Citroen New Car: సిట్రోయెన్ కొత్త ఆటోమేటిక్ కారు వచ్చేస్తుంది - ధర ఎంత ఉండవచ్చు?
Citroen New Car: సిట్రోయిన్ సీ3 ఎయిర్‌క్రాస్ ఆటోమేటిక్ వేరియంట్ మనదేశంలో అందుబాటులోకి రానుంది.
Citroen C3 Aircross Automatic: సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ ఆటోమేటిక్ వచ్చే వారం నుంచి దేశీయ మార్కెట్లో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. దీన్ని రూ. 25,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ కారు డెలివరీ కూడా వచ్చే కొద్ది నెలల్లోనే ప్రారంభం అవుతుందని అంచనా.
దీని ధర గురించి చెప్పాలంటే సీ3 ఎయిర్‌క్రాస్ ఆటోమేటిక్ ధర, మాన్యువల్ గేర్‌బాక్స్ వేరియంట్‌తో పోలిస్తే దాదాపు రూ. లక్ష వరకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీని ఎంట్రీ లెవల్ వేరియంట్‌ల ధరలు ప్రత్యర్థి కార్ల కంటే తక్కువగా ఉండవచ్చు.
ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లేకపోవడం వల్ల సీ3 ఎయిర్‌క్రాస్ కస్టమర్లకు తక్కువ ఆకర్షణీయంగా మారింది. చాలా మంది కొనుగోలుదారులకు ఇది తప్పనిసరిగా కలిగి ఉండవలసిన ఆప్షన్‌గా మారింది. కానీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ని పొందిన తర్వాత సిట్రోయెన్ ఆ కస్టమర్లను కూడా ఆకర్షించగలదు. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన ఎస్‌యూవీ కోసం చూస్తున్న వారికి సీ3 ఎయిర్‌క్రాస్ అమ్మకాలను పెంచడంలో కూడా ఇది సహాయపడుతుంది.
ఇండోనేషియాలో విక్రయిస్తున్న సీ3 ఎయిర్‌క్రాస్ ఆటోమేటిక్ మోడల్‌ను మనదేశంలో కూడా తీసుకురానున్నారు. 6 స్పీడ్ యూనిట్ జపనీస్ ట్రాన్స్‌మిషన్ తయారీదారు ఐసిన్ నుంచి తీసుకున్నారు. మాన్యువల్ వేరియంట్‌తో వచ్చే 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌నే ఆటోమేటిక్‌లో కూడా అందించనున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం మొదటి రెండు వేరియంట్లలో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఇండియాకు రానున్న ఆటోమేటిక్ సీ3 ఎయిర్‌క్రాస్ పవర్ లేదా టార్క్ అవుట్‌పుట్‌లో ఏమైనా మార్పు ఉంటుందా లేదా అనేది చూడాలి.
పోటీ వీటితో...
సీ3 ఎయిర్‌క్రాస్ ఆటోమేటిక్ భారతీయ మార్కెట్లో పోటీపడే మిడ్ రేంజ్ ఎస్‌యూవీ విభాగంలో క్రెటా, సెల్టోస్, కుషాక్, హైదర్, గ్రాండ్ విటారా వంటి వాహనాలు ఉన్నాయి.
Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!