Best Selling Bike: రోజుకు 3400 మంది కొంటున్న స్కూటర్ ఇది, ఫీచర్లకు ప్రతి ఒక్కరూ ఫిదా
TVS Jupiter Sales Report: గత నెలలో TVS జూపిటర్ 1,02,588 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది ఏకంగా 33 శాతం పెరుగుదల.

TVS Jupiter Price, Mileage And Features In Telugu: టీవీఎస్ జూపిటర్ స్కూటర్‌ను కొనడానికి షూరూమ్‌కు వెళుతున్న వ్యక్తుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతోంది. తింటే గారెలు తినాలి, కొంటే జూపిటర్ కొనాలి అన్నట్లుగా ఈ స్కూటర్ డిమాండ్ విపరీతంగా పెరిగింది. నిజానికి, ఈ బండి అమ్మకాలు టీవీఎస్ కంపెనీని కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి. సామాన్య ప్రజలకు కూడా అందుబాటు ధరలో ఉండడం దీని మొట్టమొదటి ప్లస్ పాయింట్ అయితే, టీవీఎస్ జూపిటర్ మైలేజ్ రెండో సానుకూలాంశం. ఈ స్కూటర్‌లోని స్మార్ట్ ఫీచర్లు మూడో ప్లస్ పాయింట్. ఇంకా... బలమైన డిజైన్, భద్రత & అద్భుతమైన పనితీరుతో ఈ బండి ప్రజల హృదయాలను గెలుచుకోవడంలో విజయవంతమైంది. ఆశ్చర్యకరమైన ఏమిటంటే, ఈ స్కూటర్‌ను గత నెలలో ప్రతిరోజూ 3,400 మందికి పైగా ప్రజలు కొనుగోలు చేశారు.
గత నెలలో (ఏప్రిల్ 2025), అమ్మకాల పరంగా, TVS జూపిటర్ అద్భుతం చేసింది. ఆ నెలలో ఏకంగా 1,02,588 యూనిట్ల జూపిటర్‌లు అమ్ముడుపోయాయి. అంటే, సగటున రోజుకు 3,419 మంది ఈ బండిని కొన్నారు. గత ఏడాది అదే నెలతో (ఏప్రిల్ 2024) పోలిస్తే జూపిటర్ సేల్స్ ఈసారి 33 శాతం పెరిగాయి, ఈ స్కూటర్‌కు పెరుగుతున్న ఆదరణను ఇది సూచిస్తుంది.
ఎక్స్-షోరూమ్ ధర
టీవీఎస్ కంపెనీ, జూపిటర్‌ను 110cc & 125cc మోడళ్లలో విక్రయిస్తుంది. TVS Jupiter 110 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర (TVS Jupiter ex-showroom price) రూ. 76,691 కాగా, TVS Jupiter 125 మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 80,640 నుంచి స్టార్ట్ అవుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఆన్-రోడ్ ధర
అన్ని ఖర్చులు + పన్నులు కలుపుకుని, తెలుగు రాష్ట్రాల్లో, టీవీఎస్ జూపిటర్ ఆన్-రోడ్ ధర (TVS Jupiter on-road price) రూ. 98,750 నుంచి ప్రారంభం అవుతుంది. వేరియంట్, నగరాన్ని బట్టి ఈ ధరలో కొద్దిపాటి మార్పులు ఉంటాయి. మన మార్కెట్‌లో, హోండా యాక్టివా & సుజుకీ యాక్సెస్‌కు టీవీఎస్ జూపిటర్ పోటీ ఇస్తుంది.
TVS జూపిటర్ 110 పవర్
TVS జూపిటర్ 110 ఇంజిన్‌ను గత సంవత్సరంలోనే అప్‌డేట్ చేశారు. ఈ ద్విచక్ర వాహనం 113.3cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో పవర్ పొందుతుంది & ఇది ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీతో పని చేస్తుంది. ఈ ఇంజిన్ 5,000 rpm వద్ద 7.91 bhp పవర్‌ను & 5,000 rpm వద్ద 9.2 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను ఉపయోగించినప్పుడు ఇది ఎలక్ట్రిక్ అసిస్ట్‌తో టార్క్‌ను 9.8 Nmకి పెంచుతుంది.
టీవీఎస్ జూపిటర్ స్కూటర్ గరిష్టంగా గంటకు 82 కి.మీ. వేగాన్ని అందుకోగలదు. ఈ స్కూటర్ డాన్ మ్యాట్ బ్లూ, గెలాక్టిక్ కాపర్ మ్యాట్, టైటానియం గ్రే మ్యాట్, స్టార్‌లైట్ బ్లూ గ్లోస్, లూనార్ వైట్ గ్లోస్ & మీటియోర్ రెడ్ గ్లోస్ కలర్స్‌లో అందుబాటులో ఉంది. టీవీఎస్ జూపిటర్ హై-ఎండ్ మోడల్‌లో (TVS Jupiter SmartXonnect Disc) డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అమర్చారు. దీనికి బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది.





















