అన్వేషించండి

Sunroof Using Tips: కారుకి సన్‌రూఫ్ ఉందని ఫోజులు కొడితే మూల్యం చెల్లించుకోక తప్పదు! ఈ రూల్స్ గురించి తెలుసుకోండి!

Sunroof Using Tips: కారులోకి వెలుతురు, స్వచ్ఛమైన గాలి కోసం సన్ రూఫ్‌ను కారులో పెట్టారు. దీని నుంచి బయటకు వచ్చి ఫొటోలకు ఫోజులు ఇవ్వడానికి కాదు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సన్​రూఫ్​ తెరిచి వేగంగా వెళ్లే కారులోంచి బయటకు రావడం ప్రమాదకరం.
  • ప్రమాదకర డ్రైవింగ్​ కింద పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు.
  • సాధారణ ఉల్లంఘనకు జరిమానా, తీవ్రతను బట్టి లైసెన్స్​ రద్దు చేస్తారు.
  • సన్​రూఫ్​ సరైన వినియోగం, ట్రాఫిక్​ నియమాల పాటించడం ముఖ్యం.

Sunroof Using Tips:  భారత్ మార్కెట్‌లో లోబడ్జెట్‌లోనే సన్‌రూఫ్ కార్లు వస్తున్నాయి. ఇలా సన్‌రూఫ్ ఉన్న వారంతా  స్టైల్‌ ప్రదర్శిస్తుంటారు. వేగంగా వెళ్తున్న కారులో సన్‌రూఫ్‌ ఓపెన్ చేసి బయటకు వస్తూ ఫొటోలకు, వీడియోలకు ఫోజులు ఇస్తున్నారు.  ఈ మధ్య కాలంలో ఇలాంటి వీడియోలు చాలానే వైరల్ అవుతున్నాయి. ఇదీ చూడటానికి సరదాగానే ఉన్నా దీని వెనుక చాలా ప్రమాదం దాగి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది ట్రాఫిక్ ఉల్లంఘనకు కూడా దారి తీసే ఛాన్స్ ఉందని అంటున్నారు. 

మొదటగా భద్రతాపరమైన ఆందోళనలను పక్కన పెడితే, కదులుతున్న కారు నుంచి సన్‌రూఫ్‌ ద్వారా బయటకు రావడం అత్యంత ప్రమాదకరం. ఒక వేళ కారు అకస్మాత్తుగా బ్రేకులు వేసినా, కుదుపులు గురైనా, లేదా రోడ్డుపై ఏదైనా సమస్య ఎదురైనా ఆ వ్యక్తి తన బ్యాలెన్స్ కోల్పోతాడు. దీని కారణంగా గాయాలపాలయ్యే అవకాశం ఉంది. అంతే కాకుండా, రోడ్డు పక్కన ఉన్న చెట్లు, స్తంభాలు, లేదా విద్యుత్ తీగలు కూడా ప్రమాదాన్ని కలిగించవచ్చు. అందుకే రహదారి భద్రత దృష్ట్యా ఇది సురక్షితం కాదని అంటున్నారు. 

జరిమానాతో చర్య తీసుకోవచ్చు

చట్టపరంగా, మోటారు వాహనాల చట్టం సన్‌రూఫ్‌ ద్వారా బయటకు వెళ్లడానికి స్పష్టంగా ప్రస్తావించనప్పటికీ అది ప్రమాదకరమైన చర్యగా లేదా నిర్లక్ష్యపు డ్రైవింగ్‌గా పరిగణిస్తారు. అటువంటి సందర్భాల్లో పోలీసులు మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 177 లేదా సెక్షన్ 184 కింద చర్య తీసుకోవచ్చు. 

పరిస్థితిపై జరిమానా ఆధారపడి ఉంటుంది. సాధారణ ఉల్లంఘనకు చిన్న జరిమానా విధించవచ్చు. కానీ ప్రమాదకరమైన డ్రైవింగ్‌కు పాల్పడితే, జరిమానా వెయ్యి నుంచి పదివేల వరకు ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో, డ్రైవర్‌ లైసెన్స్‌ను రద్దు చేయవచ్చు. లేదా మరింత కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. 

అటువంటి చర్యల వల్ల ప్రమాదం జరిగినా లేదా ఎవరి ప్రాణానికైనా ప్రమాదం వాటిల్లినా, ఆ విషయం మరింత తీవ్రమవుతుంది. అలాంటి పరిస్థితిలో పోలీసులు కేసు నమోదు చేసి శిక్ష విధించవచ్చు. 

