అన్వేషించండి

Electric Vehicle Buying Tips: ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేసే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!

Electric Vehicle Buying Tips: పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్ ధరలను దృష్టిలో పెట్టుకొని చాలా మంది ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఈవీ కొనే ముందు కొన్ని విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఎలక్ట్రిక్ వాహనాలు తక్కువ నిర్వహణ ఖర్చుతో లాభదాయకం.
  • ఈవీలు కొంచెం ఖరీదైనవి, బ్యాటరీ మార్పు ఖర్చు ఆందోళనకరం.
  • ఛార్జింగ్ స్టేషన్ల కొరత, ఛార్జింగ్ సమయం పెద్ద సవాలు.
  • ప్రభుత్వం, కంపెనీలు ప్రోత్సాహకాలు, నెట్‌వర్క్‌ విస్తరణతో కృషి చేస్తున్నాయి.

Electric Vehicle Buying Tips: భారత్ మార్కెట్‌లో ఈవీల జోరు ఊపందుకుంటోంది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. అదే టైంలో మంచి ఫీచర్స్‌తో ఎలక్ట్రిక్ వాహనలు వస్తున్నాయి. అందుకే చాలా మంది  ఈవీలు కొనేందుకు ముందుకొస్తున్నారు. ఈ రోజుల్లో కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఈవీల విషయంలో  అది లాభదాయకమా కాదా అని నిశితంగా గమనిస్తున్నారు. ఈవీలను భవిష్యత్‌ వాహనాలుగా పరిగణిస్తున్నప్పటికీ, ఒకదాన్ని కొనుగోలు చేసే ముందు వాటి వల్ల కలిగే లాభనష్టాల గురించి సమగ్రంగా తెలుసుకోవడం చాలా కీలకం. సరైన సమాచారం మాత్రమే మీరు సరైన నిర్ణయం తీసుకోవడానికి సహాయపడుతుంది. 

ఈవీల వల్ల కలిగే ప్రయోజనాలు 

ఎలక్ట్రిక్‌ వాహనాల వల్ల కలిగే అతి పెద్ద ప్రయోజనం వాటి తక్కువ నిర్వహణ ఖర్చులు. పెట్రోల్ లేదా డీజిల్ వాహనానికి కిలోమీటర్‌కు ఐదు నుంచి పది రూపాయు ఖర్చు అవుతుంది. ఒక ఈవీకి సుమారు రెండు నుంచి మూడు రూపాయలు ఖర్చు అవుతుంది. బైక్‌లు, స్కూటర్ల ధర ఇంకా తక్కువ, దీని వల్ల నెలవారీ ఖర్చు ఆదా అవుతుంది. ఈవీలు ఇంజిన్‌కు బదులుగా బ్యాటరీ, మోటారును ఉపయోగిస్తాయి. దీని వల్ల కదిలే భాగాలు తక్కువగా ఉంటాయి. ఫలితంగా నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి. అంతేకాకుండా, ఈవీలను నడపడం సులభం, అవి అతి తక్కువ శబ్ధాన్ని చేస్తాయి. దీని వల్ల డ్రైవింగ్ సౌకర్యవంతంగా ఉంటుంది. 

ప్రతికూల అంశాలు ఉన్నాయి!

ఈవీలను విస్మరించలేని కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. మొదటిది, వాటి ధర విషయానికి వస్తే, పెట్రోల్ లేదా సీఎన్జీ వాహనాల కంటే ఎలక్ట్రిక్‌ వాహనాలు ఖరీదైనవి. ఒక సాధారణ కారును 7-8 లక్షలకు కొనుగోలు చేయగా, అదే తరా ఈవీకి 10-12 లక్షల వరకు ఖర్చవుతుంది. బ్యాటరీకి సంబంధించిన విషయంలో చాలా ఆందోళన ఉంది. ఒక వేళ బ్యాటరీ పాడైపోతే, దానిని మార్చడానికి ఎంత ఖర్చు అవుతుందోనని ప్రజలు ఆలోచిస్తున్నారు. కంపెనీలు ఇప్పుడు బ్యాటరీలపై ఎక్కువ కాలం వారంటీలను అందిస్తున్నప్పటీకీ, ఈ ఆందోళన ఇప్పటికీ కొనసాగుతోంది. అంతేకాకుండా సెకండ్‌ హ్యాండ్‌ మార్కెట్‌ ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందనందున, ఈవీల రీసేల్‌ విలువపై స్పష్టత లేదు. 

