అన్వేషించండి

స్క్రీన్లు, సేఫ్టీ, ఇంజిన్‌ ఆప్షన్లు - కొత్త కియా సెల్టోస్‌ ముందు టాటా సియెర్రా నిలుస్తుందా?

2026 Kia Seltos vs Tata Sierra: 2026 కియా సెల్టోస్‌, టాటా సియెర్రా టాప్‌ వేరియంట్ల పోలిక ఇది. ఫీచర్లు, స్క్రీన్లు, భద్రత, ఇంజిన్‌ ఆప్షన్లు, ధరల పరంగా ఏ మిడ్‌సైజ్‌ SUV బెస్ట్‌ అనేది తెలుసుకోండి.

Kia Seltos vs Tata Sierra Top Variant Features: భారత మిడ్‌సైజ్‌ SUV విభాగంలో 2026 సంవత్సరం ఆసక్తికరంగా మారింది. ఇటీవల లాంచ్‌ అయిన రెండో తరం కియా సెల్టోస్‌... పూర్తిగా మారిన డిజైన్‌, కొత్త ఇంటీరియర్‌, మరిన్ని ఆధునిక ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చింది. మరోవైపు, ఒకప్పుడు ఐకానిక్‌ మోడల్‌గా పేరు తెచ్చుకున్న టాటా సియెర్రా మళ్లీ కొత్త అవతారంలో రీఎంట్రీ ఇచ్చింది. ఈ రెండు SUVల టాప్‌ వేరియంట్లు అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో నిండిపోయాయి. అలాంటప్పుడు, ఏది ఎక్కువ ఫీచర్లు ఇస్తుంది?.

ఎక్స్‌టీరియర్‌ & లైటింగ్‌

సెల్టోస్‌, సియెర్రా రెండింట్లోనూ ఆల్‌ LED లైటింగ్‌ సెటప్‌ ఉంది. అయితే సియెర్రా రియర్‌ ఫాగ్‌ ల్యాంప్స్‌, అన్ని డోర్లకు పుడిల్‌ ల్యాంప్స్‌ ఇస్తుంది. ఇవి కొత్త సెల్టోస్‌లో లేవు.
వీల్స్‌ విషయంలో సియెర్రా కాస్త ముందుంది. దీనిలో 19 ఇంచుల అలాయ్‌ వీల్స్‌ ఉండగా, సెల్టోస్‌లో 18 ఇంచుల అలాయ్‌లు మాత్రమే ఉన్నాయి.
అయితే సెల్టోస్‌లో ORVMలు డ్రైవర్‌ సీటు మెమరీ ఫంక్షన్‌తో సింక్‌ అవుతాయి. సియెర్రాలో మాత్రం మెమరీ ఫంక్షన్‌ డ్రైవర్‌ సీటుకే పరిమితం.

ఇంటీరియర్‌ & స్క్రీన్లు

ఇంటీరియర్‌ ఫీచర్లు

కియా సెల్టోస్‌
టాటా సియెర్రా
Infotainment screen
 
12.3-inch
12.3-inch
Driver’s display
 
12.3-inch
10.25-inch
Passenger display
 
లేదు
12.3-inch
Android Auto, Apple CarPlay
 
Wireless
Wireless
Head-up display
 
ఉంది
లేదు
Sunroof
 
Panoramic
Panoramic
Climate control
 
Dual-zone
Dual-zone
Steering wheel adjustment
 
Tilt and telescopic
Tilt and telescopic
Seat upholstery
 
Leatherette
Leatherette
Steering wheel wrapping
 
Leatherette
Leatherette
Wireless phone charger
 
ఉంది
ఉంది
On-board navigation
 
ఉంది
ఉంది
Audio system
 
8-speaker Bose
12-speaker JBL Black with Dolby Atmos
Ventilated front seats
 
ఉంది
ఉంది
Powered driver’s seat
 
10-way, welcome, memory, lumbar support
6-way, memory, welcome
Boss mode
 
లేదు
Manual
Rear seat adjustability
 
Reclining, 60:40 split and flat-fold function
Reclining, 60:40 split
Powered tailgate
 
లేదు
ఉంది
Rear sunshade
 
ఉంది
ఉంది
Ambient lighting
 
64-colour
Multi-colour
Front centre armrest
 
ఉంది
ఉంది
Rear centre armrest
 
ఉంది
ఉంది
Air purifier
 
లేదు
ఉంది
Cooled glove box
 
లేదు
ఉంది
Push-button start/stop
 
ఉంది
ఉంది
Type-C USB ports
 
Front and rear
Front and rear
Connected car tech
 
ఉంది
ఉంది
OTA updates
 
ఉంది
ఉంది

ఈ రెండు SUVల్లో ట్రిపుల్‌ స్క్రీన్‌ లేఅవుట్‌ కనిపిస్తుంది. సెల్టోస్‌లో 12.3 ఇంచుల ఇన్ఫోటైన్‌మెంట్‌ స్క్రీన్‌, 12.3 ఇంచుల డ్రైవర్‌ డిస్‌ప్లే మధ్యలో 5 ఇంచుల క్లైమేట్‌ కంట్రోల్‌ స్క్రీన్‌ ఉంది.
సియెర్రాలో కూడా 12.3 ఇంచుల ఇన్ఫోటైన్‌మెంట్‌ స్క్రీన్‌ ఉంది. అదనంగా ముందు ప్యాసింజర్‌ కోసం ప్రత్యేకంగా 12.3 ఇంచుల డిస్‌ప్లే ఇచ్చారు. అయితే దాని ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ మాత్రం 10.25 ఇంచులుగా చిన్నది.
హెడ్‌-అప్‌ డిస్‌ప్లే సెల్టోస్‌ టాప్‌ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. సియెర్రాలో ఇది లోయర్‌ ట్రిమ్స్‌కే పరిమితం.

కంఫర్ట్‌ & కన్వీనియన్స్‌

డ్రైవర్‌ సీటు అడ్జస్ట్‌మెంట్లలో సెల్టోస్‌ ఎక్కువ ఆప్షన్లు ఇస్తుంది. అయితే సియెర్రాలో ఎయిర్‌ ప్యూరిఫయర్‌, కూల్డ్‌ గ్లోవ్‌బాక్స్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఆడియో సిస్టమ్‌ విషయంలో సియెర్రా ఎక్కువ స్పీకర్లతో కాస్త బలంగా కనిపిస్తుంది.
డ్రైవ్‌ మోడ్‌లు, టెర్రైన్‌ మోడ్‌లు రెండింట్లోనూ ఉన్నాయి. అయితే డ్రైవ్‌ మోడ్‌ల సంఖ్య సెల్టోస్‌లో ఎక్కువ. ప్యాడిల్‌ షిఫ్టర్లు, అడాప్టివ్‌ క్రూయిజ్‌ కంట్రోల్‌, ఐడిల్‌ స్టార్ట్‌ స్టాప్‌ వంటి ఫీచర్లు రెండింట్లోనూ కామన్‌.

భద్రత

భద్రత విషయంలో ఈ రెండు SUVలు దాదాపు ఒకే స్థాయిలో ఉన్నాయి. ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌, 360 డిగ్రీ కెమెరా, ముందు వెనుక పార్కింగ్‌ సెన్సర్లు, ఎలక్ట్రానిక్‌ పార్కింగ్‌ బ్రేక్‌ రెండింట్లోనూ అందుబాటులో ఉన్నాయి.

ధర & ఇంజిన్‌ ఆప్షన్లు

ఇంజిన్‌ ఆప్షన్‌
Seltos GTX (A), X-Line (A)
Sierra Accomplished+
Petrol MT
 
-
-
Petrol CVT
 
రూ. 19.49 లక్షలు
-
Turbo-petrol MT
 
-
-
Turbo-petrol AT
 
రూ. 19.99 లక్షలు
రూ. 20.99 లక్షలు
Diesel MT
 
-
రూ. 20.29 లక్షలు
Diesel AT
 
రూ. 19.99 లక్షలు
రూ. 21.29 లక్షలు

సెల్టోస్‌లో న్యాచురల్‌ ఆస్పిరేటెడ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ ఆప్షన్‌ ఉండటంతో, టాప్‌ వేరియంట్‌ ధర సియెర్రా కంటే సుమారు రూ.1.50 లక్షలు తక్కువగా ఉంటుంది.
1.5 లీటర్‌ టర్బో పెట్రోల్‌ వేరియంట్‌లో కూడా సెల్టోస్‌ సుమారు రూ.1 లక్ష తక్కువ ధరకు లభిస్తుంది.

డీజిల్‌ విభాగంలో సియెర్రా టాప్‌ వేరియంట్‌లో మాన్యువల్‌ గేర్‌బాక్స్‌ ఇస్తుంది. సెల్టోస్‌లో ఆ ఆప్షన్‌ లేదు. అయినా సెల్టోస్‌ డీజిల్‌ ఆటోమేటిక్‌ ధర సియెర్రా డీజిల్‌ మాన్యువల్‌ కంటే సుమారు రూ.30 వేల వరకు తక్కువ. సియెర్రా డీజిల్‌ ఆటోమేటిక్‌ అయితే సెల్టోస్‌ కంటే రూ.1.30 లక్షలు ఎక్కువ.

మొత్తం మీద, టాప్‌ వేరియంట్‌లో ప్యాసింజర్‌ డిస్‌ప్లే, పవర్డ్‌ టెయిల్‌గేట్‌, ఎక్కువ స్పీకర్లు కావాలంటే టాటా సియెర్రా ఆకట్టుకుంటుంది. కానీ ధరను చూస్తే, తక్కువ ఖర్చులో ఎక్కువ ఫీచర్లు అందించే ప్యాకేజీగా కియా సెల్టోస్‌ ముందంజలో ఉంటుంది. ADAS అవసరం లేని వారికి సెల్టోస్‌ GTX, X-Line వేరియంట్లు మరింత వాల్యూ ఫర్‌ మనీగా నిలుస్తాయి. మొత్తానికి ఫీచర్లు, ధర, ఎంపికల సమతుల్యంలో సెల్టోస్‌ ఈ పోలికలో పైచేయి సాధిస్తుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hero Electric Optima vs Vida VX2 Go: హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా vs విడా VX2గో: లక్ష లోపు బడ్జెట్‌లో బెస్ట్ ఈవీ ఏది? ధర ఫీచర్లు, పెర్ఫార్మెన్స్‌ గురించి తెలుసుకోండి!
హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా vs విడా VX2గో: లక్ష లోపు బడ్జెట్‌లో బెస్ట్ ఈవీ ఏది? ధర ఫీచర్లు, పెర్ఫార్మెన్స్‌ గురించి తెలుసుకోండి!
Best 125cc Scooters in India: అనుకూల బడ్జెట్‌, ఆకట్టుకునే మైలేజ్‌! భారత మార్కెట్‌లో దుమ్మురేపుతున్న టాప్‌ 125 సీసీ స్కూటర్లు ఇవే!
అనుకూల బడ్జెట్‌, ఆకట్టుకునే మైలేజ్‌! భారత మార్కెట్‌లో దుమ్మురేపుతున్న టాప్‌ 125 సీసీ స్కూటర్లు ఇవే!
Affordable Electric SUVs in India 2026: పెట్రోల్ ధరలు పెరుగుతున్న వేళ రూ. 10 లక్షల నుంచే వచ్చే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు! ఒక్క చార్జ్‌తో 500 కి.మీ ప్రయాణం
పెట్రోల్ ధరలు పెరుగుతున్న వేళ రూ. 10 లక్షల నుంచే వచ్చే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు! ఒక్క చార్జ్‌తో 500 కి.మీ ప్రయాణం
Nissan Tekton Hybrid SUV India: నిసాన్ టక్టాన్‌ దెబ్బకు దిగ్గజాలు షేక్ అవ్వాల్సిందే! రూ. 11 లక్షలకే హైబ్రిడ్ మ్యాజిక్‌... మైలేజీ చూస్తే మైండ్ బ్లాక్!
నిసాన్ టక్టాన్‌ దెబ్బకు దిగ్గజాలు షేక్ అవ్వాల్సిందే! రూ. 11 లక్షలకే హైబ్రిడ్ మ్యాజిక్‌... మైలేజీ చూస్తే మైండ్ బ్లాక్!

