అన్వేషించండి

GST Reduction Bike: ఈ రోజు నుంచి కేవలం రూ.55,000 కే లభించే బైక్ ఇది, మీరు ఎంత లాభపడతారంటే?

GST Reforms 2025: దేశంలో కొత్త GST స్లాబ్ ఈ రోజు నుంచి అమలవుతోంది. ఈ ప్రకారం, ద్విచక్ర వాహన కంపెనీలు తమ కస్టమర్లకు GST ప్రయోజనాలను బదిలీ చేశాయి.

GST Reduction Effect On Two-wheelers India: మన దేశవ్యాప్తంగా, కొత్త GST స్లాబులు ఈ రోజు (సెప్టెంబర్ 22, 2025) నుంచి అమల్లోకి వచ్చాయి. 350 సీసీ లోపు ఇంజిన్‌ ఉన్న బైకులు 28% GST పరిధి నుంచి 18% GST పరిధిలోకి మారాయి. దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్, 18% GST శ్లాబ్‌ ప్రకారం, తన ద్విచక్ర వాహనాలపై రూ. 15,743 వరకు ధర తగ్గింపును ప్రకటించింది. ఈ కంపెనీ అందిస్తున్న చవకైన బైక్ Hero HF Deluxe బైకు రేటు ఇప్పుడు రూ. 5,805 తగ్గింది. తత్ఫలితంగా, ఈ బైక్ ధర ఇప్పుడు రూ. 54,933 నుంచి ప్రారంభం అవుతుంది. తెలుగు రాష్ట్రాల వినియోగదారులకు ఇది పెద్ద శుభవార్తగా మారింది.

హీరో బైక్‌లు చవక

తెలుగు రాష్ట్రాల్లో, హీరో HF డీలక్స్ ధర నిన్నటి వరకు రూ. 60,738 గా ఉండేది, ఈ రోజు నుంచి 10% జీఎస్టీ తగ్గింపుతో ఈ బండిని రూ. 54,933 ఎక్స్‌-షోరూమ్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. 

హీరో కంపెనీ, తన బెస్ట్ సెల్లింగ్ బైక్ Hero Splendor Plus ధరను రూ. 6,820 తగ్గించింది. ఈ బైక్ ప్రారంభ ధర ఇప్పుడు రూ. 80,166 నుంచి రూ. 73,346 కు తగ్గింది.

కోతను ప్రకటించిన బజాజ్ ఆటో 

బజాజ్ ఆటో, తన ద్విచక్ర వాహనాలపై రూ. 20,000 వరకు ఆకర్షణీయమైన తగ్గింపులు ప్రకటించింది. 

ఈ బ్రాండ్‌లోని అత్యంత చవకైన బైక్ అయిన Bajaj CT 110X ధర ఇప్పుడు రూ. 6,500 తగ్గింది. దీంతో, ఈ టూవీలర్‌ ప్రారంభ ధర రూ. 67,561 నుంచి ఇప్పుడు రూ. 61,000 కు దిగి వచ్చింది. 

Bajaj Pulsar EV కూడా దాదాపు రూ. 8,000 ప్రైస్‌ డిస్కౌంట్‌ పొందింది, దీంతో ఈ బైక్ ఇప్పుడు మరింత పోటీ ధరలో లభిస్తోంది.

యమహా మోటార్స్ జీఎస్టీ ఆఫర్‌ 

జీఎస్‌టీ 2.0 కారణంగా, యమహా మోటార్స్‌ కూడా తన టూవీలర్ల ధరలను కాస్త నేల వరకు దించింది. 

స్కూటర్లు & బైకులకు ఈ కంపెనీ రూ. 17,581 ధర తగ్గింపును ప్రకటించింది. కొన్ని మోడళ్లపై బీమా ప్రయోజనాలను యమహా మోటార్స్‌ అందిస్తోంది. 

స్పోర్ట్స్‌ బైక్ అభిమానులకు యమహా గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఈ బ్రాండ్‌లోని పాపులర్‌ స్పోర్ట్స్ బైక్ Yamaha R15 ధరను ఈ రోజు నుంచి రూ. 15,761 తగ్గింది, ఇప్పుడు ఈ బండి ధర రూ. 1.74 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో వినియోగదారులకు లాభం

హైదరాబాద్‌, విజయవాడ సహా అన్ని తెలుగు నగరాలు, పట్టణాల్లో ఈ తగ్గింపులు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. బైక్ కొనాలని ప్లాన్‌ చేస్తున్న యువతకు ఇది మంచి అవకాశంగా మారింది. ముఖ్యంగా ఎంట్రీ లెవల్‌ బైక్‌ల ధరలు 55 వేలు నుంచి ప్రారంభం కావడం వల్ల బడ్జెట్‌ ఫ్రెండ్లీ ఆప్షన్‌లు పెరిగాయి.

జీఎస్టీ తగ్గింపు వల్ల బైక్ మార్కెట్‌లో మళ్లీ ఉత్సాహం పెరగనుంది. హీరో, బజాజ్, యమహా మాత్రమే కాకుండా హోండా, టీవీఎస్ వంటి కంపెనీలు కూడా ధరలను సవరించాయి. కాబట్టి, ఈ పండుగ సీజన్‌లో తెలుగు రాష్ట్రాల వినియోగదారులకు బైక్ కొనుగోలు మరింత లాభదాయకం కానుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Goa Fire Accident: గోవా నైట్ క్లబ్‌లో విషాదం.. సిలిండర్ పేలుడుతో 25 మంది మృతి- విచారణకు ఆదేశించిన సీఎం
గోవా నైట్ క్లబ్‌లో విషాదం.. సిలిండర్ పేలుడుతో 25 మంది మృతి- విచారణకు ఆదేశించిన సీఎం
Tirupati Crime News: విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగిక దాడి, గర్భం దాల్చిన బాధితురాలు.. తిరుపతిలో దారుణం
విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగిక దాడి, గర్భం దాల్చిన బాధితురాలు.. తిరుపతిలో దారుణం
Virat Kohli Records: సచిన్ ఆల్ టైమ్ రికార్డును బద్దలుకొట్టిన విరాట్ కోహ్లీ.. ప్రపంచంలో నెంబర్ 1 బ్యాటర్
సచిన్ ఆల్ టైమ్ రికార్డును బద్దలుకొట్టిన విరాట్ కోహ్లీ.. ప్రపంచంలో నెంబర్ 1 బ్యాటర్
Sonarika Bhadoria : పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ హీరోయిన్ - కపుల్‌కు వెల్లువెత్తుతున్న విషెష్
పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ హీరోయిన్ - కపుల్‌కు వెల్లువెత్తుతున్న విషెష్
Advertisement

వీడియోలు

Yashasvi Jaiswal Century vs SA | వన్డేల్లోనూ ప్రూవ్ చేసుకున్న యశస్వి జైశ్వాల్ | ABP Desam
Rohit Sharma Virat Kohli Comebacks | బీసీసీఐ సెలెక్టర్లుకు, కోచ్ గంభీర్ కి సౌండ్ ఆఫ్ చేసిన రోహిత్, కోహ్లీ | ABP Desam
Virat Kohli vs Cornad Grovel Row | నోటి దురదతో వాగాడు...కింగ్ బ్యాట్ తో బాదించుకున్నాడు | ABP Desam
Virat kohli No Look six vs SA | తనలోని బీస్ట్ ను మళ్లీ బయటకు తీస్తున్న విరాట్ | ABP Desam
Ind vs SA 3rd ODI Highlights | సెంచరీతో సత్తా చాటిన జైశ్వాల్..సిరీస్ కొట్టేసిన భారత్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Goa Fire Accident: గోవా నైట్ క్లబ్‌లో విషాదం.. సిలిండర్ పేలుడుతో 25 మంది మృతి- విచారణకు ఆదేశించిన సీఎం
గోవా నైట్ క్లబ్‌లో విషాదం.. సిలిండర్ పేలుడుతో 25 మంది మృతి- విచారణకు ఆదేశించిన సీఎం
Tirupati Crime News: విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగిక దాడి, గర్భం దాల్చిన బాధితురాలు.. తిరుపతిలో దారుణం
విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగిక దాడి, గర్భం దాల్చిన బాధితురాలు.. తిరుపతిలో దారుణం
Virat Kohli Records: సచిన్ ఆల్ టైమ్ రికార్డును బద్దలుకొట్టిన విరాట్ కోహ్లీ.. ప్రపంచంలో నెంబర్ 1 బ్యాటర్
సచిన్ ఆల్ టైమ్ రికార్డును బద్దలుకొట్టిన విరాట్ కోహ్లీ.. ప్రపంచంలో నెంబర్ 1 బ్యాటర్
Sonarika Bhadoria : పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ హీరోయిన్ - కపుల్‌కు వెల్లువెత్తుతున్న విషెష్
పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ హీరోయిన్ - కపుల్‌కు వెల్లువెత్తుతున్న విషెష్
Telangana Rising Global Summit Agenda: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అజెండా ఖరారు.. హాజరయ్యే సినీ, క్రీడా ప్రముఖులు వీరే
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అజెండా ఖరారు.. హాజరయ్యే సినీ, క్రీడా ప్రముఖులు వీరే
హ్యుందాయ్ క్రెటాను ఢీకొట్టనున్న MG Hector Facelift.. త్వరలో మార్కెట్లోకి, ఫీచర్లు చూశారా
హ్యుందాయ్ క్రెటాను ఢీకొట్టనున్న MG Hector facelift.. త్వరలో మార్కెట్లోకి, ఫీచర్లు చూశారా
Savitri : 'మహానటి' సావిత్రి... పాత్ర తప్ప ఆమె కనిపించేవారు కాదు - మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
'మహానటి' సావిత్రి... పాత్ర తప్ప ఆమె కనిపించేవారు కాదు - మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
Indigo Show Cause Notice: ఇండిగో సీఈవోకు DGCA నోటీసులు.. గందరగోళంపై చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం
ఇండిగో సీఈవోకు DGCA నోటీసులు.. గందరగోళంపై చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం
Embed widget