అన్వేషించండి

2027 నుంచి పవర్డ్‌ డోర్‌ హ్యాండిల్స్‌పై చైనా నిషేధం ఎందుకు? దీని వెనుక ఉన్న భయంకరమైన కారణాలు ఇవే

ఎలక్ట్రిక్‌ కార్లలో పవర్డ్‌ డోర్‌ హ్యాండిల్స్‌ ప్రాణాంతకమని చైనా భావించింది. ప్రమాదాల్లో ప్రయాణికులు చిక్కుకుపోతున్న ఘటనలతో మెకానికల్‌ హ్యాండిల్స్‌ బిగించడాన్ని తప్పనిసరి చేసింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • చైనాలో 2027 నుండి కార్లకు మెకానికల్ డోర్ హ్యాండిల్స్ తప్పనిసరి.
  • విద్యుత్ ఆగిపోతే డోర్లు తెరవడంలో ఇబ్బందులు, ప్రమాదాలు.
  • తీవ్ర ప్రమాదాల్లో, నీటిలో మునిగితే ప్రాణాలకు ముప్పు.
  • చిన్నారులు, వృద్ధులకు కొత్త హ్యాండిల్స్ వల్ల గాయాలు.

Car Powered Door Handle Ban In China: ఎలక్ట్రిక్‌ వాహనాల డిజైన్‌లో స్టైల్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే ట్రెండ్‌కు చైనా బ్రేక్‌ వేసింది. ఇప్పటివరకు ఆధునికతకు గుర్తుగా భావించిన "పవర్డ్‌ లేదా ఫ్లష్‌ లేదా హిడెన్‌ డోర్‌ హ్యాండిల్స్‌" ఇక చైనా కార్లపై కనిపించకుండా పోవచ్చు. 2027 జనవరి 1 నుంచి అమ్ముడయ్యే అన్ని కార్లలో... లోపల, బయట రెండు వైపులా పని చేసే మెకానికల్‌ డోర్‌ రిలీజ్‌ సిస్టమ్‌ తప్పనిసరి అని చైనా ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ నిర్ణయం వెనుక అసలు కారణం ఏమిటి?

2024 జులైలో చైనా ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ కార్ల భద్రతపై ప్రత్యేక సమీక్ష ప్రారంభించింది. దీనికి కారణం కొన్ని భయానక రోడ్డు ప్రమాదాలు. ముఖ్యంగా రెండు Xiaomi ఎలక్ట్రిక్‌ కార్లు ఢీకొన్న తర్వాత మంటలు చెలరేగాయి. ఆ సమయంలో పవర్‌ పూర్తిగా కట్‌ కావడంతో డోర్లు తెరుచుకోలేదు. లోపల ఉన్నవారు బయటకు రావడానికి అవకాశం లేక ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనలు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. “డిజైన్‌ కోసం ప్రాణాల్ని పణంగా పెట్టాలా?” అనే ప్రశ్న బలంగా వినిపించింది.

పవర్డ్‌ డోర్‌ హ్యాండిల్స్‌లో ఉన్న అసలు ప్రమాదం

పవర్డ్‌ డోర్‌ హ్యాండిల్స్‌ పూర్తిగా విద్యుత్‌పై ఆధారపడి పని చేస్తాయి. బ్యాటరీ డిశ్చార్జ్‌, షార్ట్‌ సర్క్యూట్‌, తీవ్రమైన ప్రమాదాల్లో పవర్‌ ఫెయిల్‌ అయితే....

డోర్లు ఆటోమేటిక్‌గా లాక్‌ అవుతాయి

లోపల ఉన్నవారు బయటకు రావడం కష్టమవుతుంది

ముఖ్యంగా వెనుక సీట్లో కూర్చున్నవారికి మాన్యువల్‌ ఆప్షన్‌ కనిపించదు

అగ్ని ప్రమాదం లేదా నీటిలో వాహనం మునిగే పరిస్థితుల్లో ఇది ప్రాణాంతకంగా మారుతుంది.

పిల్లలు, వృద్ధులకు మరో ప్రమాదం

ఫ్లష్‌ డిజైన్‌ ఉన్న పవర్డ్‌ హ్యాండిల్స్‌ వల్ల వేళ్ల గాయాలు కూడా పెరుగుతున్నాయి. చిన్నపిల్లలు, వృద్ధులు ఈ హ్యాండిల్స్‌ను సరిగా ఆపరేట్‌ చేయలేక గాయపడుతున్న ఘటనలు ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్నాయి. బయటికి ఉబ్బి ఉండే సాధారణ హ్యాండిల్స్‌లా రక్షణ లేకపోవడం దీనికి కారణం.