వీడియోలు

RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్
Will Jacks Fielding in RR vs MI IPL 2026 | గాల్లో తేలుతూ విల్ జాక్స్ ఫీల్డింగ్
David Warner Blocked by SRH ? | డేవిడ్ వార్నర్‌ను బ్లాక్ చేసిన SRH?
IPL 2026 RCB vs GT Qualifier | SRH ఫ్యాన్స్ ను భయపడుతున్న ప్లేఆఫ్స్ సెంటిమెంట్
Vaibhav Suryavanshi MI vs RR IPL 2026 | ప్లేఆఫ్‌లో ఉండాలంటే రాజస్థాన్ గెలవాల్సిందే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan on Nageshwar: జగన్ ను అరెస్ట్ చేయమని అడిగే చీప్ కారెక్టర్ కాదు నాది.. అమిత్‌షాతో చెబితే ప్రొ. నాగేశ్వర్ విన్నారా..?
జగన్ ను అరెస్ట్ చేయమని అడిగే చీప్ కారెక్టర్ కాదు నాది.. అమిత్‌షాతో చెబితే ప్రొ. నాగేశ్వర్ విన్నారా..?
GHMC MeeSeva WhatsApp Number: అరచేతిలోనే జీహెచ్‌ఎంసీ ఆఫీస్‌! వాట్సాప్‌లోనే బర్త్‌ సర్టిఫికెట్‌ నుంచి 9 రకాల సేవలు!
అరచేతిలోనే జీహెచ్‌ఎంసీ ఆఫీస్‌! వాట్సాప్‌లోనే బర్త్‌ సర్టిఫికెట్‌ నుంచి 9 రకాల సేవలు!
Telangana Women Empowerment Schemes: మహిళా సంఘాలకు రైస్‌ మిల్లలు, గోదాములు, సూపర్ బజార్‌లు- ముఖ్యమంత్రి కీలక ప్రకటన
మహిళా సంఘాలకు రైస్‌ మిల్లలు, గోదాములు, సూపర్ బజార్‌లు- ముఖ్యమంత్రి కీలక ప్రకటన
Anantha Sriram parents protection: చేగొండి జోగయ్య కుమారుడి నుంచి తల్లిదండ్రులకు ప్రాణహాని - పోలీసులకు అనంతశ్రీరామ్ ఫిర్యాదు - అసలు కేసేమిటంటే?
చేగొండి జోగయ్య కుమారుడి నుంచి తల్లిదండ్రులకు ప్రాణహాని - పోలీసులకు అనంతశ్రీరామ్ ఫిర్యాదు - అసలు కేసేమిటంటే?
Maa Inti Bangaaram Trailer : మా ఇంటి బంగారం ట్రైలర్ - చాలా రోజుల తర్వాత ఫుల్ యాక్షన్ మోడ్‌లో సమంత
మా ఇంటి బంగారం ట్రైలర్ - చాలా రోజుల తర్వాత ఫుల్ యాక్షన్ మోడ్‌లో సమంత
AP DSC Merit List Controversy: ఏపీ మెగా డీఎస్సీపై సీబీఐ విచారణకు జగన్ డిమాండ్ - భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపణలు
ఏపీ మెగా డీఎస్సీపై సీబీఐ విచారణకు జగన్ డిమాండ్ - భారీగా అక్రమాలు జరిగాయని సంచలన ఆరోపణలు
TamilNadu Farmers Loan Waiver: రైతులకు రూ.50వేల రుణమాఫీ - తమిళనాడు సీఎం విజయ్ సంచలన నిర్ణయం
రైతులకు రూ.50వేల రుణమాఫీ - తమిళనాడు సీఎం విజయ్ సంచలన నిర్ణయం
Rambha : నాన్నా ఐ మిస్ యూ - ఒకప్పటి హీరోయిన్ రంభ ఇంట్లో తీవ్ర విషాదం
నాన్నా ఐ మిస్ యూ - ఒకప్పటి హీరోయిన్ రంభ ఇంట్లో తీవ్ర విషాదం
Embed widget