BMW i4: ఒక్కసారి చార్జ్ చేస్తే 600 కిలోమీటర్లు - సూపర్ రేంజ్ ఉన్న ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తుందిగా!
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం బీఎండబ్ల్యూ మనదేశంలో కొత్త ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయనుంది. అదే బీఎండబ్ల్యూ ఐ4.
![BMW i4: ఒక్కసారి చార్జ్ చేస్తే 600 కిలోమీటర్లు - సూపర్ రేంజ్ ఉన్న ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తుందిగా! BMW i4 Electric Sedan Unveiled in India With Near 600km Range Launching on 26th May BMW i4: ఒక్కసారి చార్జ్ చేస్తే 600 కిలోమీటర్లు - సూపర్ రేంజ్ ఉన్న ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తుందిగా!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/01/edacd965b8e6aa8d9806e87e96e5cfd7_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
బీఎండబ్ల్యూ మనదేశంలో తన కొత్త ఐ4 ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయనుంది. ఇది పూర్తి ఎలక్ట్రిక్ లగ్జరీ సెడాన్ కారు. మే 26వ తేదీన ఈ కారు మనదేశంలో లాంచ్ కానుంది. దేశంలో మొట్టమొదటి పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ సెడాన్ కారు ఇదే. బీఎండబ్ల్యూ 4 సిరీస్ కార్లలో ఇది ఎలక్ట్రిక్ వెర్షన్. 3 సిరీస్ ఆర్కిటెక్చర్‌తో దీన్ని రూపొందించారు.
ఈ కారు లుక్ వావ్ అనిపించేలా ఉంది. పూర్తిగా విదేశాల్లోనే దీన్ని రూపొందించనున్నారు. అంటే మనదేశంలో దీన్ని కొనుగోలు చేసినా, పూర్తిగా విదేశాల నుంచి దిగుమతి చేయనున్నారు. ఇందులో రెండు వెర్షన్లు ఉండనున్నాయి. వీటిలో మొదటిది రెండు మోటార్లు ఉన్న ఆల్ వీల్ డ్రైవ్ వెర్షన్ కాగా... రెండోది రేర్ డ్రైవ్ ఓన్లీ సింగిల్ మోటార్ వెర్షన్.
వీటిలో సింగిల్ మోటార్ వెర్షన్ 340 బీహెచ్‌పీని, డ్యూయల్ మోటార్ వెర్షన్ 550 బీహెచ్‌పీని అందించనుంది. ఇక రేంజ్ విషయానికి వస్తే... ఏకంగా 590 కిలోమీటర్ల రేంజ్‌ను బీఎండబ్ల్యూ ఐ4 అందించనుంది. ఈ కారు సైజు, పెర్ఫార్మెన్స్ ఆకట్టుకునేలానే ఉన్నాయని చెప్పవచ్చు. లెవల్ 2 వాల్ బాక్స్ చార్జర్ ద్వారా 8 గంటల్లో దీన్ని చార్జ్ చేయవచ్చు.
ఇందులో 12.3 అంగుళాల ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే ఉంది. దీంతోపాటు 14.9 అంగుళాల మెయిన్ డిస్‌ప్లే, త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్, 16 స్పీకర్ల ఆడియో సిస్టం కూడా ఇందులో ఉన్నాయి. ఈ కారు పూర్తి స్పెసిఫికేషన్లు ఇంకా తెలియాల్సి ఉంది. లగ్జరీ ఎలక్ట్రిక్ సెడాన్లలో ఇదే మొదటి కారు కాబట్టి దీనికి పోటీ కూడా ఉండదు. ఈవీ స్పెసిఫిక్ డిజైన్‌తో ఈ కారును రూపొందించారు.
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)