ఎమర్జెన్సీ సిబ్బందికి ఎదురవుతున్న సమస్యలు

ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టే సిబ్బందికి కూడా పవర్డ్‌ హ్యాండిల్స్‌ పెద్ద అడ్డంకిగా మారాయి. విద్యుత్‌ పని చేయకపోతే డోర్‌ తెరవడానికి ఎక్కువ సమయం పడుతోంది. కొన్ని సందర్భాల్లో ఈ ఆలస్యం ప్రాణ నష్టానికి దారి తీస్తోంది.

కొత్త నిబంధనల్లో ఏముంది?

2027 నుంచి అన్ని కొత్త కార్లలో మెకానికల్‌ డోర్‌ రిలీజ్‌ తప్పనిసరి

లోపల, బయట రెండు వైపులా నుంచీ సులభంగా కనిపించేలా డిజైన్‌

విద్యుత్‌తో సంబంధం లేకుండా పని చేయాలి

ఇప్పటికే ఉన్న మోడళ్లకు 2029 వరకు గడువు

గ్లోబల్‌ ఆటో రంగంపై ప్రభావం

చైనా తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ ఆటోమొబైల్‌ రంగాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. చైనా మార్కెట్‌ చాలా పెద్దది కాబట్టి, ఇతర దేశాల తయారీదారులు కూడా భద్రతపై కొత్తగా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది.

స్టైల్‌ కన్నా ప్రాణాలు ముఖ్యం అనే స్పష్టమైన సందేశంతో చైనా ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ప్రపంచం మొత్తం దీనిని ఎంతవరకు అనుసరిస్తుందో చూడాలి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Frequently Asked Questions

చైనాలో కార్ల డోర్ హ్యాండిల్స్ పై కొత్త నిబంధనలు ఎప్పుడు నుండి అమల్లోకి వస్తాయి?

2027 జనవరి 1 నుండి చైనాలో అమ్మే అన్ని కార్లలో మెకానికల్ డోర్ రిలీజ్ సిస్టమ్ తప్పనిసరి. ప్రస్తుతం ఉన్న మోడళ్లకు 2029 వరకు గడువు ఉంది.

పవర్డ్ డోర్ హ్యాండిల్స్ వల్ల కలిగే ప్రధాన సమస్య ఏమిటి?

విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పుడు, ముఖ్యంగా ప్రమాదాలు లేదా బ్యాటరీ సమస్యల వల్ల, డోర్లు ఆటోమేటిక్ గా లాక్ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల లోపల ఉన్నవారు బయటకు రావడానికి ఇబ్బంది పడతారు.

ఈ కొత్త నిబంధనల వెనుక ప్రధాన కారణం ఏమిటి?

కొన్ని భయానక రోడ్డు ప్రమాదాలు, ముఖ్యంగా Xiaomi ఎలక్ట్రిక్ కార్ల ప్రమాదం తర్వాత, భద్రతపై దృష్టి సారించారు. పవర్ కట్ అయినప్పుడు డోర్లు తెరచుకోకపోవడం ప్రాణ నష్టానికి దారితీసింది.

పవర్డ్ డోర్ హ్యాండిల్స్ వల్ల పిల్లలు మరియు వృద్ధులకు ఎలాంటి ప్రమాదం ఉంది?

ఫ్లష్ డిజైన్ ఉన్న పవర్డ్ హ్యాండిల్స్ ను పిల్లలు, వృద్ధులు సరిగా ఆపరేట్ చేయలేక వేలి గాయాలకు గురవుతున్నారు. సాధారణ హ్యాండిల్స్ లా రక్షణ ఉండకపోవడం దీనికి కారణం.

టాప్ హెడ్ లైన్స్

రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
BMW X1 LWB Petrol Review: BMWలో అత్యంత విలువైన SUV! అదిరిపోయే లగ్జరీస్‌తో వస్తున్న X1 LWB!
BMWలో అత్యంత విలువైన SUV! అదిరిపోయే లగ్జరీస్‌తో వస్తున్న X1 LWB!
Ferrari First EV:ఆక్షన్‌లో 382 కోట్లకు అమ్ముడైన Ferrari తొలి EV!
ఆక్షన్‌లో 382 కోట్లకు అమ్ముడైన Ferrari తొలి EV!
RE క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ లాంచ్‌.. కొత్త గ్రీన్‌ కలర్‌తో అదిరిపోయే లుక్‌! ధర ఎంతో తెలుసా?
ఆర్మీ స్ఫూర్తితో RE క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ లాంచ్‌.. ఎంత బాగుందో!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget