Honda Rebel 300 Bike Latest Updates: హోండా రెబెల్ 300 మోడల్ లాంఛ్.. ఈ క్లచ్ టెక్నాలజీలో బైక్ మార్కెట్ లో సంచలనాలు.. ఈ బైక్ ధర ఎంతంటే..?
బైక్ నడపడంలో క్లచ్ కీలకపాత్ర పోషిస్తోంది. సాధారణంగా క్లచ్ పైన నియంత్రణ లభిస్తేనే బైకును చాలా ఫర్ఫెక్టుగా నడపొచ్చు. తాజాగా హోండా కంపెనీ విప్లవాత్మక ఈ క్లచ్ టెక్నాలజీనీ తీసుకొచ్చింది.

E Clutch Technology Letest News: సంచలనాత్మక హోండా ఈ-క్లచ్ (Honda E-Clutch) టెక్నాలజీతో కూడిన 2026 హోండా రెబెల్ 300 (Rebel 300) మోటార్‌సైకిల్‌ను అమెరికా మార్కెట్‌లో తాజాగా విడుదల చేశారు. క్రూయిజర్ బైక్‌లకు సరికొత్త అనుభూతిని అందించే ఈ ఆవిష్కరణ ధర ను5,349 అమెరికన్ డాలర్లు (సుమారు రూ. 4.70 లక్షలు)గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ కొత్త సాంకేతికత కారణంగా బైక్ ధర దాని మై25 మోడల్ కంటే $500 పెరిగింది. హోండా ఇ-క్లచ్‌ను ఇంతకుముందు CB650R , CBR650R, అలాగే 250cc మోడల్స్ అయిన రెబెల్ 250 , CL250లలో పరిచయం చేసిన సంగతి తెలిసిందే. పెద్దగా మార్పులు లేకుండానే ఇప్పటికే ఉన్న ఇంజిన్లలో దీనిని అమర్చేలా హోండా దీన్ని రూపొందించింది. రైడర్‌కు మరింత సౌలభ్యం, సురక్షితమైన అనుభవాన్ని అందించే లక్ష్యంతో ఈ కొత్త టెక్నాలజీని తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.
ఇ-క్లచ్- పనితీరు , ఫీచర్లు
హోండా ఇ-క్లచ్ సాంకేతికతతో, రైడర్లు హ్యాండిల్‌బార్‌లో ఉన్న క్లచ్ లివర్‌ను ఉపయోగించకుండానే గేర్‌లను మార్చుకోవచ్చు. అయితే, క్లచ్‌ను ఉపయోగించడానికి అలవాటుపడిన రైడర్లకు లేదా మరింత నియంత్రణ కావాలనుకునేవారికి మాన్యువల్ ఆపరేషన్ అవకాశం కూడా ఉంది. క్లచ్‌ను వాడాలా వద్దా అనేది పూర్తిగా రైడర్ ఇష్టం. ఇది క్విక్-షిఫ్టర్ వలె కూడా పనిచేస్తుంది, అంటే రైడర్ ఫుల్-థ్రాటిల్‌లో ఉన్నప్పటికీ క్లచ్ ఉపయోగించకుండానే గేర్లు మార్చవచ్చు. ఈ వ్యవస్థ రైడర్ మాన్యువల్ క్లచ్‌ని ఉపయోగించిన వెంటనే ఆటోమేటిక్ క్లచ్ ఆపరేషన్ నుండి మాన్యువల్ మోడ్‌కు మారుతుంది, ,క్లచ్ లివర్‌ను వదిలివేసిన వెంటనే తిరిగి క్లచ్‌లెస్ మోడ్‌కు వస్తుంది.
చాలా ఉపయోగకరం..
ఇది కొత్త రైడర్‌లకు ఎంతో ఉపయోగకరమని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎందుకంటే తప్పు క్లచ్ వాడకం వల్ల ఇంజిన్ ఆగిపోయే (stalls) సమస్యను ఇది పూర్తిగా తొలగిస్తుందని తెలుస్తోంది. స్టార్ట్-అప్ నుండి ప్రయాణం, ఆపడం వరకు క్లచ్ ఆపరేషన్లను సజావుగా నియంత్రించడం ద్వారా, రైడర్లు క్లచ్‌పై దృష్టి మరల్చకుండా, రోడ్డుపై మరింత దృష్టి సారించవచ్చని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. . రెబెల్ 300 E-Clutch మోడల్‌లో 286 సిసి, లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజన్ ఉంది. ఇది 25 హెచ్‌పి పవర్ ,23.86 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి ఇ-క్లచ్‌తో కూడిన 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ జతచేయబడింది. పియర్ల్ స్మోకీ గ్రే ,మ్యాట్ బ్లాక్ మెటాలిక్ అనే రెండు రంగులలో లభిస్తున్న ఈ క్రూయిజర్‌లో ఇతర ప్రధాన మార్పులేవీ లేవు. దీని సీటు ఎత్తు కేవలం 690 mmగా ఉంటుందని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏదేమైనా కొత్త సాంకేతికను పరిచయం చేసే హోండా కంపెనీ మరోసారి అదే తరహాలో నూతన టెక్నాలజీని బైక్ రంగంలో కూడా ప్రవేశ పెట్టిందని బైక్ లవర్స్ ఆనందిస్తున్నారు. ఈ బైక్ ఇండియన్ మార్కెట్లోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని భారతీయ బైకు ప్రియులు ఎదురు చూస్తున్నారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
Before You Go
West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















