Affordable Cars in India: మనదేశంలో అత్యంత చవకైన కార్లు ఇవే - రూ.4 లక్షలలోపు కూడా!
ప్రస్తుతం మనదేశంలో అత్యంత చవకైన ఐదు కార్లు ఇవే.
భారతదేశం ఒక ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్. ఒక వస్తువు అమ్మకాల్లో దాని ధర కీలక పాత్ర పోషిస్తుంది. మనదేశంలో వ్యాపారం చేసే కంపెనీలన్నిటికీ ఆ విషయం తెలుసు. ఖర్చులను వీలైనంతగా తగ్గించుకుని ధర తక్కువగా ఉంచటానికి ప్రయత్నిస్తాయి. భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో ఎంట్రీ లెవల్ కారు విభాగంలోనే తక్కువ ధరలు ఉంటాయి. ప్రస్తుతం మనదేశంలో అత్యంత చవకైన ఐదు కార్లు ఇవే.
1. మారుతి సుజుకి ఆల్టో 800 ఎస్టీడీ (వో) (ధర రూ.3.39 లక్షలు)
మనదేశంలో మారుతి సుజుకి ఆల్టో కారు గురించి తెలియని వారు చాలా తక్కువ. దేశంలోని బెస్ట్ సెల్లింగ్ కార్లలో ఇది కూడా ఒకటిగా ఉంటుంది. ఆల్టోకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈ కారును విక్రయిస్తున్నారు. వీటిలో మారుతి సుజుకి ఆల్టో 800 ఎస్టీడీ (వో) ధర అత్యంత తక్కువగా ఉంది. దీని మైలేజ్ కూడా ఎక్కువే. లీటరుకు 22.05 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇది అందించనుంది.ః
2. మారుతి సుజుకి ఆల్టో కే10 ఎస్టీడీ (రూ.3.99 లక్షలు)
ఆల్టోలో అత్యంత పవర్‌ఫుల్ వెర్షన్ ఇదే. మారుతి సుజుకి మొదటి సారి ఆల్టో కే10ను మనదేశంలో 2010లో లాంచ్ చేసింది. ప్రస్తుతం మనదేశంలో దీని మూడో వెర్షన్ అందుబాటులో ఉంది. ఇందులో 1.0 లీటర్ డ్యూయల్ జెట్ డ్యూయల్ వీవీటీ ఇంజిన్‌ను అందించారు. ఈ కారు లీటరుకు 24.39 కిలోమీటర్ల మైలేజ్‌ను అందించనుంది.
3. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో ఎల్ఎక్స్ఐ (రూ.4.25 లక్షలు)
ఈ లిస్ట్‌లో మూడో కారు కూడా మారుతి సుజుకి కారే. మనదేశంలో మారుతి సుజుకి ఎందుకు నంబర్ వన్ బ్రాండ్‌గా ఉందంటే వాళ్లకి మార్కెట్ గురించి పూర్తిగా తెలుసు కాబట్టి. ఎస్-ప్రెస్సో అనేది ఒక మైక్రో ఎస్‌యూవీ కారు. దీని ధర రూ.4.25 లక్షలుగా (ఎక్స్ షోరూం) ఉంది. ఈ కారు 24.12 కిలోమీటర్ల మైలేజ్‌ను అందించనుంది.
4. రెనో క్విడ్ ఆర్ఎక్స్ఎల్ 0.8 (రూ.4.64 లక్షలు)
రెనో ఇండియా తన క్విడ్ కారును మనదేశంలో 2015లో లాంచ్ చేసింది. దీన్ని మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్‌గా లోకలైజ్ చేశారు. దీని ధరను రూ.4.64 లక్షలుగా (ఎక్స్ షోరూం) నిర్ణయించారు. 3 సిలిండర్ 800 సీసీ ఇంజిన్‌ను ఈ కారులో అందించారు. ఈ కారు 22.25 కిలోమీటర్ల మైలేజ్‌ను డెలివర్ చేయనుందని కంపెనీ పేర్కొంది.
5. మారుతి సుజుకి సెలెరియో ఎల్ఎక్స్ఐ (రూ.5.25 లక్షలు)
మారుతి సుజుకి తన సెలెరియో కారును అప్‌గ్రేడ్ చేసింది. దీని ధరను రూ.5.25 లక్షలుగా (ఎక్స్-షోరూం) నిర్ణయించారు. ఇందులో బేస్ వేరియంట్ ధర ఇది. 1.0 లీటర్ డ్యూయల్ జెట్ డ్యూయల్ వీవీటీ ఇంజిన్‌ను అందించారు. ఇది ఏకంగా 25.24 కిలోమీటర్ల మైలేజ్‌ను అందించనుంది.
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?