTR Shoulder Injury : ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Tammineni Sitaram Forgery Case: తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
Karur Stampede Victims Jobs Case : సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
Bonda Uma Issue: బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
Vallabhaneni Vamsi To Meet CM Chandrababu: చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
Elon Musk Reject Racism Claims: నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Anti Paper Leak Bill: లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
Embed widget