అన్వేషించండి

Bajaj Dominar 400 Vs Triumph Speed 400 : బజాజ్ డోమినార్ Vs ట్రయంఫ్ స్పీడ్ 400 -బజాజ్ అందిస్తున్న రెండు పవర్‌ఫుల్ ఆప్షన్ల మధ్య బిగ్ ఫైట్!

బజాజ్ డోమినార్ 400, ట్రయంఫ్ స్పీడ్ 400 ఇప్పుడు 350సీసీ ఇంజిన్లతో పోటీపడుతున్నాయి. మీ అవసరాలకు తగ్గట్టుగా ఏ బైక్ సరైనదో వివ‌రాలు తెలుసుకుందాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • బజాజ్ డోమినార్ 400, ట్రయంఫ్ స్పీడ్ 400 350సీసీ విభాగంలో పోటీకి సిద్ధం.
  • డోమినార్ 400 ఇంజిన్ పర్ఫార్మెన్స్, ట్రయంఫ్ స్పీడ్ 400 రెట్రో స్టైలింగ్ ఆకర్షణీయం.
  • డోమినార్ 400 టూరింగ్, స్పీడ్ 400 సిటీ రైడింగ్‌కు అనుకూలం.
  • డోమినార్ 400 ధర తక్కువ, ట్రయంఫ్ స్పీడ్ 400 ప్రీమియం ఎంపిక.

Bajaj Dominar 400 Vs Triumph Speed 400: ఇండియాలో 350సీసీ మోటార్ సైకిల్ విభాగం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. బజాజ్ ఆటో తన పాపులర్ మోడల్ డోమినార్ 400ను 350సీసీ ఇంజిన్‌తో లాంచ్ చేయగా, బజాజ్ భాగస్వామ్యంతో నడుస్తున్న ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ కూడా తన 350సీసీ లైనప్‌ను మార్కెట్లోకి తెచ్చింది. రూ. 2 లక్షల బడ్జెట్‌లో బైక్ కొనాలనుకునే వారికి ఇప్పుడు డోమినార్ 400, ట్రయంఫ్ స్పీడ్ 400 రూపంలో రెండు అద్భుతమైన ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే డోమినార్ పక్కా టూరింగ్ బైక్ కాగా, ట్రయంఫ్ స్పీడ్ 400 ఒక రెట్రో రోడ్‌స్టర్ అని నిపుణులు పేర్కొంటున్నారు.  ఈ రెండింటిలో ఏది మీకు సెట్ అవుతుందో తెలుసుకుందాం.

ఇంజిన్ - పర్ఫార్మెన్స్..
బజాజ్ డోమినార్ 400 ఇప్పుడు 349 సీసీ సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో వస్తోంది. ఇది 40.6 హెచ్‌పి పవర్, 33.2 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు ట్రయంఫ్ స్పీడ్ 400లోని 350సీసీ పవర్‌హౌస్ 37 హెచ్‌పి పవర్, 32 ఎన్ఎమ్ టార్క్‌ను ఆఫర్ చేస్తోంది. పవర్ విషయంలో డోమినార్ కొంచెం పైచేయి సాధించింది. రెండు బైక్‌లు కూడా 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో స్మూత్ రైడింగ్ అనుభవాన్ని ఇస్తాయి అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

హార్డ్‌వేర్ - ఫీచ‌ర్లు..
ఇంజిన్ సీసీ తగ్గించినప్పటికీ, డోమినార్ 400 తన పాత హార్డ్‌వేర్‌ను అలాగే కొనసాగిస్తోంది. ఇందులో 43 మిమీ యూఎస్‌డీ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక వైపు అడ్జస్టబుల్ మోనో-షాక్ ఉన్నాయి. 193 కేజీల బరువుతో ఉండే ఈ బైక్ హైవేలపై లాంగ్ రైడ్స్ వెళ్లే వారికి చాలా సౌకర్యంగా ఉంటుంది. రోడ్ ప్రెజెన్స్ కూడా చాలా భారీగా కనిపిస్తుంది. దీనికి భిన్నంగా ట్రయంఫ్ స్పీడ్ 400 తేలికపాటి ఛాసిస్‌తో వస్తుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 164 మిమీ ఉండటం వల్ల సిటీ ట్రాఫిక్‌లో నడపడం చాలా సులభం. దీని రెట్రో లుక్ క్లాసిక్ బైక్స్ ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది అని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

ధరల వివరాలు..
ధర విషయంలో బజాజ్ డోమినార్ 400 చాలా అగ్రెసివ్‌గా ఉంది. దీని ధర రూ. 2.03 లక్షల (ఎక్స్‌షోరూమ్) వద్ద లభిస్తోంది. అదే సమయంలో ట్రయంఫ్ స్పీడ్ 400 ప్రారంభ ధర రూ. 2.31 లక్షల (ఎక్స్‌ షోరూమ్) గా ఉంది. అంటే డోమినార్ కంటే ట్రయంఫ్ సుమారు రూ. 28,000 ఖరీదైనది.

