Top 10 Scooters in India: కొత్త స్కూటీ కొనాలనుకుంటున్నారా? - అయితే ఈ టాప్-10 స్కూటీలపై ఓ లుక్కేయండి!
మీరు స్కూటీ కొనాలనుకుంటున్నారా? దేశంలో ఉన్న ఈ టాప్-10 స్కూటీల లిస్ట్ చూడండి.
Top 10 Scooters in India: దేశంలో నవరాత్రి నుంచి పండగ సీజన్ ప్రారంభం కానుంది. ఈ సమయంలో ప్రజలు తమ కోసం కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. ఈ కారణంగా పండుగ సీజన్‌లో వాహనాల విక్రయాల సంఖ్య పెరుగుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కంపెనీలు తమ వాహనాలపై ప్రత్యేక తగ్గింపు ఆఫర్లను కూడా వినియోగదారులకు అందిస్తున్నాయి. ప్రస్తుతం మనం దేశంలోని టాప్-10 స్కూటర్ల గురించి తెలుసుకుందాం.
హోండా యాక్టివా 6జీ
దేశంలోనే హోండా అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్ ఇదే. హోండా యాక్టివా 6జీ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 76,234 నుంచి మొదలవుతుంది. ఇది టాప్ మోడల్‌కి రూ. 82,734 వరకు పెరుగుతుంది.
హోండా యాక్టివా 125
ఇది యాక్టివాకు సంబంధించిన 125 సీసీ మోడల్. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 79,806 నుంచి రూ. 88,979 మధ్యలో ఉంటుంది.
టీవీఎస్ జూపిటర్
ఇది భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన రెండో స్కూటర్. టీవీఎస్ జూపిటర్ ధర రూ. 73,240 నుంచి రూ. 89,105 ఎక్స్ షోరూమ్ మధ్యలో ఉంది.
హోండా డియో
హోండా డియో స్కూటర్ మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 70,211 నుంచి రూ. 77,712 మధ్యలో ఉంటుంది.
సుజుకి యాక్సెస్ 125
ఈ స్కూటర్ 125 సీసీ సెగ్మెంట్‌లో బాగా ప్రాచుర్యం పొందింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.79,899 నుంచి రూ.90,000 మధ్యలో ఉంది.
టీవీఎస్ ఎక్స్ఎల్100
టీవీఎస్ ప్రముఖ మోపెడ్ మోడల్ ఎక్స్ఎల్100 ముఖ్యంగా రూరల్ మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 44,999 నుంచి రూ. 59,695 మధ్యలో నిర్ణయించారు.
హీరో జూమ్
హీరో మోటోకార్ప్ జూమ్ స్కూటర్ కూడా బాగా ప్రాచుర్యం పొందింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 70,184 నుండి రూ. 78,517 మధ్య ఉంటుంది.
ఓలా ఎస్1 ప్రో
ఇది భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్. ఓలా ఎస్1 ప్రో ఎక్స్ షోరూమ్ ధర రూ. 1.40 లక్షల నుంచి రూ. 1.47 లక్షల మధ్య ఉంది.
ఏథర్ 450ఎక్స్
ఏథర్ ఎనర్జీ అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఏథర్ 450ఎక్స్‌ను రూ. 1.26 లక్షల నుంచి రూ. 1.30 లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో కొనుగోలు చేయవచ్చు.
టీవీఎస్ ఐక్యూబ్
ఇది టీవీఎస్‌కు సంబంధించి అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్. టీవీఎస్ ఐక్యూబ్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 1.25 లక్షల నుంచి రూ. 1.62 లక్షల మధ్య ఉంటుంది.
మరోవైపు ఆస్టన్ మార్టిన్ తన కొత్త సూపర్‌కార్‌ను భారతదేశంలో విడుదల చేసింది. దీనిని సూపర్ టూరర్ అని కూడా పిలుస్తారు. డీబీ11 స్థానంలో ఈ కొత్త డీబీ12 మార్కెట్లోకి వచ్చింది. ఇది గతంలో ఆస్టన్ మార్టిన్ శ్రేణిలో ఫ్లాగ్‌షిప్ జీటీగా నిలిచింది. కొత్త డీబీ12లో 4.0 ట్విన్ టర్బో వీ8 ఇంజిన్‌ను కంపెనీ అందించనుంది. జేమ్స్ బాండ్ సినిమాల ద్వారా ఆస్టన్ మార్టిన్ బ్రాండ్ చాలా పేరు సంపాదించింది.
Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?
Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial