By: ABP Desam | Updated at : 16 Mar 2023 03:20 PM (IST)
కియా ఈవీ9 కాన్సెప్ట్ మోడల్ (Image Credits: Kia)
2023 Kia EV9: 2023 కియా ఈవీ9 గురించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కారు ఇటీవలే రోడ్ల మీద కూడా కనిపించింది. ఆటో ఎక్స్‌పో 2023లో డిస్‌ప్లేకు ఉంచిన మోడల్‌నే కంపెనీ లాంచ్ చేసే అవకాశం ఉంది. కంపెనీ ఫ్లాగ్‌షిప్ ఈవీ మోడల్‌గా కియా ఈవీ9ని లాంచ్ చేసింది. ఇందులో మల్టీపుల్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు ఉన్నాయి.
కంపెనీ ఎలక్ట్రిక్ వెహికిల్ లైనప్‌లో కియా ఈవీ6 ఇప్పటికే ఉంది. 2027 నాటికి 13 ఎలక్ట్రిక్ వాహనాలు లాంచ్ చేయాలనేది కియా ‘ప్లాన్ ఎస్’ వ్యూహంలో భాగం. ఇప్పుడు లాంచ్ కానున్న కియా ఈవీ9 బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ కార్లతో పోటీ పడనుంది.
కియా ఈవీ9 ఎలక్ట్రిక్ కారు ఏకంగా 543 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుంది. 800వీ ఎక్విప్డ్ ఈ - జీఎంపీ ప్లాట్‌ఫాంను ఇందులో అందించారు. 350kW ర్యాపిడ్ చార్జింగ్ ఫీచర్ కూడా ఈ కారులో అందించారు. కేవలం ఆరు నిమిషాల చార్జింగ్‌తో ఈ కారు 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించనుంది.
ఇక ఎక్స్‌టీరియర్స్ విషయానికి వస్తే... ఇందులో మంచి మెచ్యూర్ డిజైన్ అందించారు. దీని ఫైనల్ వెర్షన్ మరింత రోడ్ ఫ్రెండ్లీగా ఉండనుందని తెలుస్తోంది. ఆటో ఎక్స్‌పో 2023లో డిస్‌ప్లే చేసిన కాన్సెప్ట్ మోడల్‌లో 23 అంగుళాల వీల్స్‌ను అందించారు. కానీ రోడ్ల మీద కనిపించిన మోడల్లో 21 అంగుళాల వీల్స్ కనిపించాయి. దీని డిజైన్ కూడా చాలా కొత్తగా ఉంది.
కియా ఈవీ9 ఇండియా లాంచ్
ఆటో ఎక్స్‌పో 2023లో డిస్‌ప్లే చేసిన కియా ఈవీ9 కాన్సెప్ట్ వెర్షన్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ కారు మార్కెట్లో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.
కియా తన కొత్త కార్నివాల్ ఎంపీవీని గతంలోనే మార్కెట్లో రివీల్ చేసింది. ఈ మోడల్‌ను కంపెనీ భారతదేశంలో మొదటిసారిగా పరిచయం చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కార్నివాల్ మోడల్ దేశీయ మార్కెట్లో చాలా కాలంగా ఉంది. అదే సమయంలో ఈ కొత్త తరం మోడల్, దాని ప్రస్తుత మోడల్ కంటే చాలా పెద్దదిగా ఉండటమే కాకుండా అనేక కొత్త ఫీచర్లు కూడా ఉన్నాయి.
కొత్త కార్నివాల్ డిజైన్ మునుపటి కంటే చాలా బాగుంది. ఇది ఇప్పుడు మరింత ఆకర్షణీయమైన డిజైన్‌తో వచ్చింది. 5156 మిల్లీమీటర్ల పొడవు కలిగిన ఈ కారు భారతదేశంలోని పొడవైన కార్లలో ఒకటి. అలాగే ప్రస్తుత మోడల్ కంటే చాలా పెద్దది. దీని డాష్‌బోర్డ్‌లో డబుల్ 12.3 అంగుళాల స్క్రీన్‌లు ఉన్నాయి. అలాగే, ఈ మోడల్ గతంలో కంటే మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.
ఈ MPVలోని స్లైడింగ్ డోర్లు దీని ప్రత్యేక ఫీచర్. లోపలి భాగంలో లగ్జరీ అప్‌హోల్స్ట్రీతో చూడడానికి మంచి స్థలం ఉంది. దీన్ని సురక్షితంగా, సౌకర్యవంతంగా చేయడానికి ADAS, 3-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి అనేక ఫీచర్లు అందించారు. కొత్త తరం కార్నివాల్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఉన్న పెద్ద డీజిల్ ఇంజన్‌పై పని చేయనుంది. విదేశాల మోడల్లో కొత్త కార్నివాల్ పెద్ద పెట్రోల్ ఇంజన్‌ను కూడా అందించారు.
Kia EV9 SUV: టెస్లా కంటే మెరుగైన ఆటోపైలట్ ఫీచర్‌తో కియా కొత్త కారు - మస్క్‌కి మంట పెడతారా?
Key steps To Buy Car: సెకండ్ హ్యాండ్ కారు కొనాలి అనుకుంటున్నారా? ఈ 5 విషయాల్లో జాగ్రత్తగా ఉండండి!
Expensive Bikes: దేశంలో అత్యంత ఖరీదైన బైక్స్ ఇవే - చూడటం తప్ప కొనడం కష్టమే!
Car Fuel Tank Tips: కారులో ట్యాంక్ ఫుల్ చేయిస్తున్నారా? - అయితే మీ వాహనం డేంజర్లో ఉన్నట్లే! - ఎందుకో తెలుసా?
New Car Care Tips: కొత్త కారు కొన్నారా - ఈ జాగ్రత్తలు పాటించకపోతే త్వరగా షెడ్డుకి పోవడం ఖాయం!
ABP CVoter Karnataka Opinion Poll: కర్ణాటకలో కింగ్ కాంగ్రెస్, ఆసక్తికర విషయాలు చెప్పిన ABP CVoter ఒపీనియన్ పోల్
Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం - సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు !
PS2 Telugu Trailer: వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!
TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!