అన్వేషించండి

యూజ్డ్‌ Toyota Glanza కొనేవాళ్లకు యూజ్‌ఫుల్‌ గైడ్‌ - ఇవి తప్పక తెలుసుకోండి

యూజ్డ్‌ Toyota Glanza కొనాలనుకుంటున్నారా? ఇంజిన్‌, మైలేజ్‌, వేరియంట్లు, ఫీచర్లు, తెలిసుండాల్సిన లోపాలు, సెకండ్‌ హ్యాండ్‌ ధరలపై పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Second Hand Premium Hatchback: ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ సెగ్మెంట్‌లో, Maruti Suzuki Baleno ఫ్లాట్‌ఫామ్‌పై టయోటా బ్యాడ్జ్‌తో వచ్చిన మోడల్‌ Toyota Glanza. స్పేస్‌, మైలేజ్‌, ఫీచర్లు అన్నింటిలోనూ ఇది బాలెనో స్థాయిలోనే ఉంటుంది. అదనంగా, టయోటా బ్రాండ్‌ నమ్మకం, ఎక్కువ వారంటీ లభించడం వల్ల యూజ్డ్‌ మార్కెట్‌లో Glanza మంచి డిమాండ్‌ను సంపాదించుకుంది.

సెకండ్‌ జనరేషన్‌ Toyota Glanzaను 2022 మార్చిలో మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. ఈసారి బాలెనోతో పోలిస్తే డిజైన్‌లో కూడా స్పష్టమైన తేడా కనిపిస్తుంది. క్యామ్రీ తరహాలో ఉండే గ్రిల్‌, షార్ప్‌గా కనిపించే ఫ్రంట్‌ బంపర్‌, కొత్త అలాయ్ వీల్స్‌, సింపుల్‌ LED గ్రాఫిక్స్‌ ఉన్న హెడ్‌ల్యాంప్స్‌ ఈ కారుకు ప్రత్యేక గుర్తింపు ఇస్తాయి. ఇంటీరియర్‌లో బ్లాక్‌, బేజ్‌ డ్యుయల్‌ టోన్‌ అప్హోల్స్టరీ ఉండటం వల్ల కుటుంబ వినియోగానికి ఇది మరింత అనుకూలంగా మారింది.

ఇంజిన్‌ ఆప్షన్లు

Toyota Glanzaలో 1.2 లీటర్‌, నాలుగు సిలిండర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 90hp శక్తి, 113Nm టార్క్‌ ఇస్తుంది. ఈ ఇంజిన్‌కు 5 స్పీడ్‌ మాన్యువల్‌ లేదా 5 స్పీడ్‌ AMT గేర్‌బాక్స్‌ ఆప్షన్లు లభిస్తాయి. టయోటా ఇందులో CNG వేరియంట్‌ కూడా తీసుకొచ్చింది. ఇందులో అదే ఇంజిన్‌ 77hp శక్తి, 98.5Nm టార్క్‌తో పనిచేస్తుంది. CNG వేరియంట్‌ మాన్యువల్‌లో మాత్రమే వస్తుంది.

మైలేజ్‌

పెట్రోల్‌ మాన్యువల్‌ – 22.35 kmpl
AMT – 22.94 kmpl
CNG – 30.61 km/kg (ARAI)

రోజూ ఎక్కువ దూరం ప్రయాణం ఉంటే CNG మంచి ఎంపిక. అయితే బూట్‌ స్పేస్‌ కొంత తగ్గుతుంది. సౌకర్యం కావాలంటే పెట్రోల్‌ AMT సరైన ఆప్షన్‌గా నిలుస్తుంది.

వేరియంట్లు, ఫీచర్లు

Toyota Glanza మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తుంది, అవి – E, S, G, V. టాప్‌ వేరియంట్‌ Glanza Vలో హెడ్‌ అప్‌ డిస్‌ప్లే, 360 డిగ్రీ కెమెరా, 9 ఇంచ్‌ టచ్‌స్క్రీన్‌, వైర్‌లెస్‌ Android Auto, Apple CarPlay, క్రూయిజ్‌ కంట్రోల్‌, కనెక్టెడ్‌ కార్‌ టెక్నాలజీ, ఆటో క్లైమేట్ కంట్రోల్‌, 6 ఎయిర్‌బ్యాగ్స్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. మీ బడ్జెట్‌ అనుమతిస్తే V వేరియంట్‌నే ఎంచుకోవడం మంచిది. G వేరియంట్‌లో కూడా అవసరమైన అన్ని ఫీచర్లు దాదాపుగా లభిస్తాయి. S వేరియంట్‌ బేసిక్‌ అవసరాలకు సరిపోతుంది.

టయోటా వారంటీ ఎందుకు ప్లస్‌ పాయింట్‌?

Toyota Glanzaకి స్టాండర్డ్‌గా 3 సంవత్సరాలు లేదా 1 లక్ష కిలోమీటర్లు వారంటీ వస్తుంది. దీనిని 5 సంవత్సరాలు లేదా 2.2 లక్షల కిలోమీటర్ల వరకు పెంచుకోవచ్చు. యూజ్డ్‌ కార్‌ కొన్నా కూడా చాలాసార్లు వారంటీ మిగిలే ఉంటుంది. ఇదే బాలెనోతో పోలిస్తే Glanzaకి పెద్ద ప్లస్‌.

ప్రి-ఓన్డ్‌ Glanza కొనేముందు ఇవి చెక్‌ చేయండి

AMT గేర్‌బాక్స్‌: టెస్ట్‌ డ్రైవ్‌లో గేర్‌ మార్పులు షార్ప్‌గా, జర్క్‌ లేకుండా జరుగుతున్నాయా గమనించాలి.

టచ్‌స్క్రీన్‌ సమస్యలు: స్క్రీన్‌ ల్యాగ్‌, ఫ్రీజ్‌ అవుతుందా లేదా చూసుకోవాలి.

రీకాల్‌ చెకింగ్‌: 2022 డిసెంబర్‌, 2023 జనవరి మధ్య తయారైన కార్లలో ఎయిర్‌బ్యాగ్‌ యూనిట్‌ రీకాల్‌ జరిగింది. అది పూర్తయ్యిందో, లేదో నిర్ధారించాలి.

సెకండ్‌ హ్యాండ్‌ ధర ఎంత?

యూజ్డ్‌ Toyota Glanza ధరలు కొంచెం ఎక్కువగానే ఉంటాయి. సాధారణంగా మంచి కండిషన్‌లో ఉన్న కార్లు రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ఉంటాయి. రూ.8 లక్షలకు మించి వెళ్తే కొత్త కారు కొనడం మంచి నిర్ణయం అవుతుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

యమహా బైక్ కొనేవాళ్లకు పండగే! FZ నుంచి R15 వరకు ఆఫర్ల వర్షం.. ఈ రాష్ట్రాల్లో మాత్రం నో ఛాన్స్!
యమహా బైక్‌లు, స్కూటర్లపై పండుగ ఆఫర్లు.. రూ.వేలల్లో బెనిఫిట్స్! కేవలం రూ.2,499 డౌన్‌పేమెంట్
మార్కెట్‌లోకి వచ్చిన మహీంద్రా XUV 3XO కొత్త వెర్షన్‌.. పెట్రోల్ పవర్‌తో CNG SUV - ఫీచర్లు, ధరలు ఇవే!
దసరా కానుకగా Mahindra XUV 3XO CNG లాంచ్‌.. రూ.10 లక్షలకే 25 కి.మీ. మైలేజీ!
Triumph Bonneville 350 ఫీచర్లలో భారీ తేడాలు.. వేరియంట్ల వారీగా ధరలు, ప్రత్యేకతలు ఇవే!
Triumph Bonneville 350లో 3 వేరియంట్లు.. T4, T40, T40 బ్లాక్‌లో ఏది కొనాలి?
2026 Toyota Glanza Faceliftలో అదిరిపోయే ఫీచర్లు.. కానీ ఈ 3 విషయాల్లో నిరాశ తప్పదు!
కొత్త టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌లో 4 ప్లస్ పాయింట్లు, 3 మైనస్‌లు

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
Chandrababu Vijay River Interlinking: చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
Embed widget