2025లో SUVలు, EVల దూకుడుతో హోరెత్తిన ఇండియన్ రోడ్లు - సంచలనం సృష్టించిన కొత్త కార్లు
2025లో భారత కార్ మార్కెట్ SUVలు, ఎలక్ట్రిక్ వాహనాలతో హోరెత్తింది. Tata Sierra నుంచి Tesla Model Y, MG Cyberster వరకు ఈ ఏడాది టాప్ కార్ లాంచ్‌లపై ప్రత్యేక కథనం.

Best Cars 2025 India: 2025 సంవత్సరం ముగింపు దశకు చేరుకున్న వేళ, ఈ ఏడాది భారత ఆటోమొబైల్ మార్కెట్‌లోకి వెనక్కి తిరిగి చూస్తే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. SUVలు రోడ్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించాయి. అదే సమయంలో కొత్త తరం ఎలక్ట్రిక్ కార్లు కూడా కొనుగోలుదారుల దృష్టిని బలంగా ఆకర్షించాయి. డిజైన్, టెక్నాలజీ, పనితీరు పరంగా 2025 కార్ లాంచ్‌లు మార్కెట్‌ను కొత్త దిశగా తీసుకెళ్లాయి.
Tata Sierra – లెజెండ్ రిటర్న్స్
Tata Sierra ఈ ఏడాది అత్యంత ఎక్కువగా చర్చకు వచ్చిన కార్ లాంచ్‌లలో ఒకటి. ఒకప్పుడు గేమ్ ఛేంజర్‌గా నిలిచిన ఒరిజినల్ సియెర్రా నుంచి ప్రేరణ తీసుకుని, పూర్తిగా ఆధునిక రూపంలో ఈ కొత్త మోడల్‌ను Tata తీసుకొచ్చింది. కొత్త ప్లాట్‌ఫామ్, ప్రత్యేక డిజైన్ లాంగ్వేజ్‌తో New Sierra మరోసారి లైమ్‌లైట్‌లో నిలిచింది. పెట్రోల్‌లో రెండు ఇంజిన్ ఎంపికలు, డీజిల్‌లో ఒక ఇంజిన్ ఎంపికతో రావడం దీన్ని విస్తృత వినియోగదారుల వరకు తీసుకెళ్లింది.
Hyundai Venue – ప్రీమియం టచ్‌తో కొత్త అవతార్
Hyundai Venue రెండో తరం మోడల్ కూడా 2025లో భారీ అంచనాలతో వచ్చింది. Creta తర్వాత బ్రాండ్‌కు అత్యంత ప్రజాదరణ పొందిన SUVగా Venue కొనసాగుతోంది. కొత్త Venue లుక్ పెద్ద SUVల తరహాలో ఉండేలా డిజైన్ చేశారు. లోపల టెక్నాలజీతో నిండిన ఇంటీరియర్, ఎక్కువ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందించడం దీన్ని మరింత ఆకర్షణీయంగా మార్చింది. స్పోర్టీ అభిరుచులు ఉన్నవారికి N Line వేరియంట్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Maruti Suzuki Victoris – SUV ఫోకస్‌కు బలం
Maruti Suzuki Victorisతో తన SUV శ్రేణిని మరింత బలపరిచింది. Grand Vitara తర్వాత వచ్చిన రెండో కాంపాక్ట్ SUVగా ఇది నిలిచింది. ఫీచర్లు, టెక్నాలజీ విషయంలో Maruti ఈసారి కొత్త దారిలో నడిచింది. మైల్డ్ హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్ ఆప్షన్లు Victorisను ఇంధన సామర్థ్యంలో ముందుంచాయి.
Tesla Model Y – భారత్‌లోకి టెస్లా అడుగు
భారత్‌లో Tesla ప్రవేశం 2025లో పెద్ద సంచలనంగా మారింది. Model Y మన దేశంలోకి టెస్లా నుంచి వచ్చిన తొలి కారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన SUVగా గుర్తింపు పొందిన ఈ మోడల్ భారత్ మార్కెట్‌పై పెద్ద అంచనాలను ఏర్పరిచింది. Tesla రాకతో భారత EV మార్కెట్ మరో స్థాయికి చేరిందని చెప్పొచ్చు.
VinFast VF7 – కొత్త బ్రాండ్, కొత్త పోటీ
వియత్నాం బ్రాండ్ VinFast, తన VF7తో భారత్‌లోకి అడుగుపెట్టింది. డ్యూయల్ మోటార్ సెటప్, శక్తిమంతమైన పనితీరు, ప్రత్యేకమైన డిజైన్ దీని బలం. విలువకు తగిన ధరతో రావడం వల్ల ఇది కొత్త EVల మధ్య ప్రత్యేకంగా నిలిచింది. 2028 వరకు ఉచిత ఛార్జింగ్ సదుపాయం కొనుగోలుదారులను ఆకట్టుకుంది.
Volkswagen Golf GTI – పెర్ఫార్మెన్స్ ప్రేమికుల పండుగ
Golf GTI భారత్‌లోకి రావడం... పెర్ఫార్మెన్స్ కార్ లవర్స్‌కు పెద్ద పండుగలాంటిది. ఐకానిక్ హాట్ హ్యాచ్‌బ్యాక్ మొదటిసారి భారత్ మార్కెట్‌లోకి రావడం మన ఆటోమొబైల్ మార్కెట్ మెచ్యూరిటీని చూపించింది. అమ్మకాలు వేగంగా పూర్తవడం ఈ తరహా కార్లకు డిమాండ్ ఉందని నిరూపించింది.
MG Cyberster – ప్రీమియం EV స్పోర్ట్స్ కార్
MG Cyberster 2025లో అత్యంత ఆకర్షణీయమైన లాంచ్‌లలో ఒకటి. సూపర్ కార్ తరహా డోర్లు, షార్ప్ డిజైన్, పూర్తిగా ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్‌తో ఇది ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ ధరలో లభించే అత్యంత వేగవంతమైన కార్లలో ఒకటిగా Cyberster నిలిచింది.
2025 ఇచ్చిన సంకేతం
మొత్తానికి, 2025 భారత కార్ మార్కెట్‌ను కొత్త దశలోకి తీసుకెళ్లింది. SUVల ఆధిపత్యం కొనసాగుతూనే... EVలు, పెర్ఫార్మెన్స్ కార్లు భవిష్యత్ దిశను స్పష్టంగా చూపించాయి. 2026 సహా రాబోయే సంవత్సరాల్లో ఈ మార్పులు ఇంకా వేగం పుంజుకోనున్నాయన్నది స్పష్టంగా కనిపిస్తోంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















