అన్వేషించండి

Audi India New Launch: ఆడీ కార్ల ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. వివరాలు తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!

Audi India New Launch: లగ్జరీ కార్ల బ్రాండ్ ఆడీ నుంచి ఈ ఏడాది మరో మూడు కార్లు రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. వీటిలో కనీసం ఒకటి ఎలక్ట్రిక్ వెహికల్ అయ్యే అవకాశం ఉంది.

జర్మన్‌కు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడీ (Audi) నుంచి ఈ ఏడాది కనీసం మూడు కార్లు భారతదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఆడీ తన సరికొత్త కారు ఆర్ఎస్ 5 స్పోర్ట్‌ బ్యాక్‌ను ఇటీవల ఇండియాలో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏ4 ఫేస్‌లిఫ్ట్ తర్వాత ఐదో మోడల్‌గా ఇది ఎంట్రీ ఇచ్చింది. ఈ కారు లాంచ్ అనంతరం ఆడీ ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ మీడియా సంస్థలతో మాట్లాడుతూ.. 2021 చివరికల్లా మరో మూడు కార్లను విడుదల చేసే అవకాశం ఉందని చెప్పారు. 

Audi India New Launch: ఆడీ కార్ల ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. వివరాలు తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!

ఆడీ నుంచి రాబోయే మరిన్ని ఉత్పత్తుల గురించి చెప్పమని మీడియా ప్రశ్నించగా.. 'గత నెలలో మూడు కార్లను విడుదల చేశాం. ఈ నెల ఆర్ఎస్ 5 స్టోర్ట్‌ బ్యాక్ కారును తీసుకొచ్చాం. అతి త్వరలోనే ఇంకో కారు లాంచ్ చేయబోతున్నాం. తర్వాత ఒకటి.. ఆపై మరొకటి.. ఇలా ఈ ఏడాది చివరికల్లా మొత్తం మూడు కార్లను తీసుకొచ్చే యోచనలో ఉన్నామని' తెలిపారు.  అయితే ఏ మోడల్స్ వస్తాయనే విషయాలను మాత్రం బల్బీర్ వెల్లడించలేదు. దీంతో ఆడీ నుంచి మూడు కార్ల వివరాలు, ఫీచర్లపై ఊహాగానాలు మొదలయ్యాయి. 

Audi India New Launch: ఆడీ కార్ల ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. వివరాలు తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!

జూలైలో నెలలో ఆడీ ఈ-ట్రోన్ (e-tron) 50, ఈ-ట్రోన్ 55 అనే రెండు వేరియంట్‌లను విడుదల చేసింది. ఇక ఈ నెలలో ఆర్ఎస్ 5 స్పోర్ట్‌ బ్యాక్ కారును తీసుకొచ్చింది. జూలైలో ఈ-ట్రోన్ సిరీస్ లాంచ్ సమయంలో ఈ ఏడాది ఇండియాలో కనీసం ఒక ఎలక్ట్రిక్ కారును తీసుకొస్తామని బల్బీర్ చెప్పారు. దీంతో ఈసారి విడుదల కాబోయే మూడు కార్లలో కనీసం ఒక ఎలక్ట్రిక్ కారు ఉండే ఛాన్స్ ఉంది.  

Audi India New Launch: ఆడీ కార్ల ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. వివరాలు తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడీ కార్లలో ఈ-ట్రోన్ జీటీ, ఆర్ఎస్ ఈ-ట్రోన్ జీటీ ఫోర్ డోర్ కోపే సెడాన్‌లు మాత్రమే ఎలక్ట్రిక్ వాహానాలుగా ఉన్నాయి. ఇవి కాకుండా ఈ-ట్రోన్ ఎస్‌యూవీలు ఉన్నాయి. కాబట్టి వీటిలో కనీసం ఒకటి లేదా రెండు భారతదేశంలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.  

ఇతర మోడల్స్ విషయానికి వస్తే.. న్యూ జెన్ ఆడీ క్యూ3 ఎస్‌యూవీ, క్యూ 5 ఫేస్‌లిఫ్ట్ ఉన్నాయి. వీటిని ఇండియాకు తీసుకొచ్చేందుకు సంస్థ కొంతకాలంగా ప్రయత్నిస్తోంది. అయితే కొవిడ్19 మహమ్మారి కారణంగా వీటి లాంచ్ వాయిదా పడుతూ వస్తోంది. ఈ రెండు మోడల్స్‌ను కూడా ఇండియాకు తీసుకొచ్చే అవకాశం ఉంది. 

Also Read: Tesla Cars : టెస్లాకు పన్నులు తగ్గించేది లేదన్న కేంద్రం..! ఒక్కో కారు ఎంత రేటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget