అన్వేషించండి

Car AC: మాన్యువల్ AC vs ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ - మీ డ్రైవింగ్‌ స్టైల్‌కు ఏది బెస్ట్‌?

Best AC Options For Car: కారులో మాన్యువల్ AC & ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మధ్య తేడా ఏంటి?. మీ బడ్జెట్, అవసరాలు & డ్రైవింగ్ స్టైల్‌కు ఏ సిస్టమ్‌ సూటవుతుంది?.

Manual AC vs Automatic Climate Control: భగభగ మండే ఎండల్లో కారును నడపడం ఒక కఠిన పరీక్ష. సెగలు పుట్టించే రోడ్డు మీద మీ ప్రయాణాన్ని మీ కారులోని AC మాత్రమే సౌకర్యవంతంగా మార్చగలదు. ఇప్పుడు చాలా కార్లలో మాన్యువల్ AC ఉన్నప్పటీ, కొత్త కార్లలో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కూడా ఉంది.

'మాన్యువల్ AC - ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్'లో ఏ ఆప్షన్‌ సరైనదో తెలీక ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఈజీగా & ఆర్థిక భారం లేని మాన్యువల్ AC కార్‌ కొనాలా, లేక, స్మార్ట్ & కన్వీనియెంట్‌గా ఉండే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కార్‌ కొనాలా?. వివరంగా తెలుసుకుందాం.

మాన్యువల్ AC సిస్టమ్ 
మాన్యువల్ AC సిస్టమ్‌ అనేది, కార్లలో చాలా ఏళ్లుగా ఉపయోగిస్తున్న క్లాసిక్ టెక్నాలజీ. ఈ వ్యవస్థలో.. ఉష్ణోగ్రత, ఫ్యాన్ వేగం & గాలి ప్రవాహ దిశను నియంత్రించడానికి మూడు నాబ్‌లు ఉంటాయి. మీరు ఏసీని పెంచాలనుకున్నప్పుడు లేదా తగ్గించాలనుకున్నప్పుడు లేదా గాలి దిశను మార్చాలనుకున్నప్పుడు మీరే స్వయంగా నియంత్రించాలి. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి - ఇది ఆర్థికపరమైన ఎంపిక & బడ్జెట్ కార్లలో లభిస్తుంది. దీని తయారీ భాగాలు సరళమైనవి, నిర్వహణ కూడా చవకగా ఉంటుంది. ఇది ఆటోమేటిక్ సిస్టమ్ కంటే కొంచెం తక్కువ ఇంధనాన్ని వినియోగిస్తుంది. అన్నీ అనుకూలతలే కాదు, కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. కారులోని ఉష్ణోగ్రతను ప్రతిసారీ స్వయంగా సర్దుబాటు చేయాల్సిరావడం కొంచెం చికాకు కలిగిస్తుంది.

ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ 
ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్‌ విషయానికి వస్తే... ఇది కారు లోపల అమర్చిన సెన్సార్ల సహాయంతో పని చేసే అడ్వాన్స్‌డ్‌ & స్మార్ట్ కూలింగ్ సిస్టమ్. ఈ సెన్సార్లు కారు క్యాబిన్‌లోని ఉష్ణోగ్రతను అనుక్షణం పర్యవేక్షిస్తాయి & మీరు సెట్ చేసిన ఉష్ణోగ్రతను సరిగ్గా నిర్వహించడానికి కూలింగ్‌ను ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేస్తాయి. దీనిలో, మీరు ఉష్ణోగ్రతను ఒక్కసారి సెట్ చేస్తే చాలు, ఆ తర్వాత ఈ సిస్టమే ఆటోమేటిక్‌గా మిగిలిన పనిని చూసుకుంటుంది.

అనుకూలతలు & ప్రతికూలతలు 
ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ప్రయోజనాల్లో ముఖ్యమైనది - కారులోని ఏసీ లెవెల్స్‌ను మీరు తరచుగా మార్చాల్సిన అవసరం లేదు. మీరు ఒకసారి సెట్ చేసిన తర్వాత, ఈ సిస్టమ్‌ కారులోని టెంపరేచర్‌ను స్థిరంగా (మీరు సెట్‌ చేసిన విధంగా) ఉంచుతుంది. ఇది, దూర ప్రయాణాల సమయంలో, ముఖ్యంగా కారులో కుటుంబ సభ్యులు లేదా పిల్లలు ఉన్నప్పుడు ప్రయాణం చాలా ఆహ్లాదరకంగా సాగేలా చేస్తుంది. దీనిలోనూ కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. ఈ ఫీచర్ మిడ్ లేదా హై-ఎండ్ కార్లలో మాత్రమే అందుబాటులో ఉంది. దీని ధర సాధారణ AC సిస్టమ్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేసిన సెన్సార్లు & ఎలక్ట్రానిక్ భాగాల కారణంగా, మరమ్మత్తు కూడా ఖరీదైన వ్యవహారం కావచ్చు. ఈ వ్యవస్థ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండటం వల్ల కొంచెం ఎక్కువ ఇంధనాన్ని వినియోగించుకుంటుంది.

మీకు ఏ AC సిస్టమ్ సరిపోతుంది?
ఈ ప్రశ్నకు సమాధానం మీ అవసరాలు & బడ్జెట్‌పై ఆధారపడి ఉంటుంది. మీరు ప్రతిరోజూ తక్కువ దూరం డ్రైవ్ చేస్తూ, బడ్జెట్‌ రేటు కారు కొనాలనుకుంటే, మాన్యువల్ AC సరిపోతుంది. దీనిని ఉపయోగించడం సులభం & దీని సర్వీస్‌కు కూడా తక్కువ ఖర్చవుతుంది. మీరు ఎక్కువ దూరం డ్రైవ్ చేస్తూ, ఏసీ లెవెల్స్‌ను పదేపదే సెట్ చేయకూడదనుకుంటే & ప్రయాణ సమయంలో ఎక్కువ సౌకర్యాన్ని కోరుకుంటే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మెరుగ్గా ఉంటుంది. ఇది మీ డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ను హాయిగా మారుస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

డ్యూక్‌ నుంచి RC వరకు ధరల బాదుడు.. KTM బైక్‌ కొంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ చెల్లించాల్సిందే
మైగాడ్‌, KTM బైక్‌ కొనేవాళ్లకు షాకింగ్‌ న్యూస్‌! 7 మోడళ్ల రేట్లు అమాంతం పెరిగాయి
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
కారు నుంచి లారీ వరకు.. ఫిట్‌నెస్‌ను ఇక యంత్రాలే పరీక్షిస్తాయి! తెలంగాణలో 15 చోట్ల కొత్త వ్యవస్థ
మీ కారు ఫిట్‌నెస్‌ టెస్ట్‌ ఇక కొత్త రూట్‌లో.. మాన్యువల్‌ పరీక్షలకు చెక్‌!
నిస్సాన్ గ్రావైట్ CNG రియల్‌ మైలేజ్‌ టెస్ట్‌.. కేజీకి ఎంత దూరం వెళ్లిందంటే?
కేవలం రూ.83,000 కే CNG కిట్.. నిస్సాన్ గ్రావైట్ నిజమైన మైలేజీ ఎంతో తెలుసా?

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Embed widget