కొత్త హైబ్రిడ్ ఇంజిన్‌తో వస్తోన్న New Renault Duster 2026: డిజైన్, ఫీచర్లు, లాంచ్ డీటెయిల్స్
2026 జనవరి 26న ఆవిష్కరణకు సిద్ధమైన న్యూ రెనాల్ట్ డస్టర్ కొత్త హైబ్రిడ్ ఇంజిన్, అప్‌డేట్ చేసిన డిజైన్, ఆధునిక ఫీచర్లతో మళ్లీ SUV మార్కెట్‌లో గట్టి పోటీ ఇస్తుందని చెబుతున్నారు.

New Renault Duster Launch Date Specs Update: భారత మార్కెట్‌లో ఒకప్పుడు అత్యంత పాపులర్ SUVగా నిలిచిన రెనాల్ట్ డస్టర్ మళ్లీ రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. 2026 జనవరి 26న అధికారికంగా లాంచ్ కాబోతోంది. పూర్తిగా కవర్ చేసిన టెస్ట్‌మ్యూల్ ఇప్పటికే రోడ్డు మీద కనిపించడంతో రాబోయే మోడల్‌లో ఉండే డిజైన్, ఫీచర్లపై మరింత క్లారిటీ వచ్చింది.
ఎక్స్‌టీరియర్ డిజైన్
యూరో-స్పెక్ డాకియా డస్టర్‌ను, భారత మార్కెట్ కోసం ట్యూన్ చేసిన నిస్సాన్ టెక్‌టాన్ మోడళ్లను చూసిన తర్వాత, కొత్త డస్టర్ లుక్ గురించి మంచి ఐడియా వచ్చింది. ముందు భాగంలో Y-షేప్ DRLs, షార్ప్ హెడ్‌ల్యాంప్స్, బ్లాక్ వీల్ ఆర్చ్ క్లాడింగ్స్, బూమరాంగ్ టెయిల్ ల్యాంప్స్, బలమైన సైడ్ క్లాడింగ్స్ - ఇవన్నీ SUV స్పూర్తితో రూపొందించిన ఔట్‌లుక్ ఇస్తాయి.
తాజా సమాచారం ప్రకారం, కొత్త డస్టర్ CMF-B ప్లాట్‌ఫామ్‌పై తయారవుతుంది. పాత మోడల్‌తో పోలిస్తే ఇది 9mm వెడల్పుగా, 2mm పొడవుగా ఉంటుంది.
ఇంటీరియర్ డిటైల్స్
ఇంటీరియర్ పార్ట్‌లో రెండు స్క్రీన్‌లు, త్రీ-స్పోక్ స్టీరింగ్, డ్రైవ్ సెలెక్టర్, AC వెంట్స్‌కు Y-షేప్ యాక్సెంట్స్ ఇచ్చారు. బయటకు కనిపించే స్టైల్ పరంగా ఇది కొంత సింపుల్‌గా అనిపించినా, అందులోనే డస్టర్‌కు ఉన్న నో-నాన్సెన్స్ SUV ఇమేజ్ కొనసాగుతుంది. ముఖ్యంగా, సన్‌రూఫ్ లేకపోవడం కొంత మంది ఫ్రాక్టికల్ యూజర్లకు పాజిటివ్ సైడ్. దీర్ఘకాలిక దృఢత్వం, మెయింటెనెన్స్ పరంగా ఇది బెస్ట్ ఆప్షన్ అన్న అభిప్రాయం బలపడుతోంది.
కంఫర్ట్ & టెక్నాలజీ వైపు, 7-అంగుళాల కస్టమైజ్ చేయగల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్లెస్ మొబైల్ చార్జర్, స్మార్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ సెటప్ లభించే అవకాశం ఉంది. సేఫ్టీ ఫీచర్లలో ADAS ఉండడం కూడా ఒక హైలైట్. ఆటోమేటిక్ బ్రేకింగ్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, రియర్ పార్కింగ్ అసిస్ట్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ వంటి కీలక ఫీచర్లు అందుబాటులో ఉండొచ్చు.
ఇంజిన్ వివరాలు
ఇంజిన్ పరంగా యూరో మోడల్‌లో మూడు ఆప్షన్‌లు ఉన్నాయి, అవి - Hybrid 140, Mild-Hybrid 130 & Mild-Hybrid 130 4x4. భారత మార్కెట్‌కు మాత్రం Mild-Hybrid 130నే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఇంజిన్ పవర్‌ఫుల్ పనితీరు, మంచి ఇంధన సామర్థ్యం, స్మూత్ డ్రైవింగ్ అనుభవం ఇవ్వగలదని అంచనా.
రెనాల్ట్ డస్టర్ మొదటి జనరేషన్ ఎందుకు హిట్ అయింది అంటే.. అది బాడ్‌లుక్స్ కంటే ఫంక్షనల్ డిజైన్, రగ్గ్‌డ్ డ్రైవింగ్ డైనమిక్స్, మన్నికైన బిల్డ్ క్వాలిటీ & ఆఫ్‌రోడ్ ఫ్రెండ్లీ స్వభావం దాని స్ట్రాంగ్ ప్లస్‌లు. ఇప్పుడు వచ్చే కొత్త జనరేషన్ కూడా అదే DNAను కొనసాగిస్తుందనే నమ్మకం ఉంది. ధరల పరంగా ₹10 లక్షల నుంచి ₹16 లక్షల ఎక్స్-షోరూమ్ రేంజ్‌లో ఉండే అవకాశం ఉంది. మన దేశంలో క్రెటా, సెల్టోస్, కర్వ్, గ్రాండ్ విటారా వంటి మోడళ్లతో గట్టి పోటీ చూసే సెగ్మెంట్ ఇదే.
మొత్తం మీద చూస్తే, రెనాల్ట్ న్యూ డస్టర్ మళ్లీ SUV మార్కెట్‌లో బజ్ సృష్టించే అవకాశం బలంగా కనిపిస్తోంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















