అన్వేషించండి

70 కి.మీ. మైలేజ్‌ ఇచ్చే Bajaj Platinaను రూ.8000లకే సొంతం చేసుకోవచ్చు! - EMI ఆప్షన్స్‌, బ్యాంక్‌ లోన్‌ వివరాలు ఇవిగో

Bajaj Platina Finance Options: కంపెనీ, బజాజ్ ప్లాటినా 100లో 102cc ఇంజిన్‌ను అందించింది. ఈ ఇంజిన్ గరిష్టంగా 7.9 PS పవర్‌తో 8.3 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. EMI ప్లాన్ గురించి తెలుసుకుందాం.

Bajaj Platina Price, Down Payment, Loan and EMI Details: బజాజ్ ప్లాటినా బైక్‌ ఆకర్షణీయమైన డిజైన్‌తో రోడ్డు మీద ప్రత్యేకంగా కనిపిస్తుంది. దీని స్లిమ్‌ బాడీ, స్టైలిష్‌ హెడ్‌ల్యాంప్‌ & క్రోమ్‌ ఆక్సెంట్స్‌ ఈ బండికి ప్రీమియం లుక్‌ ఇస్తాయి. లైట్‌వెయిట్ బిల్డ్‌తో పాటు స్పోర్టీ డికల్స్‌ దీని రూపానికి మరింత గ్లామర్‌ను జోడిస్తాయి. దీని ఎరోడైనమిక్‌ షేప్‌ వల్ల అధిక మైలేజ్‌తో పాటు మెరుగైన రైడింగ్‌ అనుభూతిని కూడా రైడర్‌ పొందుతాడు. రోజువారీ ప్రయాణంలో డబ్బును ఆదా చేసే & మంచి మైలేజీ ఇచ్చే బైకుల్లో బజాజ్ ప్లాటినా ఒకటి. విశేషం ఏంటంటే.. మీరు ఈ బైక్ కొనేప్పుడు ఫుల్‌ పేమెంట్‌ చేయాల్సిన అవసరం లేదు, మీ దగ్గర రూ.8,000 ఉన్న చాలు, ఈ బండికి ఓనర్‌ కావచ్చు.

బజాజ్ ప్లాటినా 100 ధర

హైదరాబాద్‌లో, బజాజ్ ప్లాటినా 100 బైక్ ఎక్స్‌-షోరూమ్‌ ధర (Bajaj Platina ex-showroom price, Hyderabad) రూ. 70,982. RTO ఫీజులు దాదాపు రూ. 10,000 & బీమా మొత్తం దాదాపు రూ. 7000, ఇతర ఖర్చులు కలుపుకుని, ఆన్‌-రోడ్‌ ధర దాదాపు (Bajaj Platina on-road price, Hyderabad) రూ. 88,000 అవుతుంది. 

విజయవాడలో, బజాజ్ ప్లాటినా 100 బైక్ ఎక్స్‌-షోరూమ్‌ ధర (Bajaj Platina ex-showroom price, Vijayawada) రూ. 71,315. RTO ఫీజులు దాదాపు రూ. 10,000 & బీమా మొత్తం దాదాపు రూ. 6600, ఇతర ఖర్చులు కలుపుకుని, ఇక్కడ కూడా ఆన్‌-రోడ్‌ ధర (Bajaj Platina on-road price, Vijayawada) దాదాపు రూ. 88,000 అవుతుంది. 

బజాజ్ ప్లాటినా 100 బైక్ కొనడానికి, మీరు 8 వేల రూపాయలను డౌన్ పేమెంట్ చేస్తే, బ్యాంకు నుంచి 80,000 వేల రూపాయల బైక్ లోన్ వస్తుంది. బ్యాంక్ ఈ మొత్తాన్ని మీకు 9% వార్షిక వడ్డీ రేటుతో ఇచ్చిందని అనుకుందాం. ఇప్పుడు EMI ఆప్షన్స్‌ చూద్దాం.

ప్రతి నెలా రూ. 2,266 EMI చెల్లిస్తే, మీ బైక్‌ లోన్‌ 4 సంవత్సరాల్లో (48 నెలలు) క్లియర్‌ అవుతుంది.

నెలకు నెలా రూ. 2,821 EMI చెల్లిస్తే, మీ రుణం మొత్తం 3 సంవత్సరాల్లో (36 నెలలు)పూర్తిగా తీరిపోతుంది.

నెలనెలా రూ. 3,931 EMI చెల్లిస్తే, 2 సంవత్సరాల్లో (24 నెలలు)మీరు రుణ విముక్తి పొందుతారు.

ప్రతి నెలా రూ. 7,263 EMI చెల్లిస్తే, మీ బైక్‌ లోన్‌ 1 సంవత్సరంలో (12 నెలలు)తీరిపోతుంది.

మీ క్రెడిట్‌ స్కోర్‌ ఎంత బాగుంది అనే విషయాన్ని బట్టి బైక్‌ లోన్‌, వార్షిక వడ్డీ రేటును బ్యాంక్‌ నిర్ణయిస్తుంది.

బజాజ్ ప్లాటినా పవర్‌ట్రెయిన్
బజాజ్ ప్లాటినా 100లో కంపెనీ 102cc ఇంజిన్‌ ఇచ్చింది, ఇది గరిష్టంగా 7.9 PS పవర్‌ను, 8.3 Nm పీక్‌ టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. ఈ బైక్ బరువు దాదాపు 117 కిలోలు. ఈ బైక్‌లో డ్రమ్ బ్రేక్‌లు బిగించారు. ఇంకా.. DRL, స్పీడోమీటర్, ఫ్యూయల్ గేజ్, టాకోమీటర్, యాంటీ-స్కిడ్ బ్రేకింగ్ సిస్టమ్ & 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నాయి. దీనికి 11 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంది. ఈ బైక్ లీటరుకు 70 కిలోమీటర్ల మైలేజ్ అని ARAI పేర్కొంది. ఈ ప్రకారం, ఫుల్‌ ట్యాంక్‌తో 770 కిలోమీటర్ల దూరం తిరగొచ్చు.

మార్కెట్లో, హోండా షైన్, TVS స్పోర్ట్స్ & హీరో స్ప్లెండర్ ప్లస్ వంటి బైక్‌లకు బజాజ్ ప్లాటినా 100 ప్రత్యక్ష పోటీని ఇస్తుంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Embed widget