మీకు ఏది బెస్ట్?
మీరు తరచుగా లాంగ్ ట్రిప్స్ వెళ్లే వారైతే, హైవేపై స్టెబిలిటీ కావాలనుకుంటే తక్కువ ధరలో లభించే బజాజ్ డోమినార్ 400 ఉత్తమమైన ఎంపిక. దీని టూరింగ్ సెటప్ లాంగ్ ప్రయాణాల్లో అలసట లేకుండా చూస్తుంది. అలాకాకుండా మీకు ఒక ప్రీమియం బ్రాండ్ కావాలి, సిటీలో రోజూ వాడటానికి తేలికగా ఉండే బైక్ కావాలి అనుకుంటే ట్రయంఫ్ స్పీడ్ 400 వైపు మొగ్గు చూపవచ్చు. కాగా, బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 400 జెడ్ (Pulsar NS400Z) లో కూడా త్వరలో ఈ 350సీసీ అప్‌డేట్ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్. బజాజ్ తన లైనప్‌ను అప్‌డేట్ చేస్తున్న వేగం చూస్తుంటే ఈ అప్‌డేట్ అనుకున్నదానికంటే ముందే రావచ్చని విశ్లేష‌కులు అంటున్నారు.

Frequently Asked Questions

బజాజ్ డోమినార్ 400 మరియు ట్రయంఫ్ స్పీడ్ 400 మధ్య ప్రధాన తేడా ఏమిటి?

డోమినార్ 400 ఒక పక్కా టూరింగ్ బైక్, అయితే ట్రయంఫ్ స్పీడ్ 400 ఒక రెట్రో రోడ్‌స్టర్. ఈ రెండూ 350సీసీ ఇంజిన్‌తో అందుబాటులో ఉన్నాయి.

ఇంజిన్ పర్ఫార్మెన్స్ విషయంలో ఏ బైక్ మెరుగైనది?

బజాజ్ డోమినార్ 400, 40.6 హెచ్‌పి పవర్‌తో ట్రయంఫ్ స్పీడ్ 400 (37 హెచ్‌పి) కంటే కొంచెం మెరుగైన పవర్‌ను అందిస్తుంది. రెండూ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తాయి.

బరువు మరియు హార్డ్‌వేర్‌లో తేడాలు ఏమిటి?

డోమినార్ 400, 193 కేజీల బరువుతో లాంగ్ రైడ్‌లకు సౌకర్యవంతంగా ఉంటుంది. ట్రయంఫ్ స్పీడ్ 400 తేలికపాటి ఛాసిస్‌తో సిటీ ట్రాఫిక్‌లో సులభంగా నడుస్తుంది.

ధరల విషయంలో ఏది చౌకైనది?

బజాజ్ డోమినార్ 400, రూ. 2.03 లక్షల (ఎక్స్‌షోరూమ్) ధరతో వస్తుంది. ట్రయంఫ్ స్పీడ్ 400, రూ. 2.31 లక్షల (ఎక్స్‌షోరూమ్) తో సుమారు రూ. 28,000 ఖరీదైనది.

ఏ బైక్ ఎవరికి సరిపోతుంది?

లాంగ్ ట్రిప్స్‌కు డోమినార్ 400 ఉత్తమం. ప్రీమియం బ్రాండ్, సిటీ వాడకానికి ట్రయంఫ్ స్పీడ్ 400 మంచి ఎంపిక.

టాప్ హెడ్ లైన్స్

రూ.1 లక్ష చెల్లించి Renault Kwid కొంటే, ప్రతినెలా EMI ఎంత కట్టాలి
రూ.1 లక్ష చెల్లించి Renault Kwid కొంటే, ప్రతినెలా EMI ఎంత కట్టాలి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Yamaha R15 కంటే పవర్‌ఫుల్‌.. ధర రూ.2 లక్షలు! ఆగస్టు 27న వస్తున్న R2పై భారీ అంచనాలు
Yamaha R2లో 220cc ఇంజిన్‌! - ఈ స్పోర్ట్స్‌ బైక్‌లో ఇంకా ఎలాంటి అద్భుతాలు ఉండొచ్చు?
టాటా సియెర్రా vs కియా సెల్టోస్‌ మధ్య స్పీడ్‌ టెస్ట్‌.. ఏ కారు గెలిచింది?
Tata Sierra vs Kia Seltos - డీజిల్‌ ఆటోమేటిక్‌లో ఏ కారుకు దూకుడు ఎక్కువ?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget