అన్వేషించండి

Car Resale Value Tips: మీ కారుకు మంచి రీసేల్ వాల్యూ ఉండాలంటే ఉండాల్సిన టెక్నాలజీ ఇదే!

Car Resale Value Tips: కారు కొనేటప్పుడు సౌకర్యాలు, ఫీచర్లతోపాటు రీసేల్ వాల్యూ కూడా చూస్తున్నారు. భవిష్యత్‌లో కారు ఎంత విలువ చేస్తుందనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని కొంటున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కారు కొనేటప్పుడు రీసేల్ విలువ, ఐదేళ్ల తర్వాత ధర కీలకం.
  • ఆధునిక టెక్నాలజీ, భద్రతా ఫీచర్లు కారు విలువను పెంచుతాయి.
  • 6 ఎయిర్ బ్యాగ్స్, లెవల్-2 ADAS, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ ముఖ్యం.
  • టాటా, మహీంద్రా, హ్యుందాయ్, కియా మోడల్స్ అత్యుత్తమ రీసేల్ విలువ కలిగి ఉన్నాయి.

Car Resale Value Tips: భారతీయ ఆటోమొబైల్‌ మార్కెట్ ఇప్పుడు ఒక కీలకమైన మలుపులో ఉంది. ఒకప్పుడు కారు కొనాలంటే రంగు, మైలేజీ చూసేవారు, కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.  ఇప్పుడు కారు కొనేటప్పుడు కేవలం ప్రస్తుత అవసరాలే కాకుండా, ఐదేళ్ల తర్వాత ఆ కారును అమ్మితే ఎంత ధర వస్తుంది. అనే అంశానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రత్యేక టెక్నాలజీ, భద్రతా ప్రమాణాలు లేని కార్లు సెకండ్‌ హ్యాండ్ మార్కెట్‌లో చాలా వేగంగా తమ విలువను కోల్పోతున్నాయి. 

మీ పెట్టుబడికి భద్రతనిస్తూ భవిష్యత్తులో అత్యుత్తమ రీసేల్ విలువను అందించే భారతీయ ఎస్‌యూవీ మోడళ్లు, వాటిలోని ఫ్యూచర్ ప్రూఫ్‌ టెక్నాలజీ గురించి తెలుసుకుందాం. 

రీసేల్‌ విలువను శాసించే బిగ్‌5 టెక్నాలజీ

వనరుల విశ్లేషణ ప్రకారం మీ కారు త్వరగా అవుట్‌డేటెడ్ కాకుండా ఉండాలంటే ఈ ఐదు ఫీచర్లు ఉండటం చాలా అవసరం. 

భారత్‌ ఎన్‌సీఏపీ  అండ్ 6 ఎయిర్‌ బ్యాగ్స్‌

ప్రస్తుతం భద్రత అనేది ఒక ప్రాథమిక అవసరంగా మారింది. 6 ఎయిర్‌ బ్యాగ్స్‌ లేని కార్లు భవిష్యత్‌లో ప్రమాదకరమైనవిగా భావిస్తున్నారు. టాటా, మహీంద్రా వంటి కంపెనీలు ఇప్పటికే ఈ ప్రమాణాలకు అనుగుణంగానే కార్లు తయారీ చేస్తున్నాయి. 

లెవల్‌-2 ADAS

ఇది కేవలం హెచ్చరికలు ఇవ్వడమే కాకుండా కారును పాక్షికంగా నియంత్రించగలదు. 

కనెక్టెడ్ కార్ టెక్నాలజీ

10 ఇంచుల కంటే పెద్ద ఇన్ఫోటన్‌మెంట్‌ స్క్రీన్‌, OTA అప్‌డేట్స్, రిమోట్‌ ఏసీ కంట్రోల్‌ వంటి ఫీచర్లు లేకపోతే కారు ఓల్డ్‌ ఫ్యాషన్‌గా ముద్ర పడుతుంది. 
అడాప్టివ్‌క్రూజ‌ , లేన్ కీప్ అసిస్ట్‌ 

ఇలాంటి పీచర్లు కలిపి ఉన్నప్పుడు దానిని లెవల్‌ -2 పిలుస్తారు. ఇది హైవే ప్రయాణాల్లో ప్రాణ రక్షణగా మారుతుంది.  

360 డిగ్రీల కెమెరా 

ఇరుకైన రోడ్లు పార్కింగ్ స్థలాల్లో స్క్రాచ్‌లు పడకుండా కారును కాపాడుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. 

ESC, TPM

వర్షంలో లేదా మలుపుల్లో కారు స్కిక్ అవ్వకుండా కాపాడే ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్, టైర్‌లో గాలిని పర్యవేక్షించే TPMS ఇప్పుడు మాండేటరీ అవుతాయి. 

అత్యుత్తమ రీసేల్‌ వాల్యూ ఉన్న ఎస్‌యూవీ మోడల్స్

ప్రస్తుతం చాలా మోడళ్లు ఈ ఐదు ఫీచర్స్‌తో వస్తున్నాయి. వాటిలో కొన్ని వివరాలు ఇస్తున్నాం. వాటి గురించి తెలుసుకుందాం. 

టాటా నెక్సాన్‌, పంచ్‌

ఇవి భారత్ ఎన్‌క్యాప్‌ ఫైవ్ స్టార్ రేటింగ్ కలిగి ఉండటమే కాకుండా, బేస్ వేరియంట్‌ నుంచే ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను అందిస్తున్నాయి. టాటా ఐరా కనెక్టెడ్‌టెక్నాలజీ వీటికి అదనపు విలువను ఇస్తుంది. 

మహీంద్ర XUV700& XUV 3XO 

ఈ మోడళ్లు టెక్నాలజీకి మారుపేరుగా నిలుస్తున్నాయి. లెవల్‌ -2 అడాస్‌ సామాన్యులకు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా ఎక్స్‌యూవీ 700 లోని అడాప్టివ్‌ క్రూజ్ కంట్రోల్‌ వంటి ఫీచర్లు దీని రీసేల్‌ విలువను పెంచుతున్నాయి. 

హ్యూదాయ్‌ క్రెటా& కియా స్టెలోస్‌

ఈ మోడళ్లు టెక్నాలజీలో తోపులుగా ఉన్నాయి. లెవల్‌ -2 అడాస్‌, 360 డిగ్రీ కెమెరా బ్లూలింక్‌ లేదా కియా కనెక్ట్ వంటి అత్యుత్తమ కనెక్టెడ్ ఫీచర్లు వీటిని ఎప్పుడూ ట్రెండ్‌లో ఉంచుతాయి. 

టాటా హారియర్‌, సపారీ 

వీటి ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్లు 5- స్టార్ సేఫ్టీ, లెవల్ -2 అడాస్‌తో వస్తున్నాయి. ఇది వీటికి ఫ్యూచర్ ప్రూఫ్‌ మోడళ్లుగా మార్చింది. 

Frequently Asked Questions

కారు రీసేల్ విలువను ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి?

ప్రత్యేక టెక్నాలజీ, భద్రతా ప్రమాణాలు, భారత్ ఎన్‌సీఏపీ రేటింగ్, 6 ఎయిర్‌ బ్యాగ్స్‌, లెవల్‌-2 ADAS, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, 360 డిగ్రీల కెమెరా, ESC, TPM వంటి ఫీచర్లు కారు రీసేల్ విలువను పెంచుతాయి.

భవిష్యత్తులో అవుట్‌డేటెడ్ కాకుండా ఉండటానికి కారులో ఏ ఐదు ముఖ్యమైన టెక్నాలజీలు ఉండాలి?

భారత్‌ ఎన్‌సీఏపీ  అండ్ 6 ఎయిర్‌ బ్యాగ్స్‌, లెవల్‌-2 ADAS, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, 360 డిగ్రీల కెమెరా, ESC, TPM వంటి ఫీచర్లు కారును ఫ్యూచర్ ప్రూఫ్‌గా చేస్తాయి.

అత్యుత్తమ రీసేల్ విలువ కలిగిన కొన్ని SUV మోడల్స్ ఏమిటి?

టాటా నెక్సాన్‌, పంచ్‌, మహీంద్ర XUV700 & XUV 3XO, హ్యూదాయ్‌ క్రెటా & కియా స్టెలోస్‌, టాటా హారియర్‌, సపారీ వంటి మోడల్స్ మంచి రీసేల్ విలువను అందిస్తాయి.

లెవల్-2 ADAS అంటే ఏమిటి మరియు దాని ప్రయోజనం ఏమిటి?

లెవల్-2 ADAS అనేది హెచ్చరికలు ఇవ్వడమే కాకుండా కారును పాక్షికంగా నియంత్రించగలదు. అడాప్టివ్‌క్రూజ‌ , లేన్ కీప్ అసిస్ట్‌ వంటి ఫీచర్లు దీని కిందకి వస్తాయి, ఇవి హైవే ప్రయాణాల్లో భద్రతను పెంచుతాయి.

టాప్ హెడ్ లైన్స్

Honda ADV160 Vs ప్రత్యామ్నాయాలు.. ఏ స్కూటర్ బెటర్‌గా ఉంది? పూర్తి కంపారిజన్
హోండా ADV160 vs హీరో Xoom 160 vs యమహా Aerox 155 - యూత్‌కి తగిన స్కూటర్‌ ఏది?
జులై 31 వరకే ఛాన్స్.. Kawasaki Z900పై అదిరిపోయే ఆఫర్ ప్రకటించిన డీలర్
యువతకు కవాసాకి బంపర్ గిఫ్ట్.. Z900 కొంటే ఇవి కూడా 'ఫ్రీ'గా మీ సొంతం!
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Bonda Uma TDP: అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ - త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
BCCI Coaching Sack: టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
Healthy Night Routine : మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
Uday Krishna Reddy Arrest: పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
PCOS vs Iron Deficiency : PCOS ఉంటే ఐరన్ తగ్గిపోతుందా? రెండింటి మధ్య సంబంధం ఏంటి? గైనకాలజిస్ట్ సూచనలివే
PCOS ఉంటే ఐరన్ తగ్గిపోతుందా? రెండింటి మధ్య సంబంధం ఏంటి? గైనకాలజిస్ట్ సూచనలివే
Embed widget