Citroen C3X: సిట్రోయెన్ సీ3ఎక్స్ లాంచ్ త్వరలోనే - ఫీచర్లు ఎలా ఉండనున్నాయి?
Citroen: ప్రముఖ కార్ల బ్రాండ్ సిట్రోయెన్ తన కొత్త కారును మనదేశంలో లాంచ్ చేయనుంది. అదే సిట్రోయెన్ సీ3ఎక్స్.
Citroen New Car: కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ ఇండియా తన మూడో సీ-క్యూబ్ మోడల్‌ను భారతదేశంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కారు సీ3 ఎయిర్‌క్రాస్ ఆధారంగా రూపొందిన కూపే ఎస్‌యూవీ మోడల్ కావచ్చు. దీనికి సిట్రోయెన్ సీ3ఎక్స్ అని పేరు పెట్టనున్నట్లు తెలుస్తోంది. సిట్రోయెన్ తీసుకువస్తున్న ఈ కారు 2024లో మార్కెట్లోకి రానుంది. లాంచ్ చేసే సమయంలో దాని పెట్రోల్ వేరియంట్ మాత్రమే మార్కెట్లోకి రావచ్చు. 2025లో సీఎన్‌జీ వేరియంట్ వచ్చే అవకాశం కూడా ఉంది.
లాంచ్‌కు మరికొంత సమయం
ఒకట్రెండు వారాల్లో ఈ కారుకు సంబంధించిన సమాచారాన్ని కంపెనీ ప్రజలతో పంచుకోనున్నట్లు స్టెల్లాంటిస్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఆదిత్య జయరాజ్ ఆటోకార్ ఇండియాతో చెప్పారు. అంటే ఈ కొత్త మోడల్ సిట్రోయెన్ రాకకు మరికొంత సమయం ఉంది.
టాటా కర్వ్‌తో పోటీ
త్వరలో భారత్‌లో విడుదల కానున్న సిట్రోయెన్ సీ3ఎక్స్ బాడీ స్టైల్ సెడాన్ లాగా ఉంటుంది, కూపే వంటి రూఫ్ లైన్, స్కోడా సూపర్బ్ వంటి నాచ్‌బ్యాక్ కూడా ఈ కారు డిజైన్‌లో ఉండొచ్చు. సిట్రోయెన్ దీని డిజైన్‌కు ఎస్‌యూవీ-కూపే అని పేరు పెట్టింది. తద్వారా దీనిని ఇతర వాహనాల డిజైన్‌కు భిన్నంగా చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ కారు టాటా కర్వ్‌తో ప్రత్యక్షంగా పోటీ పడనుంది.
సిట్రోయెన్ సీ3ఎక్స్ పవర్‌ట్రెయిన్
సిట్రోయెన్ లాంచ్ చేసిన ఇతర సీ-క్యూబ్ మోడల్‌ల లాగా రాబోయే సీ3ఎక్స్ మోడల్ 110 హెచ్‌పీ సోల్ ద్వారా శక్తిని పొందుతుంది. అలాగే 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ అందించనున్నారు. ఈ కారు మాన్యువల్ లేదా టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడా రానుంది.
ఎప్పుడు లాంచ్?
సిట్రోయెన్ సీ3ఎక్స్ కారును ఈ సంవత్సరం జూన్ లేదా జూలై నెలలో ప్రారంభించవచ్చు. దీని లాంచ్ తేదీకి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ క్రాస్ఓవర్ సెడాన్ ఎలక్ట్రిక్ మోడల్ వచ్చే ఏడాది 2025 జనవరి లేదా ఫిబ్రవరిలో రానుందని తెలుస్తోంది.