అన్వేషించండి

హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్‌కు బిగ్ అప్‌డేట్‌.. సిటీలోని ప్రీమియం ఫీచర్లు ఎలివేట్‌లోకి!

హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ ఈ ఏడాది రెండో అర్ధభాగంలో లాంచ్ కానుంది. 360 డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు, కొత్త టచ్‌స్క్రీన్, అదనపు ADAS ఫీచర్లతో మరింత ప్రీమియంగా రానుంది.

Honda Elevate facelift features: భారత మార్కెట్లో హోండా ఎలివేట్ ఎస్‌యూవీకి మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో, కంపెనీ ఇప్పుడు ఈ మిడ్‌సైజ్ SUVకి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్‌లో పరిచయం చేసిన కొన్ని ఆధునిక ఫీచర్లను ఎలివేట్‌లో కూడా అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అప్‌డేటెడ్ మోడల్ 2026 రెండోార్థంలో భారత మార్కెట్లోకి రానుందని సమాచారం.

ఇటీవల హోండా కార్స్ ఇండియా మార్కెటింగ్ అండ్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ కునాల్ బెహల్ చేసిన వ్యాఖ్యలు ఈ అంచనాలకు మరింత బలం చేకూర్చాయి. ప్రస్తుతం ఎలివేట్‌లో 360 డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్ల కవర్లు వంటి ఫీచర్లను యాక్సెసరీల రూపంలో అందిస్తున్నామని, భవిష్యత్తులో వీటిని ప్రధాన ఫీచర్ల జాబితాలో చేర్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు.

కొత్త ఫీచర్లతో మరింత ప్రీమియం ఎలివేట్

హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్‌లో వచ్చిన 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్‌లో కూడా అందించే అవకాశం ఉంది. అలాగే ప్రస్తుతం టాప్ వేరియంట్‌కు మాత్రమే పరిమితమైన ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) ఫీచర్లను మిడ్‌ రేంజ్‌ వేరియంట్లకు కూడా విస్తరించే అవకాశముంది.

ఇవి మాత్రమే కాకుండా... కొత్త అంబియెంట్ లైటింగ్, మెరుగైన సీటు అప్హోల్స్టరీ, తాజా ఇంటీరియర్ ట్రిమ్ మెటీరియల్స్‌తో క్యాబిన్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చే అవకాశముంది. దీంతో ప్రీమియం SUV సెగ్మెంట్‌లో ఈ కారు ఇంకా బలమైన పోటీదారుగా నిలవనుంది.

ఎక్స్‌టీరియర్‌లోనూ మార్పులు

ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్‌లో కొత్త ఫ్రంట్ బంపర్, రీడిజైన్ చేసిన రియర్ బంపర్, కొత్త హెడ్‌ల్యాంప్స్, టెయిల్‌ల్యాంప్స్‌తో పాటు తాజా లైటింగ్ సిగ్నేచర్లు ఉండే అవకాశం ఉంది. అదనంగా కొత్త డిజైన్ అలాయ్ వీల్స్‌ను కూడా అందించే అవకాశాలు ఉన్నాయి.

ఇటీవల పరీక్షల సమయంలో కనిపించిన క్యామోఫ్లాజ్ మోడల్‌లో పూర్తి వివరాలు బయటకు రాకపోయినా, డిజైన్ పరంగా గణనీయమైన మార్పులు ఉండబోతున్నాయని ఆటోమొబైల్ వర్గాలు భావిస్తున్నాయి.

ఇంజిన్‌లో మార్పులు ఉండవు

మెకానికల్ పరంగా పెద్దగా మార్పులు ఉండే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతం ఉన్న 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌నే కొనసాగించే అవకాశముంది. ఈ ఇంజిన్ 121 హెచ్‌పీ పవర్, 145 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ట్రాన్స్‌మిషన్ ఎంపికలుగా 6-స్పీడ్ మాన్యువల్, CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లు అందుబాటులో ఉండే అవకాశముంది. అయితే కొత్త టర్బో లేదా హైబ్రిడ్ ఇంజిన్ ఎంపికపై ఇప్పటివరకు ఎలాంటి సంకేతాలు లేవు.

హోండా భవిష్యత్ ప్రణాళికలు

ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్‌తో పాటు హోండా భారత మార్కెట్ కోసం కొత్త సబ్-4 మీటర్ కాంపాక్ట్ SUV, మరో మిడ్‌సైజ్ SUVను కూడా అభివృద్ధి చేస్తోంది. ఈ మోడళ్లు 2028 నుంచి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా, హోండా బైక్‌ కస్టమర్లను తమ తొలి కారుగా హోండా SUV వైపు ఆకర్షించడమే కంపెనీ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

New Driving Licence Rules: స్పీడ్‌గా డ్రైవింగ్ చేస్తున్నారా? రెడ్ సిగ్నల్ దాటుతున్నారా? 5-స్ట్రైక్‌ రూల్‌తో మీ డ్రైవింగ్‌ లెసెన్స్‌ రద్దు!
ట్రాఫిక్‌ నిబంధనలు పాటించడం లేదా? '5-స్ట్రైక్‌' రూల్‌ గురించి తెలీకే మీరా పని చేస్తున్నారు!
Diwali Car Offers 2026: రూ.90,000 వరకు డిస్కౌంట్లు.. Tata Nexon, Nissan Magnite సహా 10 SUVలపై అదిరిపోయే ఆఫర్లు
బడ్జెట్‌ కార్లపై దీపావళి ధమాకా ఆఫర్లు.. Skoda Kylaq నుంచి Maruti Fronx వరకు భారీ డిస్కౌంట్లు!
రూ.16.99 లక్షలు పెట్టి Renault Duster Hybrid కొనడం మంచిదేనా? మైలేజీ, ఫీచర్లు, బూట్ స్పేస్‌పై పూర్తి విశ్లేషణ
రెనాల్ట్‌ డస్టర్‌ హైబ్రిడ్‌ కొనాలా, వద్దా? - 3 ప్లస్‌లు, 2 మైనస్‌లు తెలుసుకోండి!
E20, E100, B100 ఇంధనాలపై కేంద్రం కొత్త నిబంధనలు.. మారుతి WagonR Flex Fuel ప్రత్యేకతలివే!
E100 ఫ్యూయల్ వాహనాలకు లైన్‌ క్లియర్‌.. ఇక పూర్తిగా ఇథనాల్‌తోనే నడిచే కార్లను కూడా చూస్తాం!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR : ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు.. సాగునీటి నిర్వహణలో చంద్రబాబు భేష్ - కేటీఆర్
ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు.. సాగునీటి నిర్వహణలో చంద్రబాబు భేష్ - కేటీఆర్
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
Hyderabad Ration Rice Scam: హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
Andaman Sea Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
AP Cyclone Arnab Relief: తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
Balmoor Induja Complaint On KTR: కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
Karnataka MLC Election Results 2026: కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Embed widget