MS Dhoni: మహేంద్ర సింగ్ ధోని టాప్-5 కార్ కలెక్షన్ - ఆర్మీ స్పెషల్ కారు కూడా గ్యారేజ్‌లో!
మహేంద్ర సింగ్ ధోని దగ్గరున్న టాప్ 5 కార్లు ఇవే.
Mahendra Singh Dhoni Best Car Collection: భారత క్రికెట్ జట్టుకు మాజీ కెప్టెన్ అయిన మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు మాత్రమే కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. మనదేశంలో క్రికెట్ కేవలం ఆట మాత్రమే కాదని అందరికీ తెలిసిందే. టాప్ లీగ్ క్రికెటర్లకు దేశం అంతటా సూపర్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. గ్లామరస్ లైఫ్ కూడా క్రికెటర్ల సొంతం. అలాంటి విలాసవంతమైన జీవితం మహేంద్ర సింగ్ ధోని సొంతం. ధోనికి కార్లంటే ఎంతో ఇష్టం. ఆ విషయం అందరికీ తెలిసిందే. తన దగ్గర ఉన్న టాప్ 5 కార్లు ఏంటో చూద్దాం...
ఫెరారీ 599 జీటీవో (Ferrari 599 GTO)
మహేంద్ర సింగ్ ధోని దగ్గర ఉన్న కార్లలో ఫెరారీ 599 జీటీవో ప్రత్యేకమైనది. ఇది ఫెరారీ తయారు చేసిన లిమిటెడ్ ఎడిషన్ కార్లలో ఒకటి. ఇందులో 6.0 లీటర్ వీ12 ఇంజిన్ ఉంది. 661 హార్స్ పవర్‌ను ఇది అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటలకు 334 కిలోమీటర్లుగా ఉంది.
జీప్ గ్రాండ్ చెరోకీ ట్రాక్‌హాక్ (Jeep Grand Cherokee Trackhawk)
రగ్డ్ నెస్, పెర్ఫార్మెన్స్ రెండిటినీ పర్‌ఫెక్ట్‌గా మిక్స్ చేయడంలో జీప్ గ్రాండ్ చెరోకీ హాక్‌ట్రాక్ ముందంజలో ఉంటుంది. సూపర్ ఛార్జ్‌డ్ వీ8 ఇంజిన్‌ను ఈ కారులో అందించారు. 707 హార్స్ పవర్‌ను ఈ కారు ప్రొడ్యూస్ చేయనుంది. లగ్జరియస్ ఇంటీరియర్, అదిరిపోయే ఆఫ్ రోడ్ సామర్థ్యం ఈ కారు సొంతం. ఈ కారును మనదేశంలో కొనుగోలు చేసిన మొదటి వ్యక్తి ధోనినే.
పొంటియాక్ ఫైర్‌బర్డ్ ట్రాన్స్ ఏఎం (Pontiac Firebird Trans AM)
ఇది ఒక వింటేజ్ కారు. 1967 నుంచి 2002 మధ్య ఈ కారును రూపొందించారు. క్లాసిక్ అమెరికన్ స్టైలిష్ కారు ఇదని చెప్పవచ్చు. చరిత్రలో ఉన్న మోస్ట్ ఐకానిక్ మజిల్ కార్లలో ఇది కూడా ఒకటి. వింటేజ్ కార్లు అంటే ధోనికి ఎంత ఇష్టమో ఈ కారును చూసి తెలుసుకోవచ్చు.
నిస్సాన్ జోంగా (Nissan Jonga)
మహేంద్ర సింగ్ ధోని దగ్గర కేవలం పవర్ ఫుల్ వాహనాలు మాత్రమే కాకుండా చరిత్రకు సంబంధించిన వాహనాలు కూడా ఉంటాయి. భారత సైనిక దళాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన నిస్సాన్ జోంగా కూడా మహేంద్ర సింగ్ ధోని దగ్గర ఉంది. నిస్సాన్ జోంగా అనేది కేవలం కారు మాత్రమే కాదు. మనదేశంలో చరిత్రకు ఒక చిహ్నం.
Read Also: సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకుంటున్నారా - ఈ ఐదు విషయాలు చూసుకోకపోతే కష్టమే!
హమ్మర్ (Hummer)
రోడ్డుపై హమ్మర్‌ను ఛాలెంజ్ చేయాలంటే అది కేవలం కొన్ని వాహనాలకు మాత్రమే సాధ్యం అవుతుంది. అంత కెపాసిటీ ఉన్న హమ్మర్ కూడా మహేంద్ర సింగ్ ధోని గ్యారేజ్‌లో ఉంది. పవర్, డామినెన్స్, ఆఫ్ రోడ్ సామర్థ్యం ఇందులో ఉన్నాయి. ధోని లార్జర్ దేన్ లైఫ్ పర్సనాలిటీకి ఈ కారు సరిగ్గా సరిపోతుంది.
Read Also: అదిరిపోయే ఫీచర్లు, సూపర్ స్టైలిష్ లుక్, టాటా మోటార్స్ నుంచి రాబోతున్న 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!