అన్వేషించండి

Car Loan: సెకండ్ హ్యాండ్ కారు కొనేందుకు రుణం కావాలా? బ్యాంక్ లోన్ కోసం ఇలా చేయండి

మీరు సెకెండ్ హ్యాండ్ కారు కొనాలి అనుకుంటున్నారా? డబ్బులు తక్కువగా ఉన్నాయా? ఏం ఫర్వాలేదు.. ఈజీగా బ్యాంకు లోన్ తీసుకొని కొనుగోలు చెయ్యొచ్చు..

చాలా మంది సొంతంగా కారు కొనుగోలు చేయాలని కలలు కంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబంతో కలిసి బస్సులో, ఇతర వాహనాల్లో ప్రయాణం చేయాలంటే చాలా కష్టం. అందుకే కుటుంబ అసరాల కోసం ఓ కారు కొనుక్కోవాలి అనుకుంటారు. డబ్బు ఉన్న వాళ్లు కొత్త కారు కొనుక్కుంటారు. తక్కువగా డబ్బు ఉన్నవాళ్లు సెకెండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుతం పాత కారు కొనే వారికి సైతం బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. లోన్ తీసుకునే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తు పెట్టుకోవాలి. దరఖాస్తుదారుడు సెకండ్ హ్యాండ్ కారు కొనడానికి రుణం పొందటానికి అర్హత కలిగి ఉండాలి. మూడేళ్ల కంటే పాత కార్లను కొనడానికి చాలా సార్లు బ్యాంకులు రుణాలు ఇవ్వవు.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువగా సెకెండ్ హ్యాండ్ కార్ల మీద రుణాలు తీసుకుంటాయి. కొత్త కారును కొనుగోలు చేయడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అంతేకాదు.. మెయింటెనెన్స్ కోసం చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎక్కువ ఇన్సూరెన్స్ ప్రీమియం అవసరం కావచ్చు. సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలుతో చాలా వరకు డబ్బు ఆదా చేసుకోవచ్చు. కారు విలువలో తరుగుదల కారణంగా బీమా ప్రీమియం చౌకగా ఉంటుంది. లోన్ పై ఎక్కువ ఒత్తిడి లేకుండా కారును సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. రుణగ్రహీతల వయసు 21 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వరకు ఉండవచ్చు.  

ఇలా కూడా లోన్ తీసుకొచ్చు!

పాత వాహనాన్ని కొనుగోలు చేయడానికి సెక్యూర్డ్ లేదంటే అన్ సెక్యూర్డ్ లోన్ తీసుకోవచ్చు. మీరు అధిక వడ్డీ, ఛార్జీలు చెల్లించడానికి సిద్ధంగా ఉండటంతో పాటు బ్యాంక్‌ లో ఏదైనా వస్తువు కుదువ పెట్టకూడదు అనుకుంటే వ్యక్తిగత రుణాన్ని ఎంచుకోవచ్చు. మరోవైపు, మీకు సురక్షితమైన రుణం కావాలంటే,  బంగారం వంటి ఆస్తులను, KVP, LIP, NSC, FDలు మొదలైన సెక్యూరిటీలను ఉపయోగించవచ్చు.  

లోన్ తీసుకునే వారికి సలహాలు 

సెకండ్ హ్యాండ్ వెహికల్‌ని కొనుగోలు చేయడానికి కారు లోన్ కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు బ్యాంక్ అందించే లోన్ టు వాల్యూ (LTV) అనే దాని విషయంలో జాగ్రత్తగా ఉండాలి.  LTV సాధారణంగా రుణదాత నుంచి  రుణదాతకు మారుతూ ఉంటుంది. సెకండ్ హ్యాండ్ కారు అంచనా విలువలో 50% నుండి 90% వరకు ఉంటుంది. మీరు వాహనాన్ని బ్యాంక్ ప్రీ-ఓన్డ్ కార్ డీలర్‌ల నుంచి కొనుగోలు చేస్తే,  మెరుగైన LTV నిష్పత్తి, తక్కువ వడ్డీ రేటుతో లోన్ పొందవచ్చు.  

ఈ విషయాలు గుర్తుంచుకోండి

పాత కారు కొనడానికి ముందు అనేక విషయాలను గుర్తుంచుకోవాలి.