ఛార్జింగ్‌ సమస్య ఇప్పటికీ ఒక పెద్ద సవాల్

ఈవీలతో అతి పెద్ద సమస్య ఛార్జింగ్‌ స్టేషన్లు, ప్రయాణంలో బ్యాటరీ అయిపోతే, ఛార్జింగ్ స్టేషన్‌ను కనుగొనడం కష్టమవుతుంది. పెట్రోల్ పంపుల మాదిరిగా కాకుండా, ఛార్జింగ్‌ స్టేషన‌లు అన్ని చోట్లా అందుబాటులో ఉండవు. సుదూర ప్రయాణాలు చేసే వారికి ఇది ఒక పెద్ద సమస్య కావచ్చు. అంతేకాకుండా బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి సమయం పడుతుంది. దీని వల్ల ప్రజలు వేచి ఉండాల్సి వస్తోంది. 

ప్రభుత్వం, కంపెనీలు ఏం చేస్తున్నాయి?

ఈవీలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. ఎక్కువ మందిని వాటిని కొనుగోలు చేసేలా ప్రోత్సహించడానికి సబ్సిడీలు, పన్ను రాయితీలు వంటివి ఇందులో ఉన్నాయి. అదనంగా  కంపెనీలు కొత్త, సరసమైన ఈవీలను పరిచయం చేస్తూ, ఛార్జింగ్‌ నెట్‌వర్క్‌లను బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నాయి. భవిష్యత్‌లో ఈ పరిస్థితి మెరుగుపడుతుందని భావిస్తున్నారు. 

ఈవీ ఎలాంటి వాళ్లకు ఉపయోగం 

మీరు రోజూ 30 కిలోమీటర్ల నుంచి 80 కిలోమీటర్లు ప్రయాణిస్తే, ఈవీ ఒక మంచి ఆప్షన్ కావచ్చు. కొన్ని సంవత్సరాల్లో మీరు  అదనపు ఖర్చును తిరిగి రాబట్టుకునే అవకాశం ఉంది. ఇంట్లో ఛార్జింగ్ సౌకర్యాలు ఉన్న వారికి ఈవీలు చాలా అనుకూలంగా ఉంటాయి. అయితే తరచుగా ఎక్కువ దూరం ప్రయాణించే వారికి, పెట్రోల్ లేదా డీజిల్‌ వాహనం ఒక మంచి ఎంపిక కావచ్చు.

Frequently Asked Questions

ఎలక్ట్రిక్ వాహనాల నిర్వహణ ఖర్చులు ఎలా ఉంటాయి?

ఎలక్ట్రిక్ వాహనాల నిర్వహణ ఖర్చులు పెట్రోల్/డీజిల్ వాహనాల కంటే చాలా తక్కువ. పెట్రోల్/డీజిల్ వాహనాలకు కిలోమీటరుకు రూ. 5-10 ఖర్చయితే, ఈవీలకు రూ. 2-3 మాత్రమే ఖర్చవుతుంది.

ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు ధర ఎక్కువగా ఉంటుందా?

అవును, పెట్రోల్ లేదా CNG వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాలు ఖరీదైనవి. ఒక సాధారణ కారు ధర రూ. 7-8 లక్షలు ఉండగా, అదే తరహా ఈవీ ధర రూ. 10-12 లక్షల వరకు ఉండవచ్చు.

ఈవీల రీసేల్ విలువ ఎలా ఉంటుంది?

సెకండ్ హ్యాండ్ మార్కెట్ ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందనందున, ఈవీల రీసేల్ విలువపై ప్రస్తుతం స్పష్టత లేదు.

ఈవీల ఛార్జింగ్ సౌకర్యాలు ఎలా ఉన్నాయి?

ప్రస్తుతం ఛార్జింగ్ స్టేషన్లు పెట్రోల్ పంపుల వలె విస్తృతంగా అందుబాటులో లేవు. సుదూర ప్రయాణాలకు ఇది ఒక సమస్య కావచ్చు, మరియు బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి సమయం పడుతుంది.

ఎంత దూరం ప్రయాణించే వారికి ఈవీలు అనుకూలం?

రోజుకు 30 నుండి 80 కిలోమీటర్లు ప్రయాణించే వారికి ఈవీలు మంచి ఎంపిక. ఇంట్లో ఛార్జింగ్ సౌకర్యం ఉన్నవారు కూడా ఈవీలను పరిగణించవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

Honda ADV160 Vs ప్రత్యామ్నాయాలు.. ఏ స్కూటర్ బెటర్‌గా ఉంది? పూర్తి కంపారిజన్
హోండా ADV160 vs హీరో Xoom 160 vs యమహా Aerox 155 - యూత్‌కి తగిన స్కూటర్‌ ఏది?
జులై 31 వరకే ఛాన్స్.. Kawasaki Z900పై అదిరిపోయే ఆఫర్ ప్రకటించిన డీలర్
యువతకు కవాసాకి బంపర్ గిఫ్ట్.. Z900 కొంటే ఇవి కూడా 'ఫ్రీ'గా మీ సొంతం!
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Bonda Uma TDP: అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ - త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
BCCI Coaching Sack: టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
Embed widget