Royal Enfield Upcoming Bikes: బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్ - రాయల్ ఎన్‌ఫీల్డ్ త్వరలో లాంచ్ చేయనున్న బైక్స్ ఇవే!
రాయల్ ఎన్‌ఫీల్డ్ త్వరలో మూడు బైక్‌లను లాంచ్ చేయనుందని తెలుస్తోంది.
Royal Enfield Bikes: దిగ్గజ బైక్ తయారీదారు రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ ఏడాది ప్రారంభంలో తన మెటోర్ 650 మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. అంతే కాకుండా కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ బైక్ 'ఎలక్ట్రిక్ 01'ను 2024లో విడుదల చేయనుంది. దీంతో పాటు తన పోర్ట్‌ఫోలియోను విస్తరించడానికి మరో మూడు బైక్‌లను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రాంబ్లర్ 650
ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ డిస్‌ప్లేలో చూడటానికి ఇంటర్‌సెప్టర్ 650ని పోలి ఉంటుంది. అయితే ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 మాదిరిగానే కొన్ని ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో రౌండ్ హెడ్‌లైట్, రియర్ వ్యూ మిర్రర్, టెయిల్‌లైట్, టర్న్ ఇండికేటర్స్ టియర్ డ్రాప్ షేప్ ఫ్యూయల్ ట్యాంక్ ఉన్నాయి. దానికి స్పోర్టీ లుక్ కూడా ఉంది. 648 సీసీ ఎయిర్/ఆయిల్ కూల్డ్, ప్యారలల్ ట్విన్ ఇంజన్ ఇందులో ఇవ్వవచ్చు, ఇది 47.6 పీఎస్ పవర్ ఇవ్వగలదు. ఈ బైక్‌ను 2024లో విడుదల చేసే అవకాశం ఉంది. దీని ధర దాదాపు 3.5 లక్షల రూపాయలు ఉండవచ్చు.
రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650
రాబోయే ఈ బైక్ డిజైన్ గురించి చెప్పాలంటే టియర్‌డ్రాప్ ఆకారపు ఇంధన ట్యాంక్, వెనుక స్వీప్ట్ హ్యాండిల్‌బార్, స్ప్లిట్ స్టైల్ సీట్, ట్విన్ ఎగ్జాస్ట్ సిస్టమ్, వెనుక సెట్ ఫుట్‌పెగ్‌లు వంటి ఫీచర్లను ఇందులో చూడవచ్చు. అదే సమయంలో ఇది 648cc ప్యారలల్ ట్విన్, ఎయిర్, ఆయిల్-కూల్డ్ ఇంజిన్‌తో రానుంది. ఇది గరిష్టంగా 47 హెచ్‌పీ శక్తిని, 52 ఎన్ఎం అత్యధిక టార్క్‌ను అందించగలదు. రైడర్ భద్రత కోసం ముందు, వెనుక చక్రాలపై డిస్క్ బ్రేక్‌లను చూడవచ్చు. దీని ధర సుమారు 4.5 లక్షల రూపాయలుగా నిర్ణయించే అవకాశం ఉంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ GT
ఈ బైక్‌ను అప్‌డేట్ చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఈ మోడల్ జీటీ-ఆర్ 650పై బేస్ అయి ఉంటుంది. దీనిలో సెమీ డిజిటల్ ట్విన్ పాడ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ట్యూబ్యులర్ గ్రాబ్ రైల్, ఫోర్క్ గైటర్స్, స్క్వేర్ ఆకారపు LED టెయిల్‌ల్యాంప్‌లను హెడ్‌లైట్‌లో ఇవ్వవచ్చు. ఇది కాకుండా రైడర్ భద్రత, మెరుగైన బ్రేకింగ్ పనితీరు కోసం డ్యూయల్ ఛానల్ ఏబీఎస్‌తో ముందు, వెనుక చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు అందిస్తారు. ఈ బైక్ 648 సీసీ ఇంజన్‌తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ బైక్ ధర దాదాపు 4 లక్షల రూపాయలు ఉండవచ్చు.
రాయల్ ఎన్‌ఫీల్డ్ 2023 మార్చికి తన విక్రయాల నివేదికను విడుదల చేసింది. ఈ కాలంలో కంపెనీ మొత్తం 72,235 మోటార్‌సైకిళ్లను విక్రయించింది. మార్చి 2022లో కంపెనీ మొత్తం 67,677 యూనిట్లను విక్రయించింది. అంటే రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన ఏడు శాతం పెరిగాయన్న మాట.
2022-23 ఆర్థిక సంవత్సరంలో, రాయల్ ఎన్‌ఫీల్డ్ మొత్తం 8,34,895 మోటార్‌సైకిళ్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇది కంపెనీకి అత్యధిక విక్రయాలు. ఈ సంఖ్య 2021-22 కంటే 39% ఎక్కువ. కంపెనీ 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొదటిసారిగా 1,00,000 వాహనాలను ఎగుమతి చేసింది. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరం కంటే కంటే 23 శాతం ఎక్కువ. అదే సమయంలో, కంపెనీ దేశీయ మార్కెట్లో గత సంవత్సరంతో పోలిస్తే 41 శాతం పెరుగుదలతో 7,34,840 యూనిట్లను విక్రయించింది.