(Source: ECI/ABP News/ABP Majha)
Bajaj Pulsar N 160: బజాజ్ పల్సర్‌లో ఒక మోడల్ ఇక బంద్ - అదేంటంటే?
Bajaj Pulsar N160 Single Channel ABS: బజాజ్ పల్సర్ ఎన్ 160 సింగిల్ ఏబీఎస్ వేరియంట్‌ను నిలిపివేయనుంది.
Bajaj Pulsar N 160: భారతదేశంలో బజాజ్ ఆటోకు పల్సర్ లైనప్ ప్రధాన ఆధారం. ఇప్పటివరకు దాదాపు డజను మోడల్‌లు ఈ సిరీస్‌లో అందుబాటులో ఉన్నాయి. కొత్త తరం పల్సర్ సాధారణంగా దాని అద్భుతమైన నిర్మాణ నాణ్యత, విశ్వసనీయత, ఇంజిన్ శుద్ధీకరణ కోసం మార్కెట్ నుంచి మంచి స్పందనను పొందింది. కొత్త తరం పల్సర్‌లో అమ్మకానికి అందుబాటులో ఉన్న అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో ఎన్160 ఒకటి.
గత సంవత్సరం లాంచ్ అయిన పల్సర్ ఎన్160 ఒక కమ్యూటర్, స్పోర్టీ మోటార్‌సైకిల్ మధ్య మంచి బ్యాలెన్స్‌ని కలిగి ఉంది. ఇది మొదటి నుండి సింగిల్ ఛానెల్ ఏబీఎస్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ అనే రెండు వేరియంట్‌ల్లో అందుబాటులో ఉంది. అయితే ఇటీవలి మీడియా నివేదిక ప్రకారం బజాజ్ ఆటో సింగిల్ ఛానెల్ ఏబీఎస్ వేరియంట్‌ను నిలిపివేయనుంది.
బజాజ్ పల్సర్ ఎన్160: ధరలు, ఫీచర్లు
జిగ్‌వీల్స్ కథనం ప్రకారం... బజాజ్ ఎన్160 సింగిల్ ఛానెల్ ఏబీఎస్ వేరియంట్‌ను నిలిపివేసినట్లు కొన్ని డీలర్ వర్గాలు ధృవీకరించాయి. ప్రారంభంలో సింగిల్ ఛానెల్ ఏబీఎస్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 1,22,854 కాగా, డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 1,27,853గా నిర్ణయించారు. రెండు వేరియంట్ల మధ్య కేవలం రూ. 5,000 వ్యత్యాసం ఉన్నందున చాలా మంది వినియోగదారులు డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ వేరియంట్‌ను ఎంచుకున్నారు. దీని కారణంగా సింగిల్ ఛానెల్ ఏబీఎస్ వేరియంట్ అమ్మకాలు నిరంతరం క్షీణించాయి.
అమ్మకాలు ఎందుకు పెరిగాయి?
తక్కువ విక్రయాల కారణంగా బజాజ్ కొన్ని నెలల క్రితం సింగిల్ ఛానెల్ ఏబీఎస్ వేరియంట్‌ను నిలిపివేయాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం బజాజ్ పల్సర్ ఎన్160 డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. దీని ధర రూ. 1,30,560గా (ఎక్స్ షోరూమ్) నిర్ణయించారు. ఇది మూడు కలర్ ఆప్షన్లను కలిగి ఉంది. బ్రూక్లిన్ బ్లాక్, రేసింగ్ రెడ్, కరేబియన్ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంది. వీటన్నింటి ధర దాదాపు ఒకే విధంగా ఉంటుంది.
పల్సర్ ఎన్160 బైక్‌లో 164.82 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌తో బేస్ అయి ఇది 15.7 బీహెచ్‌పీ పవర్‌ని, 14.65 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో పెయిర్ అయింది. ఇది టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ, హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 4వీ, యమహా ఎఫ్‌జెడ్-ఎస్ ఎఫ్ఐ వీ3.0, సుజుకి జిక్సర్‌లకు పోటీని ఇస్తుంది.
మరోవైపు బజాజ్ ఆటో కొత్త కమ్యూటర్ బైక్‌ను పరీక్షిస్తోంది. ఈ మోడల్‌ను పరిశీలిస్తే ఇది కంపెనీ సీటీ లైనప్‌లో రాబోయే మోడల్ కావచ్చని అనిపిస్తుంది. ఈ టెస్టింగ్ మోడల్‌లో ఎక్కువ భాగం కవర్‌తో ఉంది. అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన వివరాలు కనిపించాయి. ఇది సీటీ మోడల్ రూపంలో వస్తుందని అనుకోవచ్చు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply
Also Read: సూపర్ హిట్ టయోటా కామ్రీ అప్‌డేటెడ్ వెర్షన్ త్వరలో - ఈసారి హైబ్రిడ్ ఇంజిన్‌తో!
Also Read: లాంచ్‌కు రెడీ అవుతున్న కొత్త స్విఫ్ట్ - సరికొత్త ఇంజిన్, సూపర్ లుక్‌తో!