Discount On Toyota Car: టయోటా అమేజింగ్ ఆఫర్ - ఈ నెలలో మాత్రమే, మిస్ చేసుకుంటే ఫీల్ అవుతారు
Toyota Discount Offer: టయోటా కంపెనీ, చాలా పాపులర్ మోడళ్ల మీద భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ సిరీస్‌లో, తన స్మాల్ SUV కొనేవాళ్లకు వేల రూపాయల వరకు తగ్గింపును అందిస్తోంది.

Discount On Toyota Taisor SUV: టయోటా మోటార్స్, తన కస్టమర్ల కోసం భారీ డిస్కౌంట్ల నజరానా ప్రకటించింది. ఈ ఆఫర్స్‌లో, టయోటా టైజర్ మీద ప్రత్యేకమైన ఆఫర్ ప్రస్తుతం లైవ్‌లో ఉంది, ఈ నెలతో ముగుస్తుంది. ఈ స్మాల్ SUV కొన్నవాళ్లు గరిష్టంగా 87,000 రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చు. MY2024 వెర్షన్ మీద టయోటా ఈ డిస్కౌంట్ అందిస్తోంది.
ఫ్రెష్ లుక్స్‌తో అమేజింగ్ డిజైన్
టయోటా టైజర్ మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx) ప్లాట్‌ఫామ్ ఆధారంగా నిర్మించారు. అయితే, డిజైన్ పూర్తిగా టయోటా ఐడెండిటీతోనే ఉంటుంది. ఈ SUVకి కొత్త & బోల్డ్ హనీకూంబ్ మెష్ ఫ్రంట్ గ్రిల్ ఏర్పాటు చేశారు, దానిపై టయోటా లోగో ప్రకాశవంతంగా కనిపింస్తుంది. ఇంకా... కారుకు కొత్త ట్విన్ LED DRLs (Daytime Running Lights), అప్‌డేటెడ్ LED టెయిల్‌లైట్లు & స్టైలిష్ బంపర్‌తో స్పోర్టీ లుక్ ఇచ్చారు. నయా డిజైన్ వల్ల టయోటా టైజర్ యువతతో పాటు ఫ్యామిలీ కస్టమర్లను కూడా ఆకర్షిస్తోంది.
ఫెంటాస్టిక్ ఫీచర్లతో కార్ క్యాబిన్
టయోటా టైజర్ లోపలి భాగం ప్రీమియం లుక్స్‌తో కస్టమర్లకు కట్టిపడేస్తుంది. అంతేకాదు, డ్రైవర్ సపోర్ట్ & సీట్ ఆక్యుపెంట్స్ ఎంటర్‌టైన్‌మెంట్, కంఫర్ట్ కోసం ఫ్యాబ్యులస్ ఫీచర్లు ఉన్నాయి. ఈ SUVలో 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ట్విన్-పాడ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ & మధ్యలో MID యూనిట్ ఉన్నాయి. ఇది హెడ్-అప్ డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే & ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్లతో ఈ కార్ క్యాబిన్ కంప్లీట్ ప్యాకేజ్‌తో వస్తుంది. ఈ కారులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, DRLsతో ఆటోమేటిక్ LED హెడ్‌ల్యాంప్‌లు వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇన్ని ఆకట్టుకునే లక్షణాల కారణంగా టయోటా టైజర్ ఈ విభాగంలో ఒక పరిపూర్ణ ఫ్యామిలీ SUVగా పాపులర్ అయింది.
ఇంజిన్ & ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్
టయోటా టైజర్ రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్‌లో లభిస్తుంది, అవి - 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ & 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్. ఈ కార్‌లో మాన్యువల్ & ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ ఉన్నాయి, కస్టమర్ తన ఇష్టమైన మోడల్‌ను ఎంచుకోవచ్చు. కార్ డ్రైవింగ్‌లో కాసులు ఆదా చేయాలనుకునేవారి కోసం CNG వేరియంట్ కూడా అందుబాటులో ఉంది.
ధర
టయోటా టైజర్ SUV ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర (Toyota Taisor ex-showroom price) రూ. 7.74 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 13.04 లక్షల వరకు ఉంటుంది. దీనికి రిజిస్ట్రేషన్ ఛార్జీలు, వాహన బీమా, ఇతర ఛార్జీలు కలిపితే ఆన్-రోడ్ ధర వస్తుంది.
తగ్గింపు
టయోటా టైజర్‌పై లభించే గరిష్ట డిస్కౌంట్ రూ. 87,000. ఇది నగరం, వేరియంట్ & డీలర్‌షిప్‌పై ఆధారపడి ఉంటుంది. వాస్తవ తగ్గింపులు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి మారవచ్చు. అందువల్ల, టయోటా టైజర్ SUV కొనడానికి ముందు మీ సమీపంలోని టయోటా డీలర్‌షిప్‌ను సంప్రదించి, డిస్కౌంట్ పూర్తి వివరాల గురించి తెలుసుకోండి.





















