అన్వేషించండి

పాత పెట్రోల్‌ కార్లను E100 వెహికల్స్‌గా మార్చేద్దాం - రూ.15 వేలకే ఇథనాల్‌ కన్వర్షన్‌ కిట్‌!

భారత్‌లో ఇథనాల్‌ కన్వర్షన్‌ కిట్లు రూ.15 వేలకే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. BS4, BS6 కార్లపై E100 ఇంధనంతో విజయవంతమైన పరీక్షలు నిర్వహించినట్లు ISMA వెల్లడించింది.

Ethanol conversion kits: దేశంలో ఇథనాల్‌ ఆధారిత ఇంధన వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం వరుస చర్యలు చేపడుతున్న వేళ, వాహనదారులను సంతోషపరిచేలా మరో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం రోడ్లపై నడుస్తున్న BS4, BS6 పెట్రోల్‌ కార్లను ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ వాహనాలుగా మార్చేందుకు ఉపయోగించే "ఇథనాల్‌ కన్వర్షన్‌ కిట్లు" భవిష్యత్తులో కేవలం "రూ.15,000 పరిధిలోనే" అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఇండియన్‌ షుగర్‌ అండ్‌ బయో ఎనర్జీ మాన్యుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ (ISMA) వెల్లడించింది.

ప్రస్తుతం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఇలాంటి కిట్ల ధర రూ.40,000 నుంచి రూ.60,000 వరకు ఉండగా, భారత్‌లో స్థానికంగా తయారీ ప్రారంభమైతే ధర భారీగా తగ్గే అవకాశముందని ISMA డైరెక్టర్‌ జనరల్‌ దీపక్‌ బల్లాని తెలిపారు.

BS4, BS6 కార్లపై పరీక్షలు సక్సెస్‌

ఇథనాల్‌ కన్వర్షన్‌ కిట్ల సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ISMA, IIT ఢిల్లీతో కలిసి ప్రత్యేక పరీక్షలు నిర్వహించింది. ఇందులో, ఫిన్లాండ్‌కు చెందిన eFlexFuel సంస్థ తయారు చేసిన కన్వర్షన్‌ కిట్లను రెండు వాహనాల్లో అమర్చారు, అవి:

* BS4 Maruti Swift (E10 అనుకూల మోడల్‌)

* BS6 Maruti Dzire (E20 అనుకూల మోడల్‌)

ఈ రెండు కార్లను E15 నుంచి E100 వరకు వివిధ ఇథనాల్‌ మిశ్రమాలతో 10,000 కిలోమీటర్లకు పైగా నడిపి పరీక్షించారు.

ఎంత దూరం నడిపారు?

పరీక్షల్లో భాగంగా BS4 స్విఫ్ట్‌ మొత్తం 10,500 కిలోమీటర్లు ప్రయాణించగా, అందులో 1,000 కిలోమీటర్లు E100 ఇంధనంతో నడిచింది.

BS6 డిజైర్‌ కారు 14,250 కిలోమీటర్లు నడిచింది. ఇందులో 5,000 కిలోమీటర్లు E100 ఇంధనంతో ప్రయోగాలు నిర్వహించారు.

ఫలితాలు ఏమంటున్నాయి?

పరిశోధకులు వాహనాలపై పలు అంశాలను పరిశీలించారు.

* యాక్సిలరేషన్‌
* డీసిలరేషన్‌
* కోల్డ్ స్టార్ట్‌ పనితీరు
* ఇంజిన్‌ స్పందన
* ఉద్గారాలు
* ఇంధన వినియోగం
* ఇంజిన్‌ ఆరోగ్యం

పరీక్షల మొత్తం వ్యవధిలో వాహనాల్లో ఎలాంటి అసాధారణ సమస్యలు కనిపించలేదని నివేదిక వెల్లడించింది.

ఈ కన్వర్షన్‌ కిట్‌లో ప్రత్యేక ఇథనాల్‌ సెన్సార్‌ ఉంటుంది. ఇది ఇంధనంలో ఉన్న ఇథనాల్‌ శాతాన్ని గుర్తించి, దానికి అనుగుణంగా ఫ్యూయల్‌ ఇంజెక్షన్‌ను ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేస్తుంది. దీంతో, కారు ఇంజిన్‌ E15, E20, E85 లేదా E100 వంటి వివిధ ఇంధన మిశ్రమాలను వాహనం సులభంగా వినియోగించగలదు.

