బజాజ్ బైక్‌లపై దసరా ఆఫర్లు.. వేలల్లో ఆదా, పండగ ఖర్చులు వచ్చినట్లే!
బజాజ్ పల్సర్ బైక్‌లపై దసరా పండగ ఆఫర్లు వచ్చాయి. నగదు రాయితీతో పాటు ఉచిత సర్వీసులు, ఇతర ప్రయోజనాలతో రూ.12,000 వరకు ఆదా చేయవచ్చు.

Bajaj Pulsar bikes Dasara offers: ఈ దసరా సీజన్‌లో కొత్త బైక్ కొనేవాళ్లకు బజాజ్ ఆటో శుభవార్త చెప్పింది. దసరా సందర్భంగా పల్సర్ బైక్‌లపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఈ ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. నగదు రాయితీతో పాటు ఉచిత సర్వీసుల రూపంలో అదనపు లాభాలు పొందవచ్చు. మొత్తంగా రూ.12,000 వరకు సేవ్ చేసే అవకాశం ఉంది. బైక్ కొనడం ద్వారా ఆదా అయ్యే డబ్బును పండుగ ఖర్చులకు వినియోగించుకోవచ్చు. Pulsar NS400Z పై అత్యధిక తగ్గింపు లభిస్తోంది.
బజాజ్ ప్రస్తుతం 11 రకాల పల్సర్ మోటార్‌సైకిళ్లను విక్రయిస్తోంది. వీటిలో కొన్ని మోడళ్లలో పెద్దగా మార్పులు లేవు. మరికొన్ని బైక్‌లను మాత్రం ఇటీవల పూర్తిగా కొత్తగా తీర్చిదిద్దింది. ముఖ్యంగా.. Pulsar 125, Pulsar 150 & Pulsar N160లో పెద్ద మార్పులు చేసింది. పండగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఈ బైక్‌లపై ఆఫర్లను అందిస్తోంది.
క్యాష్ డిస్కౌంట్ + ఫ్రీ సర్వీస్‌లు
ఇటీవల కొత్త రూపంతో వచ్చిన Pulsar 125పై కూడా ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. టీఎఫ్‌టీ స్క్రీన్ ఉన్న టాప్ వేరియంట్ ధర రూ.1.04 లక్షల ఎక్స్‌షోరూమ్‌గా ఉంది. ఈ బైక్‌పై రూ.2,500 నగదు రాయితీ అందిస్తోంది. దీంతో, దీని ధర రూ.1.02 లక్షలకు తగ్గుతుంది.
ఇది కూడా చదవండి: టయోటా అతి తక్కువ ధర కారు ఇదే! రూ.6.73 లక్షలే.. ఫీచర్లు మాత్రం అదుర్స్!
దీంతో పాటు మరో రూ.3,500 విలువైన ప్రయోజనం కూడా లభిస్తుంది. సాధారణంగా నాలుగు ఉచిత సర్వీసులు ఉంటాయి. ఈ ఆఫర్‌లో ఐదు ఉచిత సర్వీసులు పొందవచ్చు. అలాగే రుణంపై బైక్ కొనుగోలు చేసే వారికి ఉండే ప్రాసెసింగ్ ఫీజు కూడా ఉండదు. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ప్రయోజనాలు కేవలం ఫైనాన్స్ ద్వారా కొనుగోలు చేసేవారికే పరిమితం కావు. నగదు చెల్లించి బైక్ కొనేవారికి కూడా ఇవి వర్తిస్తాయి.
కొత్త Pulsar 125లో బజాజ్ కీలక మార్పులు చేసింది. కొత్త ఫ్రేమ్‌తో పాటు కొత్త ఇంజిన్‌ను అందించింది. ఎల్‌ఈడీ లైటింగ్, మూడు రైడింగ్ మోడ్‌లు వంటి ఫీచర్లు వచ్చాయి. టాప్ వేరియంట్‌లో టీఎఫ్‌టీ స్క్రీన్ కూడా ఉంది. 124.58cc ఇంజిన్ ఇప్పుడు 12.1hp శక్తిని, 11.4Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గత మోడల్‌లో ఇది 11.8hp & 10.8Nmగా ఉండేది.
ఇది కూడా చదవండి: కియా కార్ల దసరా సేల్.. రూ.1.70 లక్షల వరకు ప్రయోజనాలు.. అక్టోబర్ ఆఫర్ల పూర్తి లిస్ట్
Pulsar 150లో కూడా ఇదే తరహాలో కీలక అప్‌గ్రేడ్లు వచ్చాయి. Pulsar N160లోనూ కొత్త మార్పులు చేశారు. ఇందులో కొత్త S & SS వేరియంట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు






















