Ather Energy ఫెస్టివ్ సర్వీస్ కార్నివాల్ - మీ స్కూటర్‌కి ఫ్రీ చెకప్, 20 శాతం వరకు డిస్కౌంట్లు, లిమిటెడ్ పిరియడ్ ఆఫర్
Ather Energy అక్టోబర్ 9 నుంచి 18 వరకు ఫెస్టివ్ సర్వీస్ కార్నివాల్ నిర్వహిస్తోంది. ఉచిత 15 పాయింట్ల చెక్-అప్, 20 శాతం వరకు సర్వీస్ డిస్కౌంట్లతో కస్టమర్లకు దీపావళి గిఫ్ట్ ఇచ్చింది.

Ather Energy Diwali 2025 Offers & Discounts: ప్రస్తుత దీపావళి ఫెస్టివ్ సీజన్‌లో, ఎలక్ట్రిక్ స్కూటర్ యజమానులకు Ather Energy గుడ్ న్యూస్ చెప్పింది. ఈ కంపెనీ, “ఏథర్ సర్వీస్ కార్నివాల్“ (Ather Service Carnival) పేరుతో దేశవ్యాప్తంగా ప్రత్యేక సర్వీస్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ ఈ నెల (అక్టోబర్ 2025) 9వ తేదీ నుంచి ప్రారంభమైంది & అక్టోబర్ 18, 2025 వరకు అందుబాటులో కొనసాగుతుంది.
ఉచిత హెల్త్ చెక్-అప్
ఏథర్ సర్వీస్ కార్నివాల్‌లో భాగంగా, అన్ని Ather స్కూటర్ ఓనర్లకు 15 పాయింట్ల హెల్త్ చెక్-అప్ ఉచితంగా లభిస్తుంది. ఇది మనుషుల ఆరోగ్య తనిఖీ కాదు, ఏథర్ స్కూటర్ల ఆరోగ్య తనిఖీ. ఇందులో... బ్రేక్స్, టైర్లు, సస్పెన్షన్, ఎలక్ట్రానిక్స్ వంటి ముఖ్య భాగాలను ఎక్స్‌పర్ట్స్ పూర్తిగా పరిశీలిస్తారు, సరి చేస్తారు. దీని ద్వారా స్కూటర్ రైడ్ మరింత సేఫ్‌గా, స్మూత్‌గా ఉంటుంది.
ఆకర్షణీయమైన డిస్కౌంట్లు
కంపెనీ సర్వీసింగ్‌పై కూడా మంచి తగ్గింపులు ప్రకటించింది
పెయిడ్ లేబర్, బ్రేక్ ప్యాడ్స్‌పై 10% తగ్గింపు
పెయింటెడ్ బాడీ ప్యానెల్స్‌పై 15% తగ్గింపు
పాలిషింగ్ సర్వీసులపై 20% తగ్గింపు
మీ స్కూటర్‌కి రిఫ్రెష్ లుక్ ఇవ్వాలనుకుంటే లేదా జనరల్ చెక్-అప్ చేయించాలనుకుంటే, ఇదే సరైన టైమ్. డిస్కౌంట్‌లో సర్వీస్ చేయించి డబ్బు మిగిల్చుకోవచ్చు.
400 కంటే ఎక్కువ సర్వీస్ సెంటర్లు
Ather Energy కి ప్రస్తుతం దేశవ్యాప్తంగా 400 కంటే ఎక్కువ సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. అంటే, ప్రతి నగరం & పెద్ద పట్టణంలోనూ ఏథర్ సర్వీస్ సెంటర్ కనిపిస్తుంది. కాబట్టి, కస్టమర్లు తమకు సమీపంలోని ఔట్‌లెట్ ద్వారా సర్వీస్ అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు.
కంపెనీ కొత్త మైలురాయి
Ather Energy, తాజాగా, 500 ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు (Ather Experience Centres) దాటిన ఘనతను సాధించింది. కంపెనీ లక్ష్యం FY26 నాటికి 700 సెంటర్లకు చేరుకోవడం. ఇది భారత ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో కంపెనీ వేగాన్ని, వ్యూహాన్ని చూపిస్తుంది.
యువతకు మెసేజ్
ఇప్పటి యువత ఎలక్ట్రిక్ స్కూటర్లతో షికార్లు చేయడం మాత్రమే కాదు - వాటి మెయింటెనెన్స్, సర్వీస్ సపోర్ట్‌కు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో, Ather Energy ఇచ్చిన ఉచిత స్కూటర్ చెక్-అప్, డిస్కౌంట్లు కస్టమర్లలో నమ్మకాన్ని మరింత పెంచుతాయి.
ధరలు
ఏథర్ స్కూటర్ ధరలు రూ. 1,23,174 (ఆన్-రోడ్) నుంచి ప్రారంభమవుతాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల కంపెనీ, భారతదేశంలో 4 మోడళ్లను అందిస్తోంది. వాటిలో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్లు Rizta (రూ. 1,23,174), 450X (రూ. 1,56,595) & 450S (రూ. 1,39,436). అత్యంత ఖరీదైన ఏథర్ స్కూటర్ 450 Apex, దీని ధర రూ. 1,99,039. ఈ ఆన్-రోడ్ ధరలు నగరం & డీలర్‌షిప్‌ను బట్టి మారవచ్చు. ఏథర్ అప్‌కమింగ్ స్కూటర్ పేరు 'EL'.
Ather Energy, ఈ దీపావళి ఫెస్టివ్ సీజన్‌లో, సర్వీస్ కార్నివాల్ రూపంలో తన కస్టమర్లకు నిజమైన గిఫ్ట్ ఇచ్చింది. స్కూటర్‌లను క్రమం తప్పకుండా మెయింటైన్ చేయడం ఎంత ముఖ్యమో గుర్తు చేస్తూ, యువ రైడర్లకు ఈ ఆఫర్ మరింత ఉపయోగపడనుంది.



















