అన్వేషించండి

Alto Facelift Version: అద్భుత రూపంలోకి మారిన ఆల్టో - ADAS సేఫ్టీతో పాటు 28 km మైలేజ్

2025 Suzuki Alto Facelift: సుజుకి ఆల్టో ఫేస్‌లిఫ్ట్‌లో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు బ్లూటూత్ కనెక్టివిటీ, కీలెస్ ఎంట్రీ & 4-స్పీకర్ ఆడియో సిస్టమ్‌ ఉన్నాయి.

Suzuki Alto Facelift Hybrid Engine Launched: మారుతి సుజుకి ఆల్టో, భారతదేశంలోని అత్యంత చవకైన కార్లలో ఒకటిగా చాలా ఆదరణ పొందింది. సుజుకి కంపెనీ, పాపులర్‌ ఆల్టోను జపనీస్ మార్కెట్లో కొత్త అవతారంలో ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఆల్టోను త్వరలో భారతీయ మార్కెట్లో కూడా లాంచ్‌ చేయవచ్చు అనే మాట గట్టిగా వినిపిస్తోంది. బడ్జెట్ విభాగంలో కారు కొనాలని చూస్తున్న వ్యక్తులకు ఇది బెటర్‌ ఆప్షన్‌గా మారనుంది.         

మునుపటి ఆల్టో - కొత్త ఆల్టో మధ్య తేడాలు ఏంటని చూస్తే....
సుజుకి ఆల్టో ఫేస్‌లిఫ్ట్ హైబ్రిడ్‌ వెర్షన్‌లో కొత్త ఫ్రంట్ గ్రిల్, రౌండ్ బంపర్ & అట్రాక్టివ్‌ హెడ్‌ల్యాంప్స్‌ ఇచ్చారు, దీంతో దీని రూపురేఖలు చాలా కొత్తగా కనిపిస్తున్నాయి. ఇంకా... సరికొత్త కలర్ ఆప్షన్‌లు & స్టైలిష్ అల్లాయ్ వీల్స్‌తో ఈ బడ్జెట్‌ బండిని పరిచయం చేశారు. ఆల్టో ఫేస్‌లిఫ్ట్ 2025 డిజైన్ కాంపాక్ట్ & ఏరోడైనమిక్‌గా ఉంటుంది, ఫలితంగా ఇది మైలేజీని మరింత పెంచుతుంది.            

సుజుకి ఆల్టో ఫేస్‌లిఫ్ట్‌లో రెండు ఇంజిన్ ఆప్షన్‌లు
సుజుకి ఆల్టో ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ను రెండు ఇంజిన్ ఆప్షన్‌లతో పరిచయం చేశారు. మొదటిది 658cc, 3-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్. రెండోది 658cc మైల్డ్-హైబ్రిడ్ ఇంజిన్. ఈ రెండు ఇంజిన్లు CVT గేర్‌బాక్స్‌తో కనెక్ట్‌ అయి ఉంటాయి. దీనిలో FWD & AWD ఆప్షన్లను కూడా చూడవచ్చు. సుజుకీ వెబ్‌సైట్‌ ప్రకారం, హైబ్రిడ్ FWD వేరియంట్ WLTC సైకిల్‌లో 28.2 కిమీ/లీటర్ మైలేజీని ఇవ్వగలదు.              

సుజుకి ఆల్టో ఫేస్‌లిఫ్ట్‌లో భద్రత కోసం రాడార్ ఆధారిత అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఉంది. ఈ సిస్టమ్‌లో కొలిషన్ మిటిగేషన్, డిపార్చర్ వార్నింగ్ & అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. డ్యూయల్ సెన్సార్ బ్రేక్ సెన్సార్ 2 వంటి ఫీచర్లను కూడా ఎంజాయ్‌ చేయవచ్చు.          

సుజుకి ఆల్టో ఫేస్‌లిఫ్ట్‌ క్యాబిన్‌ ఎలా ఉంది?
సుజుకి ఆల్టో ఫేస్‌లిఫ్ట్ క్యాబిన్‌ అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లకు నిలయంలా ఉంటుంది. 7-అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు బ్లూటూత్ కనెక్టివిటీ, కీలెస్ ఎంట్రీ & 4-స్పీకర్ ఆడియో సిస్టమ్‌ ఉంది. ఇవి, ఎలాంటి సుదీర్ఘ ప్రయాణంలోనైనా విసుగు రానివవ్వు. సుజుకి ఆల్టో ఫేస్‌లిఫ్ట్ డాష్‌బోర్డ్‌లో కనిపించే క్రోమ్ ఫినిషింగ్ & ఎర్గోనామిక్ కంట్రోల్స్‌ ఈ కారుకు ప్రీమియం కారు లాంటి లుక్‌ అందిస్తాయి.             

సుజుకి ఆల్టో ఫేస్‌లిఫ్ట్‌ ధర
సుజుకి ఆల్టో హైబ్రిడ్‌ మోడల్‌ జపనీస్ మార్కెట్లో ఈ మధ్య కాలంలోనే లాంచ్‌ అయింది. ఇప్పుడు అందుతున్న నివేదికల ప్రకారం, దీని 2WD/CVT వేరియంట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర 15,19,100 యెన్‌లు  & 4WD/CVT ధర దాదాపు 4.5 లక్షల రూపాయలు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. మరి భారత్ మార్కెట్‌లో ఎలాంటి ధరలు నిర్ణయిస్తుందో చూడాలి.        

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Embed widget