అన్వేషించండి

Two Wheeler EMIs: కేవలం 3 వేల EMIతో Hero Passion Plus కొనొచ్చు, ఆ బైక్‌లకు గట్టి పోటీ

మంచి మైలేజ్ ఇచ్చే బైకులలో ఒకటైన హీరో పాషన్ ప్లస్ ను కేవలం రూ.5000 డౌన్ పేమెంట్ తో కొనుగోలు చేయవచ్చు. తరువాత రూ.3 వేల ఈఎంఐ ప్రతినెలా కట్టేలా ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి.

Two Wheeler Bike EMI Plans | మీరు చవకైన, మంచి కంపెనీ బైక్ కోసం చూస్తున్నారా, అయితే Hero Passion Plus మీకు మంచి ఛాయిస్ కావచ్చు. GST తగ్గింపు తర్వాత హీరో కంపెనీ ఈ బైక్ ధరను తగ్గించింది. ఇది మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించనుంది. బైక్ కొనడానికి మీ వద్ద లక్ష రూపాయలు లేవని బాధ పడవద్దు. ఎక్కువ నగదు మీతో లేకపోయినా మీరు కేవలం 5 వేల రూపాయల డౌన్ పేమెంట్ తో బైక్ కొనుగోలు చేయవచ్చు. ఈ బైక్ ఆన్-రోడ్ ధర, EMI లెక్కల గురించి తెలుసుకుందాం.

Hero Passion Plus ఎక్స్-షోరూమ్ ధర ఢిల్లీలో రూ.76 వేల 691. దీని ఆన్-రోడ్ ధరలో RTO, ఇన్సూరెన్స్ మొత్తం ఉన్నాయి. ఇప్పుడు మొత్తం నగదు 91 వేల 383 రూపాయలు చెల్లించాలి. ఈ ఆన్-రోడ్ ధర ఆయా నగరాలు, డీలర్‌షిప్ ఆధారంగా వ్యత్యాసం ఉండవచ్చు. Hero Passion Plus బైకును మీరు 5,000 రూపాయల డౌన్ పేమెంట్ చేయగలిగితే సొంతం చేసుకోవచ్చు. తరువాత 86,383 రూపాయల బైక్ లోన్ 10 శాతం వార్షిక వడ్డీ రేటుతో 3 ఏళ్లకు లభిస్తే, EMI దాదాపు రూ.3,119 చెల్లించాల్సి వస్తుంది. 

హీరో ప్యాషన్ ప్లస్ (Hero Passion Plus) ఇంజిన్ 

Hero Passion Plus 97.2 cc సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ OBD2B ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ బైక్ 7.91 bhp పవర్, 8.05 Nm టార్కును జనరేట్ చేస్తుంది. ఇది  స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో వస్తుంది. ఈ బైక్ గరిష్ట వేగం 85 kmph. కాగా బైక్ లీటరుకు 70 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. 11 లీటర్ల Fuel Tanks తో ఒకసారి ఫుల్ ట్యాంక్ చేపిస్తే దాదాపు 750 కిమీ దూరం ప్రయాణించవచ్చు. రోజువారీ ప్రయాణం చేసేవారికి ఇది బెస్ట్ మైలేజ్ బైకులలో ఒకటి. 

Hero Passion Plus ఫీచర్లు

Hero Passion Plus లో అనేక ఫీచర్లు ఉన్నాయి. ఇవి రోజువారీ ఉపయోగం కోసం చాలా ఆచరణాత్మకమైనవి. ఇందులో i3S టెక్నాలజీ, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ కన్సోల్, ట్రిప్ మీటర్, ఓడోమీటర్, ఫ్యూయల్ గేజ్, USB ఛార్జింగ్ పోర్ట్, సైడ్ స్టాండ్ ఇంజిన్ కటాఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. భద్రతా పరంగా చూస్తే.. ఫ్రంట్ వీల్, వెనుక చక్రాలపై 130mm డ్రమ్ బ్రేక్స్ వస్తాయి. ఇవి ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ (IBS)తో వస్తాయి. ఈ బ్రేకింగ్ సిస్టమ్ బైకును మరింత సురక్షితంగా మార్చుతుంది.

ఏ బైక్‌లకు పోటీ ఇస్తుంది.. 

Hero Passion Plus ముఖ్యంగా హోండా షైన్ 100 (Honda Shine 100) లాంటి 100cc సెగ్మెంట్ బైకులకు పోటీ ఇస్తుంది. అలాగే టీవీఎస్ రేడియన్ (TVS Radeon),  బజాజ్ ప్లాటినా (Bajaj Platina) వంటి బైక్లతో పోటీపడుతుంది. ఇది చవకైన బైక్, మంచి ఇంధన సామర్థ్యం కలిగిన కమ్యూటర్ బైక్. మంచి మైలేజ్ ఇచ్చే బైకులలో ఒకటి కావడంతో పాటు ఇది సౌకర్యవంతమైన రైడ్ కోసం చూసే వారికి బెస్ట్ బైక్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Yamaha R15 కంటే పవర్‌ఫుల్‌.. ధర రూ.2 లక్షలు! ఆగస్టు 27న వస్తున్న R2పై భారీ అంచనాలు
Yamaha R2లో 220cc ఇంజిన్‌! - ఈ స్పోర్ట్స్‌ బైక్‌లో ఇంకా ఎలాంటి అద్భుతాలు ఉండొచ్చు?
టాటా సియెర్రా vs కియా సెల్టోస్‌ మధ్య స్పీడ్‌ టెస్ట్‌.. ఏ కారు గెలిచింది?
Tata Sierra vs Kia Seltos - డీజిల్‌ ఆటోమేటిక్‌లో ఏ కారుకు దూకుడు ఎక్కువ?
BaaS కింద ఎలక్ట్రిక్‌ కారును కొంటే కిలోమీటర్‌కు ఎంత ఖర్చువుతుంది? భారత్‌లో BaaS EVల పూర్తి లిస్ట్ ఇదే!
బ్యాటరీ కొనే పనే లేదు.. కారు ధర ఏకంగా రూ.8.35 లక్షలు తగ్గుతుంది! BaaSతో ఈ EVలన్నీ మీ సొంతం

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Embed widget