అన్వేషించండి

AGV కొత్త హెల్మెట్‌ గురూ, రోడ్డుపై మంటలే! - యూత్‌కి సరిపోయే స్పోర్టీ పార్ట్‌నర్‌

AGV K1 S హెల్మెట్‌ డిజైన్‌, సేఫ్టీ, కంఫర్ట్‌, ఫిట్‌, వెంటిలేషన్‌ ఎలా ఉన్నాయి? రూ.25 వేల బడ్జెట్‌లో ఈ ప్రీమియం హెల్మెట్‌ యూత్‌కు సరిపోతుందా లేదా పూర్తి రివ్యూ.

AGV K1 S Helmet Review: బైక్‌ రైడింగ్‌లో హెల్మెట్‌ అంటే కేవలం చట్టపరమైన అవసరం మాత్రమే కాదు - అది రైడర్‌ వ్యక్తిత్వాన్ని చూపించే భాగం కూడా. ముఖ్యంగా యూత్‌లో స్టైల్‌, సేఫ్టీ, బ్రాండ్‌ విలువ... ఈ మూడూ కలిసొస్తే ఆ హెల్మెట్‌కు డిమాండ్‌కు ఆకాశమే హద్దు. ఇప్పుడు మార్కెట్‌లోకి వచ్చిన AGV K1 S హెల్మెట్‌ చాలామంది దృష్టిని ఆకర్షిస్తోంది.

ఇది AGV లైనప్‌లో ఎంట్రీ లెవల్‌ మోడల్‌ అయినప్పటికీ, తయారీలో రాజీ పడ్డారేమో అన్న ఫీలింగ్‌ మాత్రం ఇవ్వదు. రూ.25,000 బడ్జెట్‌లో ప్రీమియం బ్రాండ్‌ హెల్మెట్‌ కొనాలనుకునే వారికి ఇది నిజంగా సరైన ఆప్షన్‌ కావచ్చు.

డిజైన్‌ - రేసింగ్‌ DNA స్పష్టంగా కనిపిస్తుంది

AGV K1 S డిజైన్‌ చూస్తే మొదటే రేసింగ్‌ హెల్మెట్‌ ఫీలింగ్‌ వస్తుంది. షార్ప్‌ లైన్స్‌తో ఉన్న చిన్‌ సెక్షన్‌, ఇంటిగ్రేటెడ్‌ రియర్‌ స్పాయిలర్‌ దీనికి స్పోర్టీ లుక్‌ ఇస్తాయి. ఈ షెల్‌ ఆకారాన్ని విండ్‌ టన్నెల్‌ టెస్టింగ్‌ ద్వారా డెవలప్‌ చేయడం గమనార్హం.

గ్లోస్‌ ఫినిష్‌లో ఈ హెల్మెట్‌ ఇంకా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. భారతీయ రోడ్లపై, నగర ట్రాఫిక్‌లో గ్లోస్‌ ఫినిష్‌ ఎక్కువ కాలం కొత్తదనాన్ని నిలుపుకుంటుంది.

సేఫ్టీ - ఇక్కడే అసలు బలం

AGV K1 Sలో థర్మోప్లాస్టిక్‌ షెల్‌ వాడారు. ఖర్చు తగ్గించేందుకు తీసుకున్న నిర్ణయమే అయినా, సేఫ్టీ విషయంలో ఎలాంటి రాజీ లేదు. ఇది ECE 22.06 తాజా భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. అదనంగా 5 స్టార్‌ SHARP రేటింగ్‌ కూడా పొందింది.

భారత BIS సర్టిఫికేషన్‌ లేకపోవడం కొంతమందికి మైనస్‌గా అనిపించవచ్చు. అయితే అంతర్జాతీయ ప్రమాణాలు చూసేవాళ్లకు ఇది పెద్ద సమస్య కాదు.

ఫిట్‌, కంఫర్ట్‌ - స్పోర్టీ రైడర్లకు పర్‌ఫెక్ట్‌

ఈ హెల్మెట్‌ ఫిట్‌ చాలా స్నగ్‌గా ఉంటుంది. ముఖ్యంగా, చీక్‌ ఏరియాలో గట్టిగా ఫిట్‌ అవుతుంది. మధ్యస్థ నుంచి కొంచెం ఓవల్‌ షేప్‌ హెడ్‌ ఉన్నవాళ్లకు ఇది బాగా సెట్‌ అవుతుంది. మొదట్లో ప్యాడింగ్‌ గట్టిగా అనిపించినా, వాడకం పెరిగే కొద్దీ సహజంగా సెట్‌ అవుతుంది.

బరువు సుమారు 1.6 కిలోలు. ఇదేమీ తక్కువ బరువు కాదు కానీ బరువు పంపిణీ బాగా ఉంటుంది. స్పోర్టీ బైక్స్‌పై ముందుకు వంగి కూర్చునే పొజిషన్‌లో ఈ హెల్మెట్‌ మెడపై ఎక్కువ ఒత్తిడి పెట్టదు. అయితే నిటారుగా కూర్చునే బైక్స్‌పై ఎక్కువసేపు రైడ్‌ చేస్తే స్వల్పంగా మెడ అలసట అనిపించవచ్చు.

వెంటిలేషన్‌, నాయిస్‌

బ్రౌ, చిన్‌ వెంట్స్‌ ఓపెన్‌ రోడ్లపై బాగా పనిచేస్తాయి. హైవే స్పీడ్స్‌లో ఎయిర్‌ ఫ్లో స్పష్టంగా అనిపిస్తుంది. నగరంలో మాత్రం వెంటిలేషన్‌ సరిపడా స్థాయిలోనే ఉంటుంది.

నాయిస్‌ విషయానికి వస్తే, ఈ ధరలో స్పోర్టీ హెల్మెట్‌ నుంచి ఆశించే స్థాయిలోనే ఉంది. సిటీలో నాయిస్‌ తక్కువగా ఉంటుంది. హైవేపై విండ్‌ నాయిస్‌ వినిపించినా, అసౌకర్యంగా అనిపించదు.

ఫీచర్లు - అవసరమైనవి తప్ప అనవసరపు ఆర్భాటాలు లేవు

AGV K1 Sలో డబుల్‌-D రింగ్‌ స్ట్రాప్‌ ఉంది. ఇది రేసింగ్‌, సేఫ్టీ పరంగా పెద్ద ప్లస్‌. ఇంటర్నల్‌ సన్‌వైజర్‌ లేదు, కానీ చాలామందికి అది డీల్‌ బ్రేకర్‌ కాదు. లైనర్‌ పూర్తిగా తీసేయవచ్చు, అయితే లాక్‌ మెకానిజం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది.

వైజర్‌ పిన్‌లాక్‌ రెడీ అయినప్పటికీ, AGV స్పేర్‌ పార్ట్స్‌ ధరలు కొంచెం ఎక్కువగానే ఉంటాయి.

చిన్న మైనస్‌లు కూడా ఉన్నాయి

ఈ హెల్మెట్‌ టేబుల్‌పై స్థిరంగా నిలవదు. పక్కకు ఊగుతుంది. అయితే, కాలర్‌బోన్‌ రక్షణ కోసం ఇలా డిజైన్‌ చేసినట్లు AGV చెబుతోంది.

AGV K1 S ఎంట్రీ లెవల్‌ మోడల్‌ అయినా, సేఫ్టీ, డిజైన్‌, బ్రాండ్‌ విలువ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. ఫీచర్ల కంటే రక్షణ, నమ్మకం ముఖ్యమని భావించే రైడర్లకు ఇది చాలా సరైన ఎంపిక. రూ.25,000 బడ్జెట్‌లో ప్రీమియం స్పోర్టీ హెల్మెట్‌ కావాలంటే, AGV K1 S యూత్‌కు నిజంగా పర్‌ఫెక్ట్‌ పార్ట్‌నర్‌ అని చెప్పొచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Driving Licence Renewal: RTO ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు! డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్‌ను ఇంట్లోనే కూర్చుని ఆన్‌లైన్‌లో ఇలా చేయండి!
డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగుస్తోందా? ఇంట్లోనే ఆన్‌లైన్‌లో రెన్యూవల్ చేసుకోండి.. కేవలం 12 స్టెప్స్‌లో!
Kia Carens Clavisలో ఏ వేరియంట్‌ ధర ఎంత? మిడ్‌ వేరియంట్‌లో ఏ ఫీచర్లున్నాయి? పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో పూర్తి వివరాలు
Kia Carens Clavis లో 11 వేరియంట్లు.. ధర, ఫీచర్ల పరంగా మీకు ఏది బెస్ట్?
Tata Cars Price Hike: టాటా కారు కొనేవాళ్లకు భారీ షాక్‌.. డిసెంబర్ నుంచి పెరగనున్న ICE, EV మోడళ్ల ధరలు
కొత్త కారు కొనేవాళ్లకు అలెర్ట్‌.. దాదాపు రూ.15,000 అదనపు భారం వేస్తున్న టాటా
AdBlue In Cars: డీజిల్ కారు ఓనర్లు, డ్రైవర్లు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం.. AdBlue ఎప్పుడు నింపాలి? ధర ఎంత?
డీజిల్ కారులో AdBlue అంటే ఏమిటి? ఇది అయిపోతే ఇంజిన్ మళ్లీ స్టార్ట్ కాదా?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court: కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం నిలిపివేయాలి.. హైకోర్టులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిల్
కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం నిలిపివేయాలి.. హైకోర్టులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిల్
Union Cabinet Decisions: ఎయిర్‌పోర్ట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 19000 కోట్లు కేటాయింపు
ఎయిర్‌పోర్ట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 19000 కోట్లు కేటాయింపు
Telangana Congress Politics: తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
Dog Kills Leopard Cub: కుక్క పిల్లను చంపిన చిరుత.. గంటల వ్యవధిలోనే తల్లి కుక్క ప్రతీకారం!
కుక్క పిల్లను చంపిన చిరుత.. గంటల వ్యవధిలోనే తల్లి కుక్క ప్రతీకారం!
Ekalavya Series OTT : AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
MyTDP App: 10 లక్షల నమోదుతో మై టీడీపీ యాప్‌ రికార్డ్.. మై ఫ్యామిలీ అంటూ నారా లోకేష్ హర్షం
10 లక్షల నమోదుతో మై టీడీపీ యాప్‌ రికార్డ్.. మై ఫ్యామిలీ అంటూ నారా లోకేష్ హర్షం
Munagaku Pakodi : మునగాకుతో క్రిస్పీ పకోడీలు.. సాయంత్రం స్నాక్స్‌గా ఇలా చేసుకుని లాగించేయండి
మునగాకుతో క్రిస్పీ పకోడీలు.. సాయంత్రం స్నాక్స్‌గా ఇలా చేసుకుని లాగించేయండి
Actor Venkatesh: డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
Embed widget