350cc కంటే తక్కువ ఇంజిన్ ఉన్న బైక్‌లపై GST రేటు 28% నుండి 18%కి తగ్గించబడింది. దీనివల్ల బైక్‌ల ధరలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.
Affordable Bikes in India : దేశంలో అత్యంత చవకైన 5 బైక్‌లు ఏవి? రూ. 55 వేల నుంచి ప్రారంభమయ్యే టూవీలర్స్ గురించి తెలుసుకోండి
Best Bikes in India : జీఎస్టీ మార్పులు చేర్పుల తర్వాత చాలా బైక్‌ల ధరలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. తక్కువ ధర, ఎక్కువ మైలేజ్ కావాలనుకునే వాళ్ల కోసం టాప్ 5 చౌకైన బైక్‌ల వివరాలు ఇక్కడ ఇస్తున్నాం.

Affordable Bikes in India : కొత్త GST రేట్ల తర్వాత బైక్స్ విషయంలో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా 350cc కంటే తక్కువ ఇంజిన్ కలిగిన బైక్‌లపై GST రేటు 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. దీంతో బైక్‌ల రేట్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. దీనివల్ల మధ్యతరగతి ప్రజలకు ఇప్పుడు మోటార్‌సైకిల్ కొనడం మరింత సులభం అవుతుంది. మీరు కొత్త బైక్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, ఇక్కడ మేము మీకు 5 చవకైన బైక్‌ల ఎంపికల గురించి చెప్పబోతున్నాము.
హీరో HF డీలక్స్
ఇలా మధ్యతరగతి ప్రజలు కొనుక్కోగల టూ వీలర్స్ జాబితాలో మొదటిది హీరో HF డీలక్స్ . ఈ బైక్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న చవకైన బైక్‌లలో ఒకటి. GST తగ్గింపు తర్వాత, దీని ధర దాదాపు 5 వేల 800 రూపాయలు తగ్గింది. కాబట్టి, ఇప్పుడు ఈ బైక్ మునుపటి కంటే మరింత బడ్జెట్ ఫ్రెండ్లీగా మారింది. ఇప్పుడు ఈ బైక్ ధర 55 వేల 992 రూపాయలు ఎక్స్-షోరూమ్ ధర.
టీవీఎస్ స్పోర్ట్
రెండో బైక్ టీవీఎస్ స్పోర్ట్ కూడా అద్భుతమైన మైలేజ్ ఇస్తుంది. ధర కూడా అందరికీ అందుబాటులో ఉంటుంది. GST తగ్గింపు తర్వాత కూడా ఈ బైక్ ధరల్లో చాలా మార్పులు వచ్చాయి. ఈ విధంగా, ఈ బైక్ ప్రారంభ ధర ఇప్పుడు 55 వేల 100 రూపాయలు ఎక్స్-షోరూమ్ ధర. మీ నగరాన్ని బట్టి ఈ ధరలో మార్పు ఉంటుంది.
Also Read: TVS Zest SXC - ₹75,500కే డిజిటల్ మీటర్, బ్లూటూత్ ఫీచర్లు, కూల్ లుక్‌తో యూత్‌కి కొత్త ఫేవరెట్
హోండా షైన్
హోండా షైన్ 100 కూడా GST తగ్గింపుతో పెద్ద ప్రయోజనం పొందింది. ఈ బైక్‌పై ఇప్పుడు 5600 రూపాయలు ఆదా అవుతుంది. బైక్, కొత్త ఎక్స్-షోరూమ్ ధర ఇప్పుడు 63 వేల 191 రూపాయలు. Shine 100లో 98.9cc సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఉంది. బైక్ 55-60 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.
హీలో స్ప్లెండర్ ప్లస్(Hero Splendor Plus )
Hero Splendor Plus అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్. GST తగ్గింపు తర్వాత, ఈ బైక్ ధర దాదాపు 6 వేల 800 రూపాయలు తగ్గింది. దీని కొత్త ధర ఇప్పుడు 73 వేల 902 రూపాయలు ఎక్స్-షోరూమ్ ధర.
బజాబ్ ప్లాటినా 100 (Bajaj Platina 100)
బజాబ్ ప్లాటినా 100 (Bajaj Platina) చవకైన ధర, మంచి మైలేజ్ కోసం ప్రసిద్ధి చెందింది. GST తగ్గింపు తర్వాత, Platina 100 ఎక్స్-షోరూమ్ ధర కేవలం 66 వేల 52 ఎక్స్-షోరూమ్ ధర. బైక్‌లో 102cc, DTS-I ఇంజిన్ ఉంది, ఇది లీటరుకు 70 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
Also Read: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 వచ్చేస్తోంది.. పవర్‌ఫుల్ ఇంజిన్, అద్భుతమైన ఫీచర్లు చూశారా
Frequently Asked Questions
కొత్త GST రేట్లు బైక్‌ల ధరలను ఎలా ప్రభావితం చేశాయి?
ప్రస్తుతం అందుబాటులో ఉన్న చవకైన బైక్‌లలో హీరో HF డీలక్స్ ధర ఎంత?
GST తగ్గింపు తర్వాత, హీరో HF డీలక్స్ బైక్ ధర సుమారు 5,800 రూపాయలు తగ్గింది. ఇప్పుడు దీని ఎక్స్-షోరూమ్ ధర 55,992 రూపాయలు.
టీవీఎస్ స్పోర్ట్ బైక్ ధర GST తగ్గింపు తర్వాత ఎంత ఉంది?
GST తగ్గింపు తర్వాత టీవీఎస్ స్పోర్ట్ బైక్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర 55,100 రూపాయలు. మీ నగరాన్ని బట్టి ఈ ధరలో స్వల్ప మార్పులు ఉండవచ్చు.
హోండా షైన్ 100 బైక్ ధరలో ఎంత ఆదా అవుతుంది?
హోండా షైన్ 100 బైక్‌పై GST తగ్గింపుతో 5,600 రూపాయలు ఆదా అవుతుంది. దీని కొత్త ఎక్స్-షోరూమ్ ధర 63,191 రూపాయలు.
బజాజ్ ప్లాటినా 100 బైక్ ధర ఎంత మరియు దీని మైలేజ్ ఎంత?
బజాజ్ ప్లాటినా 100 ఎక్స్-షోరూమ్ ధర 66,052 రూపాయలు. ఈ బైక్ లీటరుకు 70 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.





















