అన్వేషించండి

Ather Rizta: ఏథర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ - రిజ్టా ధర ఎంతంటే?

Ather Rizta Price: ప్రముఖ కార్ల బ్రాండ్ ఏథర్ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. అదే ఏథర్ రిజ్టా.

Ather Rizta Electric Scooter: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను దేశంలో ప్రవేశపెట్టింది. అదే ఏథర్ రిజ్టా. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 165 కిలోమీటర్ల వరకు రేంజ్ అందించనుంది.

దీని కోసం ఎలక్ట్రిక్ స్కూటర్ లవర్స్ ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నారు. ఏథర్ రిజ్టా ఒక ఫ్యామిలీ ఈ-స్కూటర్ అని చెప్పవచ్చు. ఏథర్ రిజ్టా ధర రూ. 1.10 లక్షల నుంచి ప్రారంభం కానుంది. టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 1.45 లక్షలుగా ఉంది. ఇది స్పేస్, కంఫర్ట్ కోసం ప్రత్యేక శ్రద్ధతో రూపొందిన ప్రాక్టికల్ స్కూటర్. అందువల్ల ఇది ముందుకు మరింత వంగి ఉంటుంది. సౌకర్యం కోసం పొడవైన సీటును కలిగి ఉంది. ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం స్టోరేజ్ కెపాసిటీ 56 లీటర్లు కాగా, ఇందులో ఫ్రంట్, అండర్ సీట్ స్టోరేజ్ ఉన్నాయి.

Also Read: మొదటిసారి అలాంటి కారు తయారు చేయనున్న టెస్లా - భారతదేశం కోసమే!

ఏథర్ రిజ్టా ట్రాక్షన్ కంట్రోల్‌ ఫీచర్ ఉన్న మొట్టమొదటి భారతదేశపు ఎలక్ట్రిక్ స్కూటర్. డిజైన్ గురించి చెప్పాలంటే ఇది కంపెనీ స్పోర్టియర్ 450 మాదిరిగానే కొన్ని వివరాలతో చాలా ఆకర్షణీయంగా ఉంది. దీన్ని మరింత సౌకర్యవంతమైన సస్పెన్షన్ కోసం ట్యూన్ చేశారు. దీన్ని రైడ్ చేయడం మరింత సులభతరం అవుతుందని కంపెనీ తెలిపింది. ఏథర్ 450ఎక్స్‌తో పోల్చినట్లయితే, రిజ్టా కేవలం 7 కిలోల బరువు మాత్రమే ఎక్కువగా ఉంటుంది. దాని సెగ్మెంట్‌లోని తేలికైన ఎలక్ట్రిక్ స్కూటర్‌లలో ఇది కూడా ఒకటి.

వీటిలో 2.9 కేడబ్ల్యూహెచ్, 3.7 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ ఆప్షన్లు ఉన్నాయి. రేంజ్ గురించి చెప్పాలంటే 2.9 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ వేరియంట్ రేంజ్ 123 కిలోమీటర్లు కాగా, 3.7 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ రేంజ్ 165 కిలోమీటర్లుగా ఉంది. రెండు వేరియంట్‌ల టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లుగా ఉండటం విశేషం.

రెండు రైడింగ్ మోడ్‌లు, రివర్స్ ఫంక్షన్‌తో పాటు టాప్ ఎండ్ వెర్షన్ టీఎఫ్‌టీ డిస్‌ప్లేను పొందుతుంది. ఇవి ప్రారంభ ధరలు. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ జూలై నుంచి ప్రారంభం అవుతుంది. ఐదు సంవత్సరాల వారంటీ, ఐపీ67 రేటింగ్, 400 మిల్లీమీటర్ వాటర్ వేడింగ్ కెపాసిటీ కూడా ఉన్నాయి.  

Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!

టాప్ హెడ్ లైన్స్

180 టన్నుల విమానాన్ని కేవలం రెండు టైర్లపైనే లాగిన SUV.. Denza Bao 5 సరికొత్త రికార్డు!
అతి పెద్ద విమానాన్ని లాక్కెళ్లిన BYD కారు.. అది కూడా కేవలం టైర్ల మీద!
Fuel Efficient Diesel SUVs: డీజిల్ ఎస్‌యూవీ కొనే ప్లాన్‌లో ఉన్నారా? లీటర్‌కు దాదాపు 22 కి.మీ. మైలేజీ ఇచ్చే బెస్ట్‌ కార్లు ఇవే!
బెస్ట్‌ మైలేజ్‌ ఇచ్చే టాప్‌-10 మిడ్‌సైజ్‌ డీజిల్ SUVలు.. ఫస్ట్‌ ప్లేస్‌లో Hyundai Creta!
ఆరు లక్షల అమ్మకాల మైలురాయిని దాటిన Maruti Fronx.. నెలకు 20,000 కార్లు అమ్ముడవుతున్నాయ్!
రోజుకు 667 మంది కొంటున్న మిడిల్‌ క్లాస్‌ కారు ఇది.. రేటు ఎక్కువేం కాదు, మీరూ తీసుకోవచ్చు!
17,000 రూపాయలు పెరిగిన కొత్త Bajaj Pulsar RS200 ధర.. USD ఫోర్క్స్, క్విక్‌షిఫ్టర్‌తో అప్‌డేటెడ్‌ మోడల్ వచ్చేసింది!
Bajaj Pulsar RS200 అప్‌డేటెడ్‌ వెర్షన్‌ లాంచ్‌.. కొత్త TFT డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్‌తో మరింత ఫన్‌

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Pant Century: తొలి టెస్టులో 720 పరుగులతో ఇండియా రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి
తొలి టెస్టులో 720 పరుగులతో India రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి
AgriGold Scam: అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
Hyderabad Crime News: డబ్బులు ఇవ్వకపోతే కుటుంబాన్ని లేపేస్తానంటూ బెదిరింపులు.. లేడీ డాన్ అరెస్ట్!
డబ్బులు ఇవ్వకపోతే కుటుంబాన్ని లేపేస్తానంటూ బెదిరింపులు.. లేడీ డాన్ అరెస్ట్!
Jagan vs Sharmila: యలహంక ప్యాలెస్ వివాదం.. షర్మిలను అడ్డుకునేందుకు కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్!
యలహంక ప్యాలెస్ వివాదం.. షర్మిలను అడ్డుకునేందుకు కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్!
Jabardasth Team Accident : రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ టీం సభ్యులకు గాయాలు - పంచాయతీ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా...
రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ టీం సభ్యులకు గాయాలు - పంచాయతీ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా...
Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
Bigg Boss Season 10 Today November 21st: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వర్షిణి - ముకేశ్ మధ్య పోటీ! వీడియో వేసి మరీ వాయించేశారుగా! రాంప్రసాద్‌కి నాగ్ ఫిదా!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వర్షిణి - ముకేశ్ మధ్య పోటీ! వీడియో వేసి మరీ వాయించేశారుగా! రాంప్రసాద్‌కి నాగ్ ఫిదా!
Embed widget