లక్షలాది వాహనదారులకు ప్రయోజనం

ప్రస్తుతం భారత్‌లో E20 పెట్రోల్‌ వినియోగం విస్తరిస్తుండగా, ఇటీవలే E85 ఇంధనాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఇక కేంద్ర ప్రభుత్వం E100 ఇంధనానికి కూడా నిబంధనలకు ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో, కన్వర్షన్‌ కిట్లు అందుబాటులోకి వస్తే కొత్త ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ వాహనం కొనాల్సిన అవసరం లేకుండా ఇప్పటికే ఉన్న పెట్రోల్‌ కార్లనే అధిక ఇథనాల్‌ ఇంధనాలకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంటుంది.

ఇంకా అనుమతులు రావాల్సి ఉంది

అయితే ప్రస్తుతం ఈ సాంకేతికత వాణిజ్యపరంగా అందుబాటులో లేదు. స్థానికంగా తయారయ్యే కన్వర్షన్‌ కిట్లు మార్కెట్లోకి రావాలంటే కేంద్ర ప్రభుత్వం, ఆటోమోటివ్‌ టెస్టింగ్‌ ఏజెన్సీలు, వాహన తయారీ సంస్థల నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఈ దిశగా నియంత్రణ వ్యవస్థను రూపొందించాలని ISMA ఇప్పటికే సంబంధిత అధికారులకు ప్రతిపాదనలు పంపింది.

భవిష్యత్తులో పెద్ద మార్పే!

భారత్‌లో E85, E100 ఇంధనాల వినియోగం పెరిగే కొద్దీ ఇలాంటి కన్వర్షన్‌ కిట్లకు డిమాండ్‌ పెరిగే అవకాశముంది. ముఖ్యంగా ఇంధన దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం, రైతులకు అదనపు ఆదాయం కల్పించడం, పర్యావరణ హిత ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించడం వంటి లక్ష్యాలకు ఇవి కీలకంగా మారనున్నాయి. రూ.15 వేల పరిధిలో ఇలాంటి కిట్లు అందుబాటులోకి వస్తే, లక్షలాది పెట్రోల్‌ వాహనాలు ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ యుగంలోకి అడుగుపెట్టే అవకాశం కనిపిస్తోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

BS6 కార్ల యజమానులకు భారీ ఊరట.. కాలుష్య ధ్రువీకరణ గడువు మూడేళ్లకు పెంచనున్న కేంద్రం!
కార్ ఓనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఇక మూడేళ్లకు ఒకసారి 'పొల్యూషన్‌ సర్టిఫికెట్‌!'
E20 పెట్రోల్‌ను దేశమంతా అందుబాటులోకి తెచ్చినా.. అనుకూల వాహనాలపై కేంద్రం వద్దే డేటానే లేదట!
హవ్వ.. దేశంలో ఎన్ని E20 వాహనాలున్నాయో సర్కారుకే తెలియదట - షాకింగ్ న్యూస్‌
EVలకు తగ్గని డిమాండ్ - జులైలో 32 వేలకుపైగా అమ్మకాలు, ఏ కంపెనీ ఎన్ని కార్లను విక్రయించిందంటే..?
జులైలోనూ జోరు తగ్గని ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు.. జనం ఏ కంపెనీ కార్లను ఎక్కువగా కొన్నారంటే..?
వర్షంలోనే టూవీలర్‌ నడుపుతున్నారా..? ఈ తప్పులు చేస్తే మీ బండి మధ్య రోడ్డులోనే ఆగిపోవచ్చు!
వర్షంలో తడిచిన టూవీలర్‌ స్టార్ట్ కావట్లేదా? వీటిని ఒకసారి చెక్‌ చేయండి, ప్రోబ్లెం సాల్వ్‌!
Advertisement

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Uravakonda latest News: ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
Auqib Nabi Selection: జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
Eesha Rebba : గోల్డ్ కలర్ డ్రెస్‌లో అందాల ఈషా - సరస్సు ఒడ్డున దేవకన్యలా...
గోల్డ్ కలర్ డ్రెస్‌లో అందాల ఈషా - సరస్సు ఒడ్డున దేవకన్యలా...
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
CWG India Analysis: గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
Embed widget