(Source: ECI/ABP News/ABP Majha)
Electric Aircraft: అద్భుతం, గాల్లో చక్కర్లు కొట్టిన ఫస్ట్ ఆల్ ఎలక్ట్రిక్ ఎయిర్ క్రాఫ్ట్ 'ఆలిస్'
విమానయానంలో కొత్త శకం మొదలయ్యింది. ఇప్పటి వరకు ఫ్యూయల్ ద్వారా ఎయిర్ క్రాఫ్ట్ లు ప్రాయాణించగా, తొలిసారి ఆల్ ఎలక్ట్రిక్ ఎయిర్ క్రాఫ్ట్ ‘ఆలిస్’ ఆకాశ మార్గాన చక్కర్లు కొట్టింది.
ప్రపంచ వ్యాప్తంగా రవాణా వ్యవస్థలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆయా వాహనాల నుంచి కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ప్రపంచ దేశాలు కీలక చర్యలు తీసుకుంటున్నాయి. గ్రీన్ వెహికల్స్ మీద చాలా దేశాలు స్పెషల్ ఫోకస్ పెట్టాయి. ఎలక్ట్రిక్ కార్లు, బస్సుల వినియోగాన్ని పెంచుతున్నాయి. తాజాగా ఎలక్ట్రిక్ విమానాలను సైతం రూపొందిస్తున్నాయి. విమానయాన రంగంలో తొలిసారి ఆల్ ఎలక్ట్రిక్ ఎయిర్ క్రాఫ్ట్ 'ఆలిస్' సక్సెస్ ఫుల్ గా గాల్లో ప్రయాణించింది. గ్రాంట్ కౌంటీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (MWH) నుంచి ఉదయం 7:10 గంటలకు ఈ విమానం గాల్లోకి ఎగిరింది. 3,500 అడుగుల ఎత్తులో 8 నిమిషాల జర్నీ చేసింది. ఈ కొత్త తరం ఎయిర్‌క్రాఫ్ట్ తో శబ్ద సమస్యలు తొలగిపోనున్నాయి. వాణిజ్య అవసరాల కోసం ఇలాంటి విమానాలను విరివిగా ఉపయోగించే అవకాశం ఉంది.
Today, our all-electric Alice aircraft electrified the skies and embarked on an unforgettable world’s first flight. See Alice make history in the video clip below. We’re honored to celebrate this groundbreaking leap towards a more #sustainable future.#electricaviation pic.twitter.com/Q9dFoTPyiB
— Eviation Aircraft (@EviationAero) September 27, 2022
ఆలిస్ ఎటువంటి కర్బన ఉద్గారాలను ఉత్పత్తి చేయదు. శబ్దాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. లైట్ జెట్‌లు, హై-ఎండ్ టర్బోప్రాప్‌లతో పోల్చితే విమాన ఆపరేటింగ్ ఖర్చుకూడా చాలా తక్కువగా ఉంటుంది. రీజినల్ ట్రావెల్ కోసం ఆల్-ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఉపయోగించడం మూలంగా ప్రాంతీయ ప్రయాణాలు చాలా తక్కువ ఖర్చుతో పాటు పర్యావరహితంగా ఉంటాయని ఏవియేషన్ అధికారులు వెల్లడించారు. ఎవియేషన్ కంపెనీ ఆలిస్ ను కమ్యూటర్, కార్గో మార్కెట్‌లను లక్ష్యం చేసుకోని రూపొందించింది. సాధారణంగా 150 మైళ్ల నుంచి 250 మైళ్ల వరకు ఈ విమానాలను నడిపే అవకాశం ఉంది. కేప్ ఎయిర్, గ్లోబల్ క్రాసింగ్ ఎయిర్‌లైన్స్, యుఎస్ ఆధారిత ప్రాంతీయ ఎయిర్‌లైన్స్ 125 ఆలిస్ విమానాలకు ఆర్డర్ చేశాయి. DHL ఎక్స్‌ప్రెస్ 12 ఆలిస్ ఈకార్గో విమానాలకు ఆర్డర్ ఇచ్చింది.
ఆల్-ఎలక్ట్రిక్ ఆలిస్ ఎయిర్క్రాఫ్ట్ ఫీచర్లు
ఈ విమానం గరిష్ట ఆపరేటింగ్ స్పీడ్ గంటకు 260 నాట్స్ గా ఉంటుంది. లోడ్ విషయానికి వస్తే ప్యాసింజర్ వెర్షన్ కోసం 2,500 పౌండ్లు, ఇకార్గో వెర్షన్ కోసం 2,600 పౌండ్లు ఉంటుంది. తొమ్మిది మంది ప్రయాణికుల కమ్యూటర్ తో సహా మూడు వేరియంట్‌లలో ఈ ఎయిర్ క్రాఫ్ట్ అందుబాటులో ఉన్నది. ఆకర్షణీయమైన, అధునాతన ఆరుగురు ప్రయాణికుల ఎగ్జిక్యూటివ్ క్యాబిన్ తో పాటు ఒక eCargo వెర్షన్ సైతం రెడీ అయ్యింది. అన్ని కాన్ఫిగరేషన్లు ఇద్దరు సిబ్బందికి సపోర్టు చేస్తాయి. ఎగ్జిక్యూటివ్ క్యాబిన్, eCargoలో లోపలి భాగం మినహా ప్రయాణికుల కాన్ఫిగరేషన్‌కు సమానంగా ఉంటాయి. ఆలిస్ మాగ్నిఎక్స్ నుంచి రెండు మాగ్ని650 ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ యూనిట్ల ద్వారా ఎనర్జీని పొందుతుంది. AVL (బ్యాటరీ సపోర్ట్), GKN (వింగ్స్), హనీవెల్ (అధునాతన ఫ్లై-బై-వైర్ సిస్టమ్, ఫ్లైట్ కంట్రోల్స్,ఏవియానిక్స్), మల్టీప్లాస్ట్ (ఫ్యూజ్‌లేజ్), పార్కర్ ఏరోస్పేస్ (ఆరు సాంకేతిక వ్యవస్థలు), పోటేజ్ (డోర్లు)ను కలిగి ఉంది. ఆలిస్ కు సంబంధించిన అధునాతన బ్యాటరీ సిస్టమ్ అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది . ఈ విమానం ఫ్లై-బై-వైర్ కాక్ పిట్‌ను కూడా కలిగి ఉంటుంది.