Hero Electric Eddy: ఈ ఎలక్ట్రిక్ బైక్‌కు లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు - ఎలా ఉందో చూసేయండి!
ప్రముఖ వాహన తయారీ సంస్థ హీరో కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే హీరో ఎలక్ట్రిక్ ఎడ్డీ.
నగరాల్లో తక్కువ దూరాలను ప్రయాణించడానికి అవసరమైన, సాధ్యమైన పద్థతులను, వాటికి కావాల్సిన వాహనాలను రూపొందించడం ప్రస్తుతం అవసరమైన విషయం. తక్కువ దూరాలు ప్రయాణించడానికి ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంతగానో ఉపయోగపడనుంది.
ప్రస్తుతం పెట్రోల్ రేట్లు పెరుగుతూ ఉండటంతో ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం కేవలం తక్కువ దూరాలను ప్రయాణించడానికి హీరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. అదే హీరో ఎలక్ట్రిక్ ఎడ్డీ. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు రిజిస్ట్రేషన్, లైసెన్స్ అవసరం లేదు.
దీని ఎక్స్-షోరూం ధర రూ.72 వేలుగా ఉంది. ఫేమ్ సబ్సిడీలకు కూడా ఇది క్వాలిఫై కాలేదు. దీని టాప్ స్పీడ్ కేవలం గంటకు 25 కిలోమీటర్లు మాత్రమే. అందుకే దీనికి లైసెన్స్ అవసరం లేదు. దీని మోటార్ చాలా చిన్నది. ఒక్కసారి చార్జ్ పెడితే కేవలం 85 కిలోమీటర్ల రేంజ్‌ను మాత్రమే ఇది అందించనుంది.
అంటే కేవలం తక్కువ దూరం ఉన్న ప్రయాణాలకు మాత్రమే దీన్ని ఉపయోగించగలం అన్నమాట. ఇది ఒక బేసిక్ స్కూటర్. ఇందులో రివర్స్ మోడ్, ఫాలో మీ హెడ్ ల్యాంప్, ఈ-లాక్, ఫైండ్ మై బైక్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
బ్లూ, ఎల్లో రంగుల్లో ఈ బైక్ కొనుగోలు చేయవచ్చు. ఇందులో స్టోరేజ్ స్పేస్‌ను కూడా అందించారు. అయితే ఇక్కడ ఎవరికైనా వచ్చే ఒకే ఒక్క ప్రశ్న ఏంటంటే దీనికి పెట్టే ధరకు ఈ బైక్ న్యాయం చేస్తుందా అని. ఈ ధరలో హోండా యాక్టివా, సుజుకి యాక్సెస్ వంటి స్కూటర్లు ఇంకా ఎక్కువ పెర్ఫార్మెన్స్‌ను అందిస్తాయి. అయితే తక్కువ దూరం ఉన్న ప్రయాణాలు చేసేవారికి ఈ స్కూటర్ సరిగ్గా సరిపోతుంది.
View this post on Instagram