అన్వేషించండి

2025 Best MPV: కియా కారెన్స్ క్లావిస్ Vs మారుతి సుజుకి XL6 - ఏ ప్రీమియం MPV మీ ఫ్యామిలీకి బెస్ట్‌?

Kia Carens Clavis vs Maruti Suzuki XL6: కియా కారెన్స్ క్లావిస్ & మారుతి సుజుకి XL6 రెండూ ప్రీమియం MPVలు. కానీ.. ఫీచర్లు, ఇంజిన్‌ ఆప్షన్లు, భద్రత లక్షణాలు భిన్నంగా ఉంటాయి.

Kia Carens Clavis Vs Maruti Suzuki XL6 - Price And Features: ప్రీమియం ఫీచర్లు, గ్రేట్‌ కంఫర్ట్‌ & పవర్‌ఫుల్‌ ఇంజిన్లు ఉన్న కార్లు మార్కెట్‌లోకి లాంచ్‌ కావడంతో, ఇప్పుడు MPV సెగ్మెంట్‌లో గతంలో కంటే పోటీ పెరిగింది. కియా కారెన్స్ క్లావిస్ ఎంట్రీతో మారుతి సుజుకి XL6కు గట్టి పోటీ ఎదురైంది. ఈ రెండు MPV (మల్టీ పర్పస్‌ వెహికల్‌)ల్లో ఏది మీ కుటుంబానికి సరైనదో నిమిషాల్లో అర్ధం చేసుకోవచ్చు.

ధర
కియా కారెన్స్ క్లావిస్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.50 లక్షల నుంచి ప్రారంభమై రూ. 21.50 లక్షల వరకు ఉంటుంది. మారుతి సుజుకి XL6 ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.83 లక్షల నుంచి ప్రారంభమై రూ. 14.83 లక్షల వరకు ఉంటుంది. ఈ లెక్క ప్రకారం మారుతి XL6 కంటే క్లావిస్ బేస్ వేరియంట్‌ చవకగా వస్తుంది. అయితే, XL6 టాప్ వేరియంట్‌ క్లావిస్ టాప్‌ వేరియంట్‌ కంటే తక్కువ ధర పలుకుతోంది.

ఇంజిన్ & పనితీరు 
ఇంజిన్ & పనితీరు పరంగా చూస్తే, క్లావిస్‌లో ఎక్కువ ఆప్షన్లు, శక్తివంతమైన ఇంజిన్‌లు ఉన్నాయి. ఈ MPV మూడు ఇంజిన్ ఆప్షన్స్‌లో లాంచ్‌ అయింది - 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ (113 bhp, 144 Nm), 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ (158 bhp, 253 Nm) & 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ (113 bhp, 250 Nm). ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్ల విషయానికి వస్తే.. ఈ కార్‌ 6-స్పీడ్ మాన్యువల్, iMT & 7-స్పీడ్ DCT ట్రాన్స్‌మిషన్‌తో చాలా స్మూత్‌గా రన్నింగ్‌ చేస్తుంది. మరోవైపు, మారుతి XL6 1.5-లీటర్ K15C స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ (102 bhp, 137 Nm) & CNG వెర్షన్ (86.6 bhp, 121.5 Nm)లో అందుబాటులో ఉంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ & 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ను వేరే లెవెల్‌కు తీసుకువెళ్తుంది. XL6 CNG వేరియంట్ 26.32 kmpl మైలేజీని ఇస్తుంది. క్లావిస్, తన పవర్‌ పెర్ఫార్మెన్స్‌తో మెరుగ్గా ఉంటుంది.

ఫీచర్లు 
డ్యూయల్ 12.3-అంగుళాల స్క్రీన్స్‌, పనోరమిక్ సన్‌రూఫ్, లెవల్-2 ADAS, 360-డిగ్రీ కెమెరా & 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్ వంటి ప్రీమియం ఫీచర్లు కియా కారెన్స్ క్లావిస్‌లో కనిపిస్తాయి. మారుతి XL6లో 7-అంగుళాల టచ్‌స్క్రీన్, వెంటిలేటెడ్ సీట్లు, సుజుకి కనెక్ట్ & 360 డిగ్రీల కెమెరా వంటి కీలక ఫీచర్లు ఉన్నాయి. ఫీచర్లు & ఆధునిక సాంకేతికత విషయంలో క్లావిస్ ఒక అడుగు ముందుంది.

డిజైన్ & సైజ్‌
క్లావిస్‌ డిజిటల్ టైగర్ ఫేస్, LED DRLs & 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో చాలా మోడర్న్‌గా కనిపిస్తుంది. ఇది, మారుతి XL6 కంటే 95mm పొడవు & 25mm వెడల్పు ఉంటుంది, అందువల్ల కార్‌ క్యాబిన్‌ మరింత విశాలంగా అనిపిస్తుంది. XL6 టఫ్‌ SUV డిజైన్‌తో లాంచ్‌ అయింది, అయితే ఈ డిజైన్‌ కొంచెం పాతగా కనిపిస్తుంది.

ప్రయాణీకుల భద్రత
ప్రయాణీకుల భద్రత కోసం కియా కారెన్స్ క్లావిస్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవల్-2 ADAS, నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేక్‌లు, హిల్ హోల్డ్ అసిస్ట్ & ESP వంటి అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు ఉన్నాయి. మారుతి XL6లో 4 ఎయిర్‌బ్యాగులు, హిల్ హోల్డ్ అసిస్ట్ & ESP ఉన్నాయి, ADAS సాంకేతికత లేదు. వెనుక చక్రాలకు డ్రమ్ బ్రేక్‌లు అమర్చారు. 

ఏది బెస్ట్‌?
ఓవరాల్‌గా చూస్తే, కియా కారెన్స్ క్లావిస్ ఫ్యూచర్‌ రెడీ & భద్రత విషయంలో నమ్మదగిన MPVగా కనిపిస్తుంది. మీకు ఎక్కువ ఫీచర్లు, ఆధునిక సాంకేతికత & శక్తిమంతంగా పని చేసే ప్రీమియం MPV కావాలనుకుంటే Kia Carens Clavis ఒక మంచి ఎంపిక. మీ బడ్జెట్ కొంచెం పరిమితంగా ఉండి, మైలేజీకి ప్రాధాన్యత ఉంటే మారుతి సుజుకి XL6 CNG వేరియంట్ ప్రయోజనకరంగా ఉంటుంది.

టాప్ హెడ్ లైన్స్

ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
కొత్త ఎలక్ట్రిక్‌ బైకులు తీసుకురాబోతున్న హీరో - డైలీ యూజ్‌ కోసం, అడ్వెంచర్ల కోసం కూడా!
హీరో ఎలక్ట్రిక్‌ బైకులు త్వరలో రాబోతున్నాయి.. డబ్బులతో రెడీగా ఉండండి
Maruti Victoris S-CNG.. రూ.1 లక్ష ఎక్కువైనా ఎందుకు కొనాలి? మైలేజీతో లెక్క మారిపోతుంది!
మారుతి విక్టోరిస్‌ S-CNG రియల్‌ వరల్డ్‌ రివ్యూ.. మైలేజీ అదిరిపోయింది, మీ డబ్బు ఆదా!
BMW F 450 GS బైక్‌ రియల్‌ వరల్డ్‌ టెస్ట్.. 100km వేగం కేవలం 5.72 సెకన్లలో!
BMW కారే కాదు, బైక్‌ కూడా మామూలుగా లేదుగా.. లైఫ్‌లో ఒక్కసారైనా నడపాల్సిందే

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
Embed widget