ఎల్లప్పుడూ ట్రాఫిక్ నియమాలను పాటించాలి

సన్‌రూఫ్‌ ముఖ్య ఉద్దేశం కారులోకి వెలుతురు, స్వచ్ఛమైన గాలిని తీసుకురావడం మాత్రమే, అంతేకానీ దానిలో నిలబడి బయటకు రావడం కాదు. కారు తయారీదారులు దీనిని ఈ ఉద్దేశంతో రూపొందిస్తారు. అందువల్ల సన్‌రూఫ్‌నుు సరిగా ఉపయోగించకపోవడం అనేది నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా, మీ భద్రతకు, ఇతరుల భద్రతకు కూడా తీవ్రమైన ముప్పును కలిగిస్తుంది. కేవలం సరదా కోసం లేదా సోషల్ మీడియా కోసం చేసే ఈ చర్య, మీకు తీవ్ర నష్టాన్ని కలిగించవచ్చు. కాబట్టి ఎల్లప్పుడూ ట్రాఫిక్‌ నియమాలను పాటిస్తూ సురక్షితంగా వాహనం నడపడం మంచిది.    

Frequently Asked Questions

వేగంగా వెళ్తున్న కారులో సన్‌రూఫ్‌ ఓపెన్ చేసి బయటకు రావడం సురక్షితమేనా?

లేదు, వేగంగా వెళ్తున్న కారులో సన్‌రూఫ్‌ ద్వారా బయటకు రావడం అత్యంత ప్రమాదకరం. అనుకోని బ్రేకులు, కుదుపులు, లేదా రోడ్డు సమస్యల వల్ల బ్యాలెన్స్ కోల్పోయి గాయపడే అవకాశం ఉంది.

సన్‌రూఫ్‌ ద్వారా బయటకు రావడానికి చట్టపరమైన చర్యలు ఉన్నాయా?

అవును, ఇది ప్రమాదకరమైన చర్యగా లేదా నిర్లక్ష్యపు డ్రైవింగ్‌గా పరిగణించబడుతుంది. పోలీసులు మోటారు వాహనాల చట్టం సెక్షన్ 177 లేదా 184 కింద జరిమానా విధించవచ్చు, కొన్నిసార్లు లైసెన్స్‌ను రద్దు చేయవచ్చు.

సన్‌రూఫ్‌ను ఏ ఉద్దేశంతో రూపొందించారు?

సన్‌రూఫ్‌ ముఖ్య ఉద్దేశం కారులోకి వెలుతురు, స్వచ్ఛమైన గాలిని తీసుకురావడం మాత్రమే. దానిలో నిలబడి బయటకు రావడానికి కాదు.

సన్‌రూఫ్‌ ద్వారా బయటకు రావడానికి సంబంధించిన చర్యల వల్ల తీవ్ర నష్టం కలుగుతుందా?

అవును, కేవలం సరదా కోసం లేదా సోషల్ మీడియా కోసం చేసే ఈ చర్య మీకు, ఇతరులకు తీవ్ర నష్టాన్ని కలిగించవచ్చు. ప్రమాదం జరిగితే చట్టపరమైన చర్యలు తీవ్రమవుతాయి.

టాప్ హెడ్ లైన్స్

8 స్పీడ్‌ AT నుంచి సీట్‌ మసాజర్‌ వరకు.. కొత్త స్కోడా స్లావియాలో వచ్చిన ఇంప్రూవ్‌మెంట్స్‌ ఇవే
పాత స్లావియాకు గుడ్‌బై చెప్పొచ్చు! కొత్త స్లావియా ఫేస్‌లిఫ్ట్‌లో అదిరిపోయే అప్‌డేట్స్‌
మారుతి బలెనో ఫేస్‌లిఫ్ట్‌ వచ్చేస్తోంది.. ధర పెరిగినా ఫీచర్లలో మాత్రం అదిరిపోయే అప్‌డేట్స్!
సెప్టెంబర్ 5న కొత్త మారుతి బలెనో.. భారీ స్క్రీన్‌ నుంచి న్యూ లుక్‌ వరకు కీలక మార్పులు!
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
RE క్లాసిక్ 350కి ఆర్మీ టచ్.. కొత్త గోర్ఖా ఎడిషన్ కొనేముందు తెలుసుకోవాల్సిన 7 సంగతులు
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి అట్రాక్టివ్‌ లుక్.. గోర్ఖా ఎడిషన్‌లో ఉన్న 7 ప్రత్యేకతలు ఇవే

వీడియోలు

Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget