News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Citroen 2CV: కారు చేసింది చెక్కతో - రేటు మాత్రం చుక్కల్లో - ఏకంగా రూ.1.85 కోట్లతో రికార్డు!

సిట్రోయెన్ వుడెన్ కారు రూ.1.85 కోట్లకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది.

FOLLOW US: 
Share:

Citroën 2 CV Wooden: సాధారణంగా కారును దేంతో తయారు చేస్తారు? లోహంతో కదా! కానీ ప్రముఖ కార్ల కంపెనీ సిట్రోయెన్ విభిన్నంగా ఆలోచించింది. పూర్తిగా చెక్కతో కారును తయారు చేసింది. అది కూడా కేవలం ఒకే ఒక్క యూనిట్ మాత్రమే. దీనికి సిట్రోయెన్ 2 సీవీ అని పేరు పెట్టింది. చెక్కతో చేసిన కారు ఎవరు కొంటాడులే అనుకున్నారా? అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. దీన్ని ఏకంగా 2.1 లక్షల యూరోలను చెల్లించి ఒక వ్యక్తి కొనుగోలు చేశాడు. అంటే మనదేశ కరెన్సీలో రూ.1.85 కోట్లకు పైమాటే.

ఈ కారు వేలం ఫ్రాన్స్‌లో జరిగింది. ఆదివారం సెంట్రల్ సిటీ ఆఫ్ టూర్స్‌లో వేలం ప్రక్రియ ప్రారంభమైనప్పుడు ఫ్రెంచ్-రిజిస్టర్డ్ కారే ఈవెంట్ అంతటా ఆకర్షణీయంగా ఉంది. దీన్ని కొనుగోలు చేసిన వారి ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి.

కొనుగోలు చేసిన వ్యక్తి ఏమన్నాడు?
జీన్-పాల్ ఫావాండ్ అనే వ్యక్తి ఈ కారును కొనుగోలు చేశారు. తర్వాత టెలిఫోన్ ద్వారా మీడియాతో మాట్లాడుతూ, ‘2సీవీ ఒక దృఢమైన శరీరంతో తయారు అయింది. ఇది ప్రపంచ యుద్ధం I తర్వాతి ఫ్రెంచ్ క్లాసిక్ తరహాలో ఉంది.’ అన్నాడు. అయితే దీన్ని కొనుగోలు చేసిన వ్యక్తి పారిస్‌లోని మ్యూజియం ఆఫ్ వింటేజ్ ఫెయిర్‌గ్రౌండ్ అట్రాక్షన్స్ యజమాని. దీంతో ఈ కారు ఆ మ్యూజియంలోకే చేరనుంది. దీనికి రిజిస్ట్రేషన్ నంబర్ ఏమీ లేదు. చెక్కతో చేసిన కారు కాబట్టి జాగ్రత్తగా తీసుకెళ్లాల్సి ఉంది.

Read Also: అదిరిపోయే ఫీచర్లు, సూపర్ స్టైలిష్ లుక్, టాటా మోటార్స్ నుంచి రాబోతున్న 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

రికార్డు ధరకు అమ్ముడు పోయిన కారు
వేలం నిర్వహించిన సంస్థ ఈ కారు కోసం 150,000 - 200,000 యూరోల గైడ్ ధరను జారీ చేసింది. వేలం పాటలో ముగిశాక ఆఖరి సారి సుత్తిని కొట్టినప్పుడు వేలం నిర్వాహకుడు ఐమెరిక్ రౌయిలాక్ ఈ విక్రయాన్ని రికార్డ్‌గా ప్రకటించాడు. 2 సీవీ విషయంలో మునుపటి రికార్డు 172,000 యూరోలు అని అతను చెప్పాడు.

Read Also: సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకుంటున్నారా - ఈ ఐదు విషయాలు చూసుకోకపోతే కష్టమే!

