అన్వేషించండి

E20 Fuel Facts: 10 సంవత్సరాల పాత కారు E20 ఇంధనాన్ని తట్టుకోగలదా? వాడే ముందు ఈ విషయాలు తెలుసుకోండి

10 year old car fuel: E20 ఇంధనం పాత కార్లను డ్యామేజ్‌ చేస్తుందేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పాత కారులో E20 పెట్రోల్‌ పోయడం వల్ల ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.

E20 Fuel Compatibility: కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేసిన ఒక ప్రకటన ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చకు దారి తీసింది. E20 ఇంధనాన్ని (20% ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌) 2030 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంటే, ఐదేళ్ల ముందే, అంటే 2025లోనే అందుబాటులోకి వచ్చిందన్నది కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేసిన ప్రకటన సారాంశం. ఈ ప్రకటన తర్వాత, ఇప్పుడు, సోషల్ మీడియాలో E20 ఇంధనం గురించి చాలా చర్చ జరుగుతోంది. ఈ కొత్త ఇంధనాన్ని తమ పాత వాహనంలో పోయిస్తే ఇంజిన్ పాడవుతుందా అని బండి ఓనర్లు భయపడుతున్నారు. దీనికి సమాధానం చెప్పాలని గూగులమ్మను (Google) కూడా అడుగుతున్నారు.

నిజం ఏమిటంటే E20 అస్సలు కొత్తది కాదు. దిల్లీ-NCR వంటి పెద్ద నగరాల్లో, ప్రజలు చాలా కాలంగా తమకు తెలియకుండానే E20 ఇంధనాన్ని (20% ఇథనాల్ & 80% పెట్రోల్) ఉపయోగిస్తున్నారు.

E20 ఇంధనం - కొత్త వాహనాలు
2023 ఏప్రిల్ తర్వాత తయారైన అన్ని కార్లు E20తో నడిచేలా రూపొందిస్తున్నారు. చాలా పెద్ద కంపెనీలు ఇప్పటికే E20-రెడీ వెహికల్స్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. కాబట్టి కొత్త కార్లకు E20 ఇంధనం విషయంలో ఎటువంటి సమస్య లేదు.

పాత వాహనాలపై ప్రభావం ఎంత?
మీ కారు దాదాపు 10 సంవత్సరాల పాతది (2015 కు ముందు తయారైనది) & E10 ఇంధనంతో (10% ఇథనాల్ & 90% పెట్రోల్) నడిచేలా దానిని తయారు చేసి ఉంటే, ఇప్పుడు ఆ కారులో E20 పెట్రోల్‌ కొట్టించడం వల్ల ఎటువంటి పెద్ద హాని జరగదు. ఒకే తేడా ఏమిటంటే కారు మైలేజ్ కొంచెం తగ్గవచ్చు. E10 ఇంధనం ఉపయోగించే కార్లలో E20 ఇంధనం ఉపయోగించడం వల్ల కారు ఇంజిన్‌పై తక్షణ ప్రతికూల ప్రభావాన్ని చూపదు. కారు 2015 కి ముందు ఉత్పత్తి అయితే, E20 ఫ్యూయల్‌ వాడడం వల్ల దీర్ఘకాలంలో ఇంజిన్‌పై స్వల్ప ప్రభావం ఉండవచ్చు. పదేళ్ల పాత కారులో E20 ఇంధనం ఉపయోగించపోయినా ఇదే జరుగుతుంది, ఎందుకంటే వాహనాల్లో కాలక్రమేణా ఇంజిన్ & విడిభాగాలు అరిగిపోవడం ఒక సాధారణ ప్రక్రియ.

నిర్వహణ చాలా అవసరం
మీరు E20 వాడుతుంటే, "సర్వీసింగ్‌" అనే అతి ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీ కారును క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించుకోవడం ఉత్తమం. మీరు కారును మునుపటి కంటే కొంచెం ముందుగానే సర్వీసింగ్ చేయించుకోవలసి రావచ్చు. సర్వీసింగ్‌ గడువు అనేది బ్రాండ్‌ను బట్టి & మోడల్‌ను బట్టి మారవచ్చు. ఏదేమైనా, మీరు వాహనాన్ని సరిగ్గా మెయిన్‌టైన్‌ చేయగలిగితే నిర్వహిస్తే,  E20 వాడినప్పటికీ పెద్ద సమస్య & ఎలాంటి టెన్షన్‌ ఉండదు.

ఓ కారు ఓనర్‌ మాట
"నేను 10 ఏళ్ల పాత కారు నడుపుతున్నాను, E20 ఇంధనాన్ని ఉపయోగిస్తున్నాను. కారు ఇప్పటికీ బాగానే నడుస్తోంది. మైలేజ్ కొంచెం తగ్గింది గానీ ఇంజిన్ లేదా పెర్ఫార్మెన్స్‌పై గణనీయమైన ప్రభావం కనిపించలేదు" - సోమనాథ్ ఛటర్జీ

E20 ఇంధనం గురించి సోషల్‌ మీడియాలో చాలా సమాచారం కనిపిస్తోంది. అయితే, పాత కార్లలో E20 ఇంధనం వినియోగించడం అనేది ప్రజలు నమ్ముతున్నంత ప్రమాదకరం కాదని ఎక్స్‌పర్ట్‌ మెకానిక్స్‌ చెబుతున్నారు. మీ కారు 10 సంవత్సరాల పాతది  (2015 కు ముందు తయారైనది) అయినప్పటికీ మీరు E20 ఇంధనం టెన్షన్‌ లేకుండా దానిని హాయిగా నడపవచ్చు. ఎప్పటికప్పుడు సర్వీస్ చేయించుకుంటూ ఉండాలని మాత్రం గుర్తుంచుకోండి.

టాప్ హెడ్ లైన్స్

రూ.3.60 లక్షల డౌన్‌పేమెంట్‌తో 2026 Honda Elevate ZX వేరియంట్‌ మీ సొంతం.. నెలవారీ EMI ఎంతంటే?
2026 Honda Elevate టాప్‌ వేరియంట్‌ ZX.. ఈజీ EMIల్లోనూ కొనేయొచ్చు, పెద్దగా ఆర్ధిక భారం లేకుండా!
Mahindra XUV 3XOలో ఇక CNG మజా.. బెటర్‌ మైలేజ్ కోసం ఇదే బెస్ట్ ఛాయిస్!
ఇకపై తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్‌.. Mahindra XUV 3XO CNG వెర్షన్‌ రాబోతోంది
ఆటో మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కారు Suzuki E Sky Electric.. రేంజ్, ఫీచర్లు పూర్తి వివరాలు
ఆటో మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కారు Suzuki E Sky Electric.. రేంజ్, ఫీచర్లు పూర్తి వివరాలు
2026 Honda Elevate facelift లో ఇవి లేవు! ప్రత్యర్థి కార్లలో ఉన్న 6 ఫీచర్లు ఈ కారులో మిస్!
కొత్తగా వచ్చినప్పటికీ Honda Elevate Facelift లో మిస్‌ అయిన ఫీచర్లు ఇవే

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Embed widget