Allu Arjun Costly Car: కోట్ల విలువైన కార్ నడిపిన అల్లు అర్జున్ - కారులో ఫైవ్ స్టార్ హోటల్ లాంటి ఫీచర్లు
Allu Arjun Luxury Car: పుష్ప అంటే వైల్డ్ ఫైర్, అతని దగ్గర ఉంది లగ్జరీ కార్. ఆ SUV ధర, టెక్నాలజీ & ఆఫ్-రోడ్ ఫీచర్లు అదుర్స్.

Allu Arjun Drove A Range Rover Car: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇంటి గరాజ్‌లో లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా స్టార్, ఓ కార్ కారణంగా మరోసారి న్యూస్ హెడ్‌లైన్స్‌లోకి వచ్చాడు. ఒక అద్భుతమైన రేంజ్ రోవర్ SUVని నడుపుతూ, ఇటీవల తన ఇంటి సమీపంలో కెమెరాకు చిక్కాడు. రేంజ్ రోవర్ అనేది ల్యాండ్ రోవర్‌కు చెందిన మోస్ట్ ఐకానిక్ మోడల్. ప్రపంచ ప్రముఖులు & పవర్‌పుల్ పర్సన్స్ మాత్రమే దీనిని కొనగలరు. ఈ SUV అల్లు అర్జున్ లాంటి స్టార్ యాక్టర్ చేతుల్లో ఉండటంలో ఆశ్చర్యం లేదు.
.@Suriya_offl anna was spotted driving his own Range rover car 🔥 pic.twitter.com/b2csFwTMq8
— Suriya Fans Club (@SuriyaFansClub) May 18, 2025
ఫైవ్ స్టార్ హోటల్ లాంటి ఇంటీరియర్
ఈ రేంజ్ రోవర్ కారు లోపలి భాగం ఫైవ్ స్టార్ హోటల్ తరహాలో ప్రీమియంగా కనిపిస్తుంది. అత్యంత నాణ్యమైన లెదర్ ఫినిషింగ్, వెంటిలేటెడ్ & మసాజింగ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్ & మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి లగ్జరీ ఫీచర్లన్నీ ఈ కార్‌లో ఉన్నాయి.
రేంజ్ రోవర్ కార్లు 3.0 లీటర్ నుంచి 5.0 లీటర్ వరకు పెట్రోల్ & డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్‌తో అందుబాటులో ఉన్నాయి. ఈ కార్ ఇంజిన్లు స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ & ఫాస్ట్ ఎక్సలేషన్‌ను అందిస్తాయి. అధిక టార్క్ ఔట్‌పుట్ కారణంగా ఆఫ్-రోడింగ్‌కు కూడా సూటబుల్ SUVలు అవుతాయి.
ఫీచర్లు & టెక్నాలజీ
రేంజ్ రోవర్ SUV ఆఫ్-రోడ్ క్యాపబిలిటీస్ ఒక మాస్టర్ క్లాస్ కార్ కంటే తక్కువే కాదు. టెర్రైన్ రెస్పాన్స్ సిస్టమ్, ఆల్-వీల్ డ్రైవ్ టెక్నాలజీ & హిల్ డిసెంట్ కంట్రోల్ వంటి లక్షణాలతో కఠినమైన రోడ్లపై కూడా ఇది చాలా మృదువైన డ్రైవింగ్ అందిస్తుంది.
టెక్నాలజీ విషయానికి వస్తే... రేంజ్ రోవర్‌లో డ్యూయల్ టచ్‌స్క్రీన్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే & ఆండ్రాయిడ్ ఆటో, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS), డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే & 360 డిగ్రీ కెమెరా వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో కంప్లీట్ ప్యాకేజ్‌లా ఉంటుంది, అందువల్ల ఈ ఫోర్‌వీలర్ ఒక స్మార్ట్ SUV అవుతుంది.
అల్లు అర్జున్ దగ్గర ఉన్న రేంజ్ రోవర్ ధర ఎంత?
Range Rover Evoque ఎక్స్-షోరూమ్ ధర రూ. 69.50 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. Range Rover Sport ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ. 1.45 కోట్లు. బేస్ మోడల్ రూ. 2.40 కోట్ల వరకు & టాప్ మోడల్ రూ. 4.55 కోట్ల వరకు ఉంటుంది. అల్లు అర్జున్ దగ్గర దాదాపు రూ. 4.50 కోట్ల ఖరీదు చేసే టాప్-ఎండ్ రేంజ్ రోవర్ మోడల్ ఉందని అనుకుంటున్నారు.
అల్లు అర్జున్ కార్ కలెక్షన్
రేంజ్ రోవర్‌తో పాటు, అల్లు అర్జున్ కార్ కలెక్షన్‌లో Bentley Continental GT, పర్సనలైజ్డ్ వానిటీ వాన్ Falcon, Hummer H2 & Jaguar XJL వంటి లగ్జరియస్ & కాస్ట్‌లీ కార్లు కూడా ఉన్నాయి. ఈ స్టైలిష్ స్టార్ దగ్గర ఉన్న ప్రతి కారు అల్లు అర్జున్ బలమైన & స్టైలిష్ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది.





















