అన్వేషించండి

Global NCAP Rating: క్రాష్ టెస్టులో ఏ కారుకు ఎంత స్కోరు - బెస్ట్ సేఫ్టీ వేటిలో ఉంది?

Global NCAP Cars Safety Rating: గ్లోబల్ ఎన్‌సీఏపీ రేటింగ్ నిబంధనలు మార్చాక 13 కార్లకు టెస్టింగ్ చేశారు. వేటికి ఎంత రేటింగ్ వచ్చింది?

Global NCAP Tested Cars: కొత్త గ్లోబల్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్ ప్రోటోకాల్ అమలు చేసి ఒక సంవత్సరం దాటింది. కొత్త ప్రోటోకాల్ ప్రకారం ఈఎస్సీ పెడెస్ట్రియల్ ప్రొటెక్షన్, సైడ్ ఇంపాక్ట్, సీట్ బెల్ట్ రిమైండర్ కోసం గ్లోబల్ ఎన్‌సీఏపీ అందించే స్కోర్‌లను సాధించినప్పుడు మాత్రమే వాహనం 5 స్టార్ రేటింగ్‌ను పొందుతుంది. ఈ కొత్త ప్రోటోకాల్ కింద ఇప్పటివరకు 13 మేడ్ ఇన్ ఇండియా మోడల్స్‌ను పరీక్షించారు.

మారుతి సుజుకి స్విఫ్ట్
మారుతి స్విఫ్ట్ వయోజన ఆక్యుపెంట్ సేఫ్టీ టెస్టింగ్‌లో 34 పాయింట్లకు 19.19 పాయింట్లను స్కోర్ చేసింది. అయితే పిల్లల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ కోసం 49 పాయింట్లకు 16.68 పాయింట్లను పొందింది. దీనికి సింగిల్ స్టార్ రేటింగ్ ఇచ్చింది.

మారుతీ సుజుకి వాగన్ ఆర్
మారుతీ సుజుకి వాగన్ ఆర్ పెద్దల ప్రయాణీకుల భద్రతా పరీక్షలో 34 పాయింట్లకు 19.69 పాయింట్లను స్కోర్ చేసింది. ఇందులో సింగిల్ స్టార్ రేటింగ్ వచ్చింది. అయితే ఇది పిల్లల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ కోసం 49 పాయింట్లలో 3.40 స్కోరు మాత్రమే చేసి జీరో స్టార్ రేటింగ్ ఇచ్చింది.

మారుతీ సుజుకి ఎస్ ప్రెస్సో
వాగన్ ఆర్, స్విఫ్ట్, ఇగ్నిస్ లాగా, మారుతి ఎస్ ప్రెస్సో కూడా వయోజన ప్రయాణీకుల భద్రత కోసం సింగిల్ స్టార్ మాత్రమే స్కోర్ చేయగలిగింది. ఇది వయోజన ప్రయాణీకుల భద్రతా పరీక్షలో 34 పాయింట్లకు 20.03 స్కోర్ చేసింది. అయితే పిల్లల రక్షణ కోసం 49 పాయింట్లకు (జీరో స్టార్) 3.52 పాయింట్లు మాత్రమే వచ్చాయి.

మారుతి ఆల్టో కే10
అతి చిన్న మోడల్ అయినప్పటికీ ఆల్టో కే10 ఈ జాబితాలో అత్యధిక స్కోర్ చేసిన మారుతి మోడల్. ఆల్టో కే10 వయోజన ప్రయాణీకుల భద్రతా పరీక్షలో 34 పాయింట్లకు 21.67 పాయింట్లు స్కోర్ చేసింది. 2 స్టార్ రేటింగ్‌ను సంపాదించింది.

హ్యుందాయ్ వెర్నా
కొత్త హ్యుందాయ్ వెర్నా భారతదేశంలో ఫైవ్ స్టార్ రేటింగ్‌ను పొందిన మొదటి హ్యుందాయ్ కారుగా అవతరించింది. ఇది వయోజన ప్రయాణీకుల భద్రతా పరీక్షలో 34 పాయింట్లకు 28.18 పాయింట్లు స్కోర్ చేసింది. దీంతోపాటు 5 స్టార్ రేటింగ్‌ను పొందింది.

మహీంద్రా స్కార్పియో ఎన్
మహీంద్రా స్కార్పియో ఎన్ ఎస్‌యూవీ వయోజన ఆక్యుపెంట్ సేఫ్టీ టెస్టింగ్‌లో 34 పాయింట్లకు 29.25 స్కోర్ చేసింది. పిల్లల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్టింగ్‌లో, స్కార్పియో ఎన్ 49 పాయింట్లకు 28.93 స్కోర్ చేసింది. అలాగే 3 స్టార్ రేటింగ్‌ను పొందింది.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్
ఒకే ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడినందున ఫోక్స్‌వ్యాగన్, స్కోడా ఒకే విధమైన స్కోర్‌లను కలిగి ఉన్నాయి. కుషాక్, టైగన్ కొత్త టెస్టింగ్ ప్రోటోకాల్ కింద టెస్టింగ్‌కు వెళ్లిన మొదటి కార్లుగా నిలిచాయి. ఇవి 5 స్టార్ రేటింగ్‌ను పొందాయి.

ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్, స్కోడా స్లావియా
ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్, స్కోడా స్లావియా కూడా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించాయి. వయోజన ఆక్యుపెంట్ సేఫ్టీ టెస్టింగ్‌లో ఈ సెడాన్ కారు 34 పాయింట్లకు 29.71 పాయింట్లు స్కోర్ చేసింది.

టాటా నెక్సాన్
2023 ఫేస్‌లిఫ్ట్ మోడల్ వచ్చిన తర్వాత నెక్సాన్ గ్లోబల్ ఎన్‌సీఏపీ మరింత కఠినమైన టెస్టింగ్ ప్రోటోకాల్ కింద మూడోసారి క్రాష్ టెస్ట్‌కు వెళ్లింది. టాటా నెక్సాన్ ఇప్పటికే 5 స్టార్ రేటింగ్‌ను కలిగి ఉంది. కానీ ఈసారి కూడా పెద్దలు, పిల్లల భద్రతలో 5 స్టార్ రేటింగ్‌ను స్కోర్ చేసింది.

టాటా హారియర్, టాటా సఫారీ
టాటా మోటార్స్ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీలు హారియర్, సఫారీ, గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించాయి. కొత్త టాటా హారియర్, సఫారీ వయోజన ప్రయాణీకుల భద్రత కోసం 34 పాయింట్లకు 33.05 పాయింట్లు సాధించాయి.

Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Embed widget