అన్వేషించండి

How To Get Better Mileage From Your Car:లీటర్ పెట్రోల్‌తో మరింత దూరం వెళ్లాలంటే ప్రతి కారు ఓనర్‌ ఇవి తప్పనిసరిగా తెలుసుకోవాలి

How To Get Better Mileage From Your Car:కారు మైలేజ్ పెంచుకోవాలనుకుంటున్నారా? డ్రైవింగ్ అలవాట్లు, టైర్ ప్రెజర్, సకాలంలో సర్వీసింగ్ వంటి చిన్న మార్పులతో ఇంధన ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆకస్మిక బ్రేకులు లేకుండా, స్థిరమైన డ్రైవింగ్ మైలేజ్ గణనీయంగా పెంచుతుంది.
  • టైర్లలో సరైన గాలి, అనవసర బరువు తగ్గించడం ద్వారా ఇంధనం ఆదా చేయవచ్చు.
  • సకాలంలో వాహన సర్వీసింగ్ చేయిస్తే ఇంజిన్ సామర్థ్యం, మైలేజ్ మెరుగుపడతాయి.

How To Get Better Mileage From Your Car: పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కారు ఓనర్లకు ఇంధన ఖర్చు భారీ భారం అవుతోంది. చాలా మంది కారు కొనేటప్పుడు కంపెనీ ప్రకటించిన మైలేజ్ ఫిగర్లను చూసి నిర్ణయం తీసుకుంటారు. అయితే, వాస్తవానికి మీ కారు ఎంత మైలేజ్ ఇస్తుందనేది ఎక్కువగా మీ డ్రైవింగ్ విధానం, వాహన నిర్వహణపై ఆధారపడి ఉంటుంది.

శుభవార్త ఏమిటంటే.. మైలేజ్ పెంచుకోవడానికి ఖరీదైన యాక్సెసరీలు కొనాల్సిన అవసరం లేదు. రోజువారీ అలవాట్లలో కొన్ని చిన్న మార్పులు చేస్తే చాలు, ప్రతి లీటర్ ఇంధనంతో మరింత దూరం ప్రయాణించవచ్చు.

డ్రైవింగ్ స్టైల్ మార్చండి

కారు మైలేజ్‌పై అత్యధిక ప్రభావం చూపేది డ్రైవింగ్ విధానమే. చాలామంది వేగంగా యాక్సిలేటర్ నొక్కడం, ఆకస్మికంగా బ్రేకులు వేయడం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఇంధన వినియోగం గణనీయంగా పెరుగుతుంది.

వాహనాన్ని మెల్లగా వేగం పెంచుతూ నడపడం, స్థిరమైన వేగాన్ని కొనసాగించడం ద్వారా మైలేజ్ మెరుగుపడుతుంది. అందుకే నగర ట్రాఫిక్‌తో పోలిస్తే హైవేపై కార్లు ఎక్కువ మైలేజ్ ఇస్తాయి. ఎందుకంటే అక్కడ తరచూ బ్రేకులు వేయాల్సిన అవసరం ఉండదు.

టైర్ ప్రెజర్‌ను నిర్లక్ష్యం చేయొద్దు

చాలా ఎక్కువ మంది చేసే పెద్ద తప్పు టైర్లలో గాలి ఒత్తిడిని పట్టించుకోకపోవడం. టైర్లలో సరైన ఎయిర్‌ ప్రెజర్‌ లేకపోతే రోడ్డుతో ఘర్షణ పెరుగుతుంది. ఫలితంగా ఇంజిన్ ఎక్కువ శ్రమించి ఎక్కువ ఇంధనాన్ని ఖర్చు చేస్తుంది.

అందుకే కనీసం నెలకు ఒకసారి టైర్ ప్రెజర్‌ను చెక్ చేయడం మంచిది. తయారీ సంస్థ సూచించిన స్థాయిలో గాలి ఉండేలా చూసుకోవాలి. ఇది మైలేజ్ పెరగడమే కాకుండా టైర్ల జీవితకాలాన్ని కూడా పెంచుతుంది.