⦿ కారు  డీలర్లు సెకండ్ హ్యాండ్ కార్ల విషయంలో కొనుగోలుదారులను మోసం చేస్తుంటారు.

⦿ మంచి పెయింట్,  మంచి ఇంటీరియర్ ఏర్పాటు చేయించి కస్టమర్లను ఆకట్టుకునేలా ప్రయత్నిస్తారు.

⦿ పై పై హంగులను చూసి అసలు విషయాలను మర్చిపోతారు.

⦿ ఆన్‌లైన్‌కు బదులుగా కారును ఆఫ్‌లైన్‌లో కొనడానికి ప్రయత్నించండి.

⦿ మెకానిక్ తో చెక్ చేయించి తీసుకోండి. ఎక్కువ డిస్కౌంట్ ఆఫర్లను చూసి మోసపోవద్దు.

⦿ టెస్ట్ డ్రైవ్ చేయకుండా కారును కొనుగోలు చేయకూడదు.

⦿ పూర్తి డాక్యుమెంట్స్ ఉన్నప్పుడే కారు కొనుగోలు చేయాలి.

Also Read: కారులో ప్రయాణిస్తున్నప్పుడు సీట్ బెల్ట్ ఎందుకు ధరించాలి? అది ఎలా ప్రాణాలు కాపాడుతుంది?
Also Read: మనదేశంలో అత్యంత చవకైన కార్లు ఇవే - రూ.4 లక్షలలోపు కూడా!

టాప్ హెడ్ లైన్స్

రూ.10 లక్షల లోపులో బలెనో - రూ.10.75 లక్షల ఆల్ట్రోజ్‌.. టెక్నాలజీ, ఫీచర్లలో ఏ కారు బెటర్‌?
మారుతి బలెనో vs టాటా ఆల్ట్రోజ్‌.. టాప్‌ వేరియంట్లలో ఏ కారు ప్రత్యేకత ఏంటి?
పల్సర్‌ NS200, N250 బైకులకు యూత్‌ మెచ్చే అప్‌డేట్స్‌.. కొత్త డిస్‌ప్లే, సస్పెన్షన్‌ ప్రత్యేకతలు ఇవే!
బజాజ్‌ పల్సర్‌ NS200, N250 బైకులకు కొత్త వెర్షన్లు.. ఫోటోలు లీక్‌
యువతకు నచ్చేలా అపాచీ, రోనిన్‌లో కొత్త టెక్నాలజీ ఫీచర్లు.. ధరలు ఎంతంటే?
యూత్‌ఫుల్‌ Apache, Ronin బైకుల్లో కొత్త వేరియంట్లు, కొత్త టెక్నాలజీ
హెల్మెట్ బయట శుభ్రంగా ఉంటే సరిపోదు.. లోపల ఇలా క్లీన్ చేయకపోతే ఇబ్బందులే!
హెల్మెట్ పెట్టుకుంటున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి.. లేదంటే ఆరోగ్య సమస్యలు!

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Human Trafficking Case: బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
AP Congress : ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
Irumudi OTT : థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి ఇరుముడి - 250 కోట్ల కలెక్షన్స్... ఎందుకు ఈ మూవీ చూడాలంటే?
థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి ఇరుముడి - 250 కోట్ల కలెక్షన్స్... ఎందుకు ఈ మూవీ చూడాలంటే?
Hyderabad Crime News: వనస్థలిపురంలో దారుణం.. కత్తితో నరికి పాల వ్యాపారిని హత్య చేసిన దుండగులు
వనస్థలిపురంలో దారుణం.. కత్తితో నరికి పాల వ్యాపారిని హత్య చేసిన దుండగులు
యువతకు నచ్చేలా అపాచీ, రోనిన్‌లో కొత్త టెక్నాలజీ ఫీచర్లు.. ధరలు ఎంతంటే?
యూత్‌ఫుల్‌ Apache, Ronin బైకుల్లో కొత్త వేరియంట్లు, కొత్త టెక్నాలజీ
Laptop Keyboard Cleaning : ల్యాప్‌టాప్ కీబోర్డ్ క్లీన్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి
ల్యాప్‌టాప్ కీబోర్డ్ క్లీన్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి
శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కొబ్బరి పీచు ఉందంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించిన TTD!
శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కొబ్బరి పీచు ఉందంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించిన TTD!
Embed widget