అన్వేషించండి

EV Range: ఈవీ రంగంలో సరికొత్త విప్లవం! ఒకసారి ఛార్జ్ చేస్తే 1500 కిలోమీటర్లు ప్రయాణం! 8 నిమిషాల ఛార్జింగ్‌తో 500KM దూసుకెళ్లొచ్చు!

EV Range: మార్చి 18న నిర్వహించిన తన ప్రతిష్టాత్మక బ్యాటరీ నైట్‌ ఈవెంట్‌లో చెర్రీ సంస్థ ఈ అద్భుతమైన రైనో బ్యాటరీ సిరీస్‌ను ఆవిష్కరించింది.

 EV Range: ప్రపంచ ఈవీ రంగంలో మరో చారిత్రాత్మక మలుపు తిరిగింది. ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ కార్ల యజమానులను వేధిస్తున్న అతి పెద్ద సమస్య రేంజ్‌ ఆందోళన. అంటే బ్యాటరీ ఛార్జింగ్‌ అయిపోతే మధ్యలో ఆగిపోతామేమో అన్న భయానికి ఇక కాలం చెల్లనుంది. చైనాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ చెర్రీ ఆటోమొబైల్‌ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఏకంగా 1500 కిలోమీటర్లు కంటే ఎక్కువ దూరం దూసుకెళ్లే సామర్థ్యం ఉన్న సరికొత్త బ్యాటరీ సాంకేతికతను ప్రపంచానికి పరిచయం చేసింది. 

మార్చి 18న నిర్వహించిన తన ప్రతిష్టాత్మక బ్యాటరీ నైట్‌ ఈవెంట్‌లో చెర్రీ సంస్థ ఈ అద్భుతమైన రైనో బ్యాటరీ సిరీస్‌ను ఆవిష్కరించింది. ఇది కేవలం ప్రయోగాత్మక ప్రకటన మాత్రమే కాదని, రాబోయే ఏడాదిలోనే దీన్ని క్షేత్రస్థాయిలో పరీక్షలు ప్రారంభమవుతాయని సంస్థ స్పష్టం చేసింది. 

రైనో సిరీస్‌; ఆల్‌ సాలిడ్‌- స్టేట్ బ్యాటరీల రాక 

చెర్రీ ఆవిష్కరించిన ఈ కొత్త సాంకేతికతలో అత్యంత కీలకమైంది ఆల్‌ సాలిడ్‌ స్టేట్ బ్యాటరీ,. ప్రస్తుతం వాడుకలో ఉన్న లిథియం అయాన్ బ్యాటరీలతో పోలిస్తే ఇవి రెట్టింపు శక్తిని స్టోర్ చేస్తాయి. రైనో సిరీస్ బ్యాటరీలు 600Wh/kg ఎనర్జీ డెన్సిటీని కలిగి ఉన్నాయి. ఇది సాధారణ బ్యాటరీల కంటే చాలా ఎక్కువ. దీని వల్ల బ్యాటరీ పరిమాణం పెరగకుండానే ఎక్కువ దూరం ప్రయాణించే శక్తి లభిస్తుంది. చైనీస్‌ లైట్‌ డ్యూటీ వెహికల్‌ టెస్ట్ సైకిల్ నిబంధనల ప్రకారం ఈ బ్యాటరీ ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే 1500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించేలా చేస్తుంది. అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కేవలం రెండుసార్లు ఛార్జ్ చేస్తే సరిపోతుందన్నమాట. 

8 నిమిషాల్లో 500 కిలోమీటర్ల ఛార్జింగ్

చెర్రీ సంస్థ కేవలం రైనో బ్యాటరీతోనే ఆగలేదు. వేగవంతమైన ఛార్జింగ్ కోసం మరికొన్ని వినూత్న మోడళ్లను కూడా తీసుకొస్తోంది. ఇ- లిక్విడ్ బ్యాటరీ సెమీ సాలిడ్‌ స్టేట్ బ్యాటరీ. ఇది ఏకంగా 1200 కిలో వాట్ల ఛార్జింగ్ పవర్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇది కేవలం 8 నిమిషాల్లో ఛార్జింగ్ చేస్తే కారు 500 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. పెట్రోల్ బంకులో పెట్రోల్ నింపుకోవడానికి పట్టే సమయంలోనే మీ కారు బ్యాటరీ సగం కంటే ఎక్కువ ఛార్జ్ అవుతుంది. 400 కిలో వాట్ల సామర్థ్యంలో వస్తున్న సాలిడ్‌ స్టేట్ బ్యాటరీ ఎస్‌ సరీస్. దీనిని ప్రత్యేకంగా ఎక్సీడ్‌ ఈఎస్‌ సెడాన్ కార్ల కోసం రూపొందించారు. 

రోడ్లపైకి ఎప్పుడు తీసుకొస్తారు?

చెర్రీ ఆటోమొబైల్ తన ప్రణాళికలను స్పష్టంగా వెల్లడించింది. ఈ ఏడాది ఆఖరులో పరిమిత స్థాయిలో పరీక్షలు నిర్వహించి, వచ్చే ఏడాది నుంచి పూర్తి స్థాయిలో వాహన పరీక్షలు ప్రారంభించనుంది. ఈ రైనో బ్యాటరీ మొదటగా ఎక్సీడ్ ఈఎస్‌ 8 మోడల్‌లో పరీక్షించునున్నారు. 2027 నాటికి ఈ బ్యాటరీ టెక్నాలజీతో కూడిన కార్లు భారీ ఎత్తున మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