అనేక చెక్కలను ఉపయోగించారు
వాహనం రెక్కలు వాల్‌నట్‌తో తయారు చేశారు. దాని చట్రం పియర్, యాపిల్ చెట్టుతో తయారు అయింది. దీన్ని రూపొందించిన మిచెల్ రాబిల్లార్డ్... కారు సంబంధించిన బోనెట్, బూట్ కోసం చెర్రీ కలపను ఉపయోగించారు. 2011 నుంచి తాను ఐదు సంవత్సరాల పాటు కష్టపడి ఈ కారును రూపొందించారు. 5,000 గంటల పాటు కష్టపడి ఈ కారును తయారు చేశానని మిచెల్ రాబిల్లార్డ్ మీడియాకు చెప్పారు. వేలానికి ముందు వాహనాన్ని పాలిష్ చేస్తూ, "ఇది నా కుమార్తె. నాకు ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు. ఇది నా చిన్న కుమార్తె" అన్నారు. రాబోయే కొన్నేళ్లకు తన వద్ద మరో "క్రేజీ ప్రాజెక్ట్" ఉందని చెప్పాడు.

త్వరలో మరో మోడల్‌
రాబిల్లార్డ్ మరొక ఫ్రెంచ్ క్లాసిక్ - సిట్రోయెన్ డీఎస్‌కు సంబంధించిన చెక్క వెర్షన్‌ను రూపొందించాలని యోచిస్తున్నాడు. 2025కు సిట్రోయెన్ డీఎస్ లాంచ్ అయి 70 సంవత్సరాలు పూర్తవుతుందని తెలిపాడు. ఆ సమయానికి చెక్క వెర్షన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Published at : 05 Jun 2023 07:32 PM (IST) Tags: Car News Cars Citroen Cars Citroen Record

ఇవి కూడా చూడండి

సెకండ్ హ్యాండు కారును అమ్మాలనుకుంటున్నారా? - మంచి రేటు రావాలంటే ఏం చేయాలి?

సెకండ్ హ్యాండు కారును అమ్మాలనుకుంటున్నారా? - మంచి రేటు రావాలంటే ఏం చేయాలి?

2023 Hyundai i20 N Line: కొత్త హ్యుందాయ్ ఐ20 లాంచ్ - ధర రూ.10 లక్షలలోపే!

2023 Hyundai i20 N Line: కొత్త హ్యుందాయ్ ఐ20 లాంచ్ - ధర రూ.10 లక్షలలోపే!

Hyundai Alcazar Facelift: హ్యుందాయ్ అల్కజార్‌ను అప్‌డేట్ చేయనున్న కంపెనీ - ధర ఎంత ఉండవచ్చు? ఏం మారుతుంది?

Hyundai Alcazar Facelift: హ్యుందాయ్ అల్కజార్‌ను అప్‌డేట్ చేయనున్న కంపెనీ - ధర ఎంత ఉండవచ్చు? ఏం మారుతుంది?

Car Buying Tips: మీరు కారు కొనాలి అనుకుంటున్నారా? ముందుగా ఈ 5 విషయాలు తెలుసుకోండి

Car Buying Tips: మీరు కారు కొనాలి అనుకుంటున్నారా? ముందుగా ఈ 5 విషయాలు తెలుసుకోండి

Tata Motors: బ్యాడ్ న్యూస్ - ఈ టాటా వాహనాల ధరలు మూడు శాతం పెంపు!

Tata Motors: బ్యాడ్ న్యూస్ - ఈ టాటా వాహనాల ధరలు మూడు శాతం పెంపు!

టాప్ స్టోరీస్

BRS Leaders For Chandrababu : చంద్రబాబుకు తెలంగాణ బీఆర్ఎస్ నేతల సపోర్ట్ - జగన్ పై విమర్శలు ! రాజకీయం ఉందా ?

BRS Leaders For Chandrababu :  చంద్రబాబుకు తెలంగాణ బీఆర్ఎస్ నేతల సపోర్ట్ - జగన్ పై విమర్శలు ! రాజకీయం ఉందా ?

Chandrababu Arrest : విశాఖలో టీడీపీ కొవొత్తుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ తో ఉద్రిక్తత

Chandrababu Arrest : విశాఖలో టీడీపీ కొవొత్తుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ తో ఉద్రిక్తత

Sintex: తెలంగాణలో రూ.350 కోట్లతో సింటెక్స్ తయారీ యూనిట్, 1000 మందికి ఉద్యోగాలు

Sintex: తెలంగాణలో రూ.350 కోట్లతో సింటెక్స్ తయారీ యూనిట్, 1000 మందికి ఉద్యోగాలు

కాంగ్రెస్‌ లో ఉంటే, ఏ పదవీ లేకపోయినా గౌరవంగా బతకొచ్చు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

కాంగ్రెస్‌ లో ఉంటే, ఏ పదవీ లేకపోయినా గౌరవంగా బతకొచ్చు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి