అన్వేషించండి

2025 టాటా పంచ్ లాంగ్‌ టర్మ్ రివ్యూ: నగర ప్రయాణాల్లో నమ్మకంగా పని చేస్తుందా, ఎంత మైలేజ్‌ ఇస్తుంది?

2025 టాటా పంచ్ లాంగ్‌ టర్మ్ రివ్యూ. 2,000 కిలోమీటర్ల సిటీ డ్రైవింగ్ అనుభవంతో రైడ్ క్వాలిటీ, ఇంజిన్ పనితీరు, ఫీచర్లు, మైలేజ్ వివరాలు తెలుసుకోండి.

2025 Tata Punch Long Term Review: తెలుగు రాష్ట్రాల్లో నగరాల పరిస్థితులు రోజురోజుకు మారుతున్నాయి. రోడ్లపై ట్రాఫిక్‌, మెట్రో నిర్మాణాలు, రోడ్లపై గుంతలు - ఇవన్నీ సిటీ డ్రైవింగ్‌ను ఓ పరీక్షగా మారుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 2025 టాటా పంచ్ ఎంతవరకు పనికొస్తుంది అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి, ఈ మైక్రో SUVని ఎక్స్‌పర్ట్‌లు సిటీ డ్రైవింగ్‌లో 2,000 కిలోమీటర్లు పాటు డైలీ పరీక్షించారు.

టాటా పంచ్ కామో ఎడిషన్‌ (Tata Punch Camo edition)ను, విపరీతమైన రద్దీ ఉన్న ముంబైలో ఎక్స్‌పర్ట్‌లు పరీక్షించారు. మొదట గమనించాల్సినది ఈ కారు కాంపాక్ట్ సైజ్‌. ఇరుకైన రోడ్లలో, బిజీ ట్రాఫిక్‌లో డ్రైవ్‌ చేయడం, వాహనాల మధ్యలోంచి దూరడం చాలా ఈజీగా అనిపించింది. ముంబై లాంటి నగరంలో ఇది పెద్ద ప్లస్‌. డార్క్ గ్రీన్ షేడ్‌లో ఉన్న కామో ఎడిషన్ బయట నుంచి చూసినా ప్రత్యేకంగా కనిపిస్తుంది.

డ్రైవింగ్ పొజిషన్‌, కంఫర్ట్‌

పంచ్‌లో కూర్చోగానే నిటారుగా కూర్చున్న భావన వస్తుంది. రోడ్డు ముందే క్లియర్‌గా కనిపిస్తుంది. స్టీరింగ్‌, గేర్‌, పెడల్స్‌ అన్నీ చేతులకు, కాళ్లకు అందుబాటులో ఉంటాయి. రోజంతా ట్రాఫిక్‌లో గడిపినా అలసట తక్కువగా అనిపించింది. ఫుట్‌వెల్‌లో సరైన స్థలం ఉండటం, డెడ్ పెడల్ ఉండటం కూడా కంఫర్ట్‌కు తోడయ్యాయి.

ఇంజిన్‌, గేర్‌బాక్స్‌ అనుభవం

ఇందులో 1.2 లీటర్ల త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది హైవే రేసింగ్ కోసం కాదు, కానీ సిటీ డ్రైవింగ్‌కు ఇది చాలా బాగా సరిపోతుంది. పవర్ డెలివరీ స్మూత్‌గా ఉంటుంది. తక్కువ స్పీడ్‌లో కూడా ఇంజిన్ ఇబ్బంది పెట్టదు. లైట్ క్లచ్‌, స్లిక్ గేర్‌బాక్స్ వల్ల స్టాప్ అండ్ గో ట్రాఫిక్‌లో డ్రైవింగ్ సులభంగా మారుతుంది.

మైలేజ్ ఎలా ఉంది?

ఈ 2,000 కిలోమీటర్ల ప్రయాణంలో ఎక్కువగా సిటీ వినియోగమే జరిగింది. సగటుగా 12 కిలోమీటర్లు ప్రతి లీటర్ మైలేజ్ వచ్చింది. భారీ బాడీ, ఎత్తైన స్టాన్స్ ఉన్న SUV తరహాలో ఉండే వాహనం కాబట్టి ఈ మైలేజ్ సరిపోతుందని చెప్పాలి.

టచ్‌స్క్రీన్‌, ఫీచర్లు

పంచ్‌లోని 10.2 ఇంచుల టచ్‌స్క్రీన్ సిస్టమ్ నిజంగా ఆకట్టుకుంది. గ్రాఫిక్స్ షార్ప్‌గా ఉంటాయి. రెస్పాన్స్ వేగంగా ఉంటుంది. వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సజావుగా పనిచేస్తాయి. ముందు ఉన్న నాలుగు స్పీకర్లు, రెండు ట్వీటర్లు మ్యూజిక్ అనుభవాన్ని మెరుగుపరుస్తాయి. 45W టైప్-C పోర్ట్ ఉండటం వల్ల ఫోన్ చార్జింగ్ చాలా ఫాస్ట్‌గా జరిగింది.

రైడ్ క్వాలిటీ - పెద్ద బలం

టాటా పంచ్‌లో ప్రధాన హైలైట్ దాని రైడ్ క్వాలిటీ. చెత్త రోడ్లు, సరిగా గుర్తు పెట్టని స్పీడ్ బ్రేకర్లు వచ్చినా సస్పెన్షన్ సులభంగా హ్యాండిల్ చేస్తుంది. పూర్తి లోడ్‌తో ఉన్నా వాహనం స్టేబుల్‌గా ఉంటుంది. ఇది నగరాల పరిస్థితుల్లో పెద్ద ప్లస్ పాయింట్.

లోపాలు కూడా ఉన్నాయి

రియర్ సీట్ స్పేస్ సగటుగా మాత్రమే ఉంటుంది. లోడ్ సెన్సర్లు లేకపోవడం వల్ల ఖాళీ సీట్లకు కూడా సీట్‌ బెల్ట్ పెట్టాల్సి వస్తుంది. మరో ముఖ్యమైన లోపం హెడ్‌ల్యాంప్స్‌. రాత్రి డ్రైవింగ్‌లో లైట్ త్రో, స్ప్రెడ్ తక్కువగా అనిపిస్తుంది. నగరంలో సరిపోతుంది కానీ హైవేల్లో ఇబ్బంది కలిగిస్తుంది.

టెస్ట్ డేటా

మోడల్: టాటా పంచ్ కామో ఎడిషన్ Tata Punch Camo edition Accomplished+
ధర: రూ.8.14 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)
సగటు మైలేజ్: 12 కిలోమీటర్లు ప్రతి లీటర్
మెయింటెనెన్స్ ఖర్చులు: లేవు
లోపాలు: లేవు

తుది అభిప్రాయం

కొన్ని చిన్న లోపాలు ఉన్నా, 2025 టాటా పంచ్ కామో ఎడిషన్ రోజువారీ సిటీ డ్రైవింగ్‌కు నమ్మకమైన వాహనంగా నిలిచింది. మంచి రైడ్ క్వాలిటీ, ఈజీ డ్రైవబిలిటీ, ఉపయోగకరమైన ఫీచర్లు దీనిని ఆకర్షణీయమైన ఎంపికగా మారుస్తాయి. నగరాల్లో ఎక్కువగా ప్రయాణించే వారికి ఇది ఒక బలమైన ఎంపికగా చెప్పుకోవచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Honda Elevate Facelift.. హ్యుందాయ్ క్రెటాను ఢీకొట్టే సత్తా ఉందా? ఏ SUVని కొనడం లాభదాయకం?
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ vs హ్యుందాయ్ క్రెటా.. ఫీచర్లు, భద్రతలో తేడాలేంటి? ఏది కొనడం బెటర్‌?
కొత్త కారు కొనే ముందు జాగ్రత్త! షోరూమ్‌ రేటు గురించి తప్ప ఈ 5 ఖర్చుల గురించి డీలర్‌ మీకు ముందే చెప్పరు!
కొత్త కారు కొంటున్నారా? షోరూమ్ ధర చూసి మురిసిపోకండి.. మీ జేబుకు చిల్లు పెట్టే 5 అదనపు ఖర్చులివి!
Maruti Brezza CNG కారు 2 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే EMI ఎంత కట్టాలి? మైలేజీ, పూర్తి వివరాలు
Maruti Brezza CNG కారు 2 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే EMI ఎంత కట్టాలి? మైలేజీ, పూర్తి వివరాలు

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila House Arrest: ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
Telangana Politics Personal Attacks: తెలంగాణ రాజకీయం వ్యక్తిగత శత్రుత్వంగా మారుతోందా? - వ్యక్తిత్వాలపై దాడి దేనికి సంకేతం?
తెలంగాణ రాజకీయం వ్యక్తిగత శత్రుత్వంగా మారుతోందా? - వ్యక్తిత్వాలపై దాడి దేనికి సంకేతం?
ACB Raids Civil Supplies DM: సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Vijay TVK Win: తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
Samson Storm Reply: వరుస వైఫల్యాల తర్వాత ఊచకోత.. కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన సంజూ శాంసన్
వరుస వైఫల్యాల తర్వాత ఊచకోత.. కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన సంజూ శాంసన్
కొత్త కారు కొనే ముందు జాగ్రత్త! షోరూమ్‌ రేటు గురించి తప్ప ఈ 5 ఖర్చుల గురించి డీలర్‌ మీకు ముందే చెప్పరు!
కొత్త కారు కొంటున్నారా? షోరూమ్ ధర చూసి మురిసిపోకండి.. మీ జేబుకు చిల్లు పెట్టే 5 అదనపు ఖర్చులివి!
Black Coffee for Weight Loss : బ్లాక్ కాఫీ తాగితే కొవ్వు తగ్గుతుందా? రోజుకు ఎన్ని కప్పులు తాగాలో తెలుసా?
బ్లాక్ కాఫీ తాగితే కొవ్వు తగ్గుతుందా? రోజుకు ఎన్ని కప్పులు తాగాలో తెలుసా?
Embed widget