2023 December Car Sales: 2023లో భారీగా తగ్గిన కారు సేల్స్ - కానీ కంపెనీల టార్గెట్ సక్సెస్!
2023 December Car Sales Report: 2023 డిసెంబర్‌లో కార్ల అమ్మకాలు బాగా తగ్గాయి.
Car Sales Report December 2023: 2023 డిసెంబర్లో భారత కారు మార్కెట్లో దాదాపు 2.87 లక్షల యూనిట్లు అమ్ముడుపోయాయి. 2022 డిసెంబర్‌తో పోలిస్తే నాలుగు శాతం వృద్ధి ఉంది. కానీ 2023 నవంబర్‌తో పోల్చితే మాత్రం 14.2 శాతం క్షీణత కనిపించింది. 2023 మొత్తం సంవత్సరంలో అమ్మకాల సంఖ్య మూడు లక్షల యూనిట్ల కంటే తక్కువగా పడిపోయిన ఏకైక నెల ఇదే. సాధారణంగా డీలర్‌షిప్ దగ్గర స్టాక్‌ను తగ్గించడానికి కంపెనీలు డిసెంబర్‌లో తక్కువ వాహనాలను రవాణా చేస్తాయి. జనవరి నుంచి ధరలు పెరుగుతాయి కాబట్టి డిసెంబర్‌లో ధరలు తగ్గించి ఉన్న స్టాక్‌ను క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ క్షీణత ఉన్నప్పటికీ భారతీయ ప్యాసింజర్ వాహన విభాగం 2023 డిసెంబర్ నెలలో మంచి అమ్మకాలు నమోదు చేసింది.
అత్యధిక విక్రయాలను నమోదు చేసింది నెక్సాన్
టాటా నెక్సాన్ గత నెలలో దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారు. దీని మొత్తం అమ్మకాలు 15,284 యూనిట్లకు చేరుకున్నాయి. ఇది 2022 డిసెంబర్‌తో కంపేర్ చేస్తే ఏకంగా 27 శాతం వృద్ధిని సాధించింది. 14,012 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసిన మారుతి సుజుకి డిజైర్ రెండో స్థానాన్ని ఆక్రమించగా, 2022 డిసెంబర్ కంటే 17 శాతం వృద్ధిని నమోదు చేసింది.
హ్యుందాయ్‌ను దాటేసిన టాటా మోటార్స్
2022 డిసెంబర్‌లో నమోదైన 10,586 యూనిట్లతో పోలిస్తే టాటా పంచ్ కూడా మంచి గ్రోత్ నమోదు చేసింది. 2023 డిసెంబర్‌లో టాటా పంచ్ 13,787 యూనిట్ల అమ్మకాలతో మూడో స్థానంలో నిలిచింది. మారుతి సుజుకి ఎర్టిగా ఎంపీవీ 12,975 యూనిట్ల అమ్మకాలతో, బ్రెజ్జా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ 12,844 యూనిట్ల అమ్మకాలతో నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. టాటా మోటార్స్ హ్యుందాయ్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరుకుంది. గత సంవత్సరం కంటే ఎనిమిది శాతం ఎక్కువ వృద్ధిని నమోదు చేసింది. అయితే నవంబర్ నెలతో పోలిస్తే కంపెనీ దాదాపు ఆరు శాతం క్షీణతను నమోదు చేసింది.
తగ్గిన మారుతి సుజుకి మార్కెట్ షేర్
మారుతి సుజుకి 2022 డిసెంబర్‌తో పోలిస్తే 2023 డిసెంబర్‌లో 6.5 శాతం క్షీణతను నమోదు చేసింది. మార్కెట్ వాటాలో నాలుగు కంటే ఎక్కువ క్షీణత ఉంది. అయితే కంపెనీ రిటైల్ అమ్మకాల గణాంకాలు మెరుగ్గా ఉన్నాయి. ఇది పాత స్టాక్‌ను తగ్గించడంలో కంపెనీ సాధించిన విజయాన్ని ప్రతిబింబిస్తుంది.
నాలుగో స్థానానికి టయోటా
ఇది కాకుండా టయోటా 8,836 యూనిట్ల భారీ తేడాతో కియాను వెనక్కి నెట్టి నాలుగో స్థానాన్ని పొందింది. 2022 డిసెంబర్‌తో పోలిస్తే కంపెనీ 105 శాతం వృద్ధిని నమోదు చేసింది. నవంబర్‌తో పోలిస్తే 26.3 శాతం వృద్ధిని నమోదు చేసింది.
మరోవైపు మహీంద్రా త్వరలో లాