Bajaj First CNG Bike: ప్రపంచంలోనే మొదటి సీఎన్‌జీ బైక్ - లాంచ్ చేయనున్న బజాజ్!
Bajaj CNG Bike: బజాజ్ ఆటో ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ బైక్‌ను త్వరలో లాంచ్ చేయనుంది.
Bajaj Auto First CNG Bike: బజాజ్ ఆటో ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. బజాజ్ తన మొదటి సీఎన్‌జీ బైక్‌ను ఈ ఏడాది జూన్‌లో విడుదల చేస్తున్నట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ ఇటీవల ప్రకటించారు. బజాజ్ ఈ సీఎన్‌జీ బైక్‌కి వేరే పేరు కూడా పెట్టింది. బజాజ్ రాబోయే కాలంలో దాని సీఎన్‌జీ మోడళ్ల కోసం కంపెనీ సబ్ బ్రాండ్‌ను కూడా తీసుకురావచ్చు.
పీటీఐ నివేదిక ప్రకారం రాజీవ్ బజాజ్ సీఎన్‌జీ బైక్ డెవలప్‌మెంట్ గురించి చెప్పారు. రాబోయే ఐదేళ్లలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో రూ. 5,000 కోట్లు పెట్టుబడి పెట్టడం గురించి మాట్లాడుతున్నారు. దీనికి ముందు నాలుగు చక్రాలు, మూడు చక్రాల వాహనాలకు సంబంధించిన అనేక సీఎన్‌జీ మోడళ్లు, వాటి వేరియంట్లు ప్రపంచ, భారతీయ మార్కెట్‌ల్లో కనిపించాయి.
ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్
సీఎన్‌జీ మోటార్‌సైకిల్ బజాజ్‌కు సంబంధించిన అత్యంత అద్భుతమైన ప్రాజెక్ట్‌లలో ఒకటి. కంపెనీ ఇంతకుముందు సీఎన్‌జీలో మూడు చక్రాల వాహనాలను మాత్రమే తయారు చేసేది. అయితే ద్విచక్ర వాహనాలలో సీఎన్‌జీ టెక్నాలజీని అందించడం ద్వారా బజాజ్ ప్రపంచంలోనే ఇలాంటి బైక్ లాంచ్ చేసిన మొదటి కంపెనీగా అవతరిస్తుంది. జూన్‌లో ఈ సీఎన్‌జీ బైక్‌ను విడుదల చేసిన వెంటనే ఇది ప్రపంచంలోనే మొదటి సీఎన్‌జీ బైక్‌గా అవతరించనుంది.
బజాజ్ ఆటో సీఎన్‌జీ బైక్ ఫీచర్లు
వాహన తయారీ సంస్థ బజాజ్ సీఎన్‌జీ బైక్ పేరు బజాజ్ బ్రూజర్. ఈ బైక్‌లో టెయిల్‌పైప్ ఎమిషన్స్‌ను తగ్గించారు. అంతేకాకుండా కార్బన్ డయాక్సైడ్ (CO2) ఉద్గారాలు కూడా 50 శాతం తగ్గాయి. బజాజ్ సీఎన్‌జీ మోడల్ రెండో స్టోరేజ్ సిలిండర్‌ను కూడా కలిగి ఉండబోతోంది. బజాజ్ తన సీఎన్‌జీ ఉత్పత్తుల కోసం కొత్త సబ్ బ్రాండ్‌ను ప్రారంభించాలని కూడా ఆలోచిస్తోంది. బజాజ్ లాంచ్ చేసిన ఈ సీఎన్‌జీ బైక్ ధర పెట్రోల్ వేరియంట్ కంటే ఎక్కువగా ఉండవచ్చు. అధిక తయారీ వ్యయం దీని వెనుక కారణం అని తెలుస్తోంది.