MG Majestor India Launch on April 20: ఫార్చ్యూనర్‌కు చెక్ పెట్టేందుకు 'మెజెస్టర్' వచ్చేస్తోంది..! ఎంజీ మోటార్ నుండి మోస్ట్ ప్రీమియం ఎస్‌యూవీ లాంచ్.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!
ఫార్చ్యూనర్‌కు చెక్ పెట్టేందుకు 'మెజెస్టర్' వచ్చేస్తోంది..! ఎంజీ మోటార్ నుండి మోస్ట్ ప్రీమియం ఎస్‌యూవీ లాంచ్.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!
Summer Road Trip Guide: సమ్మర్ లో లాంగ్ డ్రైవ్ వెళ్తున్నారా? మీ కారును ఇలా రెడీ చేసుకోండి,  సేఫ్ జర్నీ కోసం టిప్స్!
సమ్మర్ లో లాంగ్ డ్రైవ్ వెళ్తున్నారా? మీ కారును ఇలా రెడీ చేసుకోండి,  సేఫ్ జర్నీ కోసం టిప్స్!
Bajaj Pulsar 180 Vs Apache 180 Bikes: 180 సీసీ సెగ్మెంట్‌లో మళ్ళీ మొదలైన పోరు - పల్సర్ రీ-ఎంట్రీతో అపాచీకి చెక్!
180 సీసీ సెగ్మెంట్‌లో మళ్ళీ మొదలైన పోరు - పల్సర్ రీ-ఎంట్రీతో అపాచీకి చెక్!
Tata Sierra EV: రేంజ్‌లో టాటా సియెర్రా ఈవీ అన్నింటిని దాటుతుందా ? ఫీచర్లు, మైలేజీపై కస్టమర్లలో ఉత్కంఠ
రేంజ్‌లో టాటా సియెర్రా ఈవీ అన్నింటిని దాటుతుందా ? ఫీచర్లు, మైలేజీపై కస్టమర్లలో ఉత్కంఠ
Advertisement

వీడియోలు

SRH Bowling Disaster vs PBKS IPL 2026 | SRH బౌలింగ్ వైఫల్యంపై ఫ్యాన్స్ ఫైర్
Ayush Mhatre Retired Out IPL 2026 | సీఎస్కే మేనేజ్మెంట్ పై విమర్శల వర్షం
Sanju Samson Salute Celebration | కోచ్ కోసం సంజూ శాంసన్ సెల్యూట్
CSK vs DC IPL 2026 Sanju Samson Century | సంజూ శాంస‌న్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ
IPL 2026 CSK vs DC Highlights | బోణీ కొట్టిన చెన్నై
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India-Pakistan Border Surveillance: భారత్‌ సైనిక వ్యూహాత్మక స్థావరాలను చైనా కన్నుతో చూస్తోన్న పాక్‌!ఐఎస్‌ఐ కుట్రలు బహిర్గతం!
భారత్‌ సైనిక వ్యూహాత్మక స్థావరాలను చైనా కన్నుతో చూస్తోన్న పాక్‌!ఐఎస్‌ఐ కుట్రలు బహిర్గతం!
AI Wife: డిజిటల్ వరల్డ్ లోకి ఏఐ వైఫ్ ఆహ్వానం - సంతోషంగా సూసైడ్ చేసుకున్న వ్యక్తి - పిచ్చి ఇలా కూడా ముదిరిపోతోంది!
డిజిటల్ వరల్డ్ లోకి ఏఐ వైఫ్ ఆహ్వానం - సంతోషంగా సూసైడ్ చేసుకున్న వ్యక్తి - పిచ్చి ఇలా కూడా ముదిరిపోతోంది!
Nara Lokesh meets the President: పోరాడి సాధించిన విజయాలు చిరస్థాయిలో నిలిచిపోతాయి - అమరావతి రైతులకు రాష్ట్రపతి ప్రశంసలు
పోరాడి సాధించిన విజయాలు చిరస్థాయిలో నిలిచిపోతాయి - అమరావతి రైతులకు రాష్ట్రపతి ప్రశంసలు
Varanasi Leaks : 'వారణాసి' బోట్ యాక్షన్ సీన్ లీక్? - ఆ ప్రచారంలో నిజమెంత!... లీకుల బెడద తప్పలేదా...
'వారణాసి' బోట్ యాక్షన్ సీన్ లీక్? - ఆ ప్రచారంలో నిజమెంత!... లీకుల బెడద తప్పలేదా...
Summer Diet : మండుతున్న సూరీడు.. హాట్ సమ్మర్​లో హీట్​ని తగ్గించుకునేందుకు ఏమి తింటే మంచిది? ఏమి తినకూడదు? 
మండుతున్న సూరీడు.. హాట్ సమ్మర్​లో హీట్​ని తగ్గించుకునేందుకు ఏమి తింటే మంచిది? ఏమి తినకూడదు? 
Singer Mangli vs Subbarao: మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన లాయర్ సుబ్బారావుకు షాక్! బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసిన పోలీసులు
మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన లాయర్ సుబ్బారావుకు షాక్! బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసిన పోలీసులు
PM Modi on Women Reservations: మహిళా రిజర్వేషన్ల అమలు చారిత్రక ఘట్టం, 2029 ఎన్నికల నుంచే వర్తింపు: ప్రధాని మోదీ
మహిళా రిజర్వేషన్ల అమలు చారిత్రక ఘట్టం, 2029 ఎన్నికల నుంచే వర్తింపు: ప్రధాని మోదీ
Pocharam Srinivas Reddy: నిధుల కోసం మంత్రుల కాళ్లు మొక్కాలా? చావైనా బతుకైనా సరే తేల్చుకుంటా: పోచారం శ్రీనివాస్ రెడ్డి
నిధుల కోసం మంత్రుల కాళ్లు మొక్కాలా? చావైనా బతుకైనా సరే తేల్చుకుంటా: పోచారం శ్రీనివాస్ రెడ్డి
Embed widget