కారులో అనవసర బరువు తగ్గించండి

మీ కారు ట్రంక్‌ (డిక్కీ)లో అవసరం లేని సామాన్లు ఉంటే వెంటనే తొలగించండి. అదనపు బరువు కారణంగా ఇంజిన్ మరింత శక్తిని వినియోగించాల్సి వస్తుంది. దీంతో ఇంధన వినియోగం పెరుగుతుంది.

ప్రతిరోజూ/తరచుగా ఉపయోగపడని భారీ వస్తువులు, టూల్స్ లేదా ఇతర సామగ్రిని కారులో ఉంచకుండా చూడడం ద్వారా కొంత మేర ఇంధనాన్ని ఆదా చేయవచ్చు.

సర్వీసింగ్‌ వాయిదా వేయొద్దు

సరిగ్గా పని చేసే ఇంజిన్ తక్కువ ఇంధనాన్ని వినియోగిస్తుంది. పాత ఇంజిన్ ఆయిల్, మురికిగా ఉన్న ఎయిర్ ఫిల్టర్, దెబ్బతిన్న స్పార్క్ ప్లగ్‌లు వాహనం పనితీరును దెబ్బతీస్తాయి. ఫలితంగా మైలేజ్ తగ్గిపోతుంది.

కాబట్టి కంపెనీ సూచించిన వ్యవధిలో కారు సర్వీసింగ్ చేయించడం చాలా ముఖ్యం. సకాలంలో సర్వీస్‌ చేయిస్తే ఇంజిన్ పనితీరు మెరుగుపడటంతో పాటు ఇంధన వినియోగం కూడా తగ్గుతుంది.

ఏసీ వాడితే మైలేజ్ తగ్గుతుందా?

చాలామందిలో ఉండే అపోహల్లో ఇది కూడా ఒకటి. ఏసీ వాడితే కొంత ఇంధనం ఎక్కువగా ఖర్చవుతుంది అనేది నిజమే. అయితే ఆధునిక కార్లలో ఉండే ఏసీ వ్యవస్థలు చాలా సమర్థవంతంగా పని చేస్తాయి.

వేసవిలో ఇబ్బంది పడుతూ ఏసీ ఆఫ్ చేయడం కంటే, సాఫీగా డ్రైవ్ చేయడం, వాహనాన్ని సరిగ్గా నిర్వహించడం ద్వారా ఎక్కువ ఇంధనాన్ని ఆదా చేయవచ్చు.

చివరిగా గుర్తుంచుకోవాల్సిన విషయం

కారు మైలేజ్‌ను ఒక్కరోజులో అద్భుతంగా పెంచే మంత్రం ఏదీ లేదు. అయితే సాఫీగా డ్రైవింగ్ చేయడం, టైర్లలో సరైన గాలి ఒత్తిడి ఉంచడం, అనవసర బరువు తగ్గించడం, సకాలంలో సర్వీసింగ్ చేయించడం వంటి చిన్న మార్పులు దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో ఇంధన ఖర్చును ఆదా చేస్తాయి. కాబట్టి, పెట్రోల్ బంక్‌కు తరచూ వెళ్లాల్సిన అవసరం తగ్గాలంటే ఇవాళ్టి నుంచే ఈ అలవాట్లను పాటించడం మొదలు పెట్టండి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Frequently Asked Questions

కారు మైలేజ్ మెరుగుపరచడానికి డ్రైవింగ్ స్టైల్ ఎలా ఉండాలి?

వేగంగా యాక్సిలేటర్ నొక్కడం, ఆకస్మిక బ్రేకులు వేయడం ఇంధన వినియోగాన్ని పెంచుతుంది. వాహనాన్ని మెల్లగా వేగం పెంచుతూ, స్థిరమైన వేగాన్ని కొనసాగించడం ద్వారా మైలేజ్ మెరుగుపడుతుంది.

టైర్లలో సరైన గాలి ఒత్తిడి ఉండటం ఎందుకు ముఖ్యం?

టైర్లలో సరైన గాలి లేకపోతే రోడ్డుతో ఘర్షణ పెరిగి ఇంజిన్ ఎక్కువ ఇంధనం ఖర్చు చేస్తుంది. నెలకు ఒకసారి టైర్ ప్రెజర్ చెక్ చేయడం వల్ల మైలేజ్ పెరుగుతుంది, టైర్ల జీవితకాలం కూడా పెరుగుతుంది.

కారులోని అదనపు బరువు మైలేజ్‌పై ప్రభావం చూపుతుందా?

అవును, కారులో అదనపు బరువు ఉంటే ఇంజిన్ ఎక్కువ శక్తిని వినియోగించి ఇంధన వినియోగాన్ని పెంచుతుంది. అనవసరమైన వస్తువులను తొలగించడం ద్వారా మైలేజ్‌ను మెరుగుపరచవచ్చు.

సకాలంలో కారు సర్వీసింగ్ చేయించడం వల్ల మైలేజ్ మెరుగుపడుతుందా?

అవును. పాత ఇంజిన్ ఆయిల్, మురికి ఫిల్టర్‌లు మైలేజ్‌ను తగ్గిస్తాయి. కంపెనీ సూచించిన వ్యవధిలో సర్వీసింగ్ చేయించడం వల్ల ఇంజిన్ పనితీరు మెరుగుపడి, ఇంధన వినియోగం తగ్గుతుంది.

కారులో ఏసీ వాడితే మైలేజ్ తగ్గుతుందా?

అవును, ఏసీ వాడితే కొంత ఇంధనం ఎక్కువగా ఖర్చవుతుంది. అయితే, ఆధునిక కార్లలోని ఏసీ వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేస్తాయి. డ్రైవింగ్ అలవాట్లు, సరైన వాహన నిర్వహణతో ఎక్కువ ఇంధనాన్ని ఆదా చేయవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

Fast Cars In India: హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
BMW F 450 GS అడ్వెంచర్ బైక్స్‌ లైనప్‌లోకి స్పోర్ట్ వేరియంట్.. టాప్ మోడల్ ఫీచర్లు, కొత్త ధరలివే!
స్పోర్టీ లుక్‌తో BMW F 450 GS కొత్త వేరియంట్.. స్పోర్ట్ మోడల్ ధర రూ.5.90 లక్షలు!
Petrol Pump Free Services: పెట్రోల్ కొన్నా, కొనకపోయినా.. పెట్రోల్ బంకుల్లో ఈ సేవలన్నీ ఉచితం, మీ హక్కు కూడా!
పెట్రోల్ బంక్‌కు వెళ్తున్నారా? ఈ 'ఉచిత' సౌకర్యాలు మీ హక్కు.. డబ్బులు అడిగితే ఇలా చేయండి!
కొత్త Skoda Slavia కోసం కంపెనీ చెప్పిన మైలేజ్‌ 19.5kpl.. రియల్‌ వరల్డ్‌లో నిజంగా అంత మైలేజ్‌ ఇచ్చిందా?
2026 Skoda Slavia 8AT రియల్‌ మైలేజ్ టెస్ట్.. సిటీలో ఎంత? హైవేపై ఎంత?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Diwali Bonus: ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
AP Local Body Elections: పరిషత్‌ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు.. జైలు నుంచి జడ్పీటీసీ, ఒక్క ఓటుతో విజయాలు, సత్తా చాటిన సామాన్యులు!
పరిషత్‌ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు.. జైలు నుంచి జడ్పీటీసీ, ఒక్క ఓటుతో విజయాలు, సత్తా చాటిన సామాన్యులు!
Family Drama OTT : అమ్మకు ఆదివారం హాలిడే - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
అమ్మకు ఆదివారం హాలిడే - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
Petrol Pump Free Services: పెట్రోల్ కొన్నా, కొనకపోయినా.. పెట్రోల్ బంకుల్లో ఈ సేవలన్నీ ఉచితం, మీ హక్కు కూడా!
పెట్రోల్ బంక్‌కు వెళ్తున్నారా? ఈ 'ఉచిత' సౌకర్యాలు మీ హక్కు.. డబ్బులు అడిగితే ఇలా చేయండి!
MPTC Election Results: చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
AI Morphing Student Died: ఏఐ ఫొటో మార్ఫింగ్ కలకలం.. లెక్చరర్, ప్రిన్సిపల్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య!
ఏఐ ఫొటో మార్ఫింగ్ కలకలం.. లెక్చరర్, ప్రిన్సిపల్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య!
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్‌ను ఖండించిన మాజీ సీఎం జగన్
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్‌ను ఖండించిన మాజీ సీఎం జగన్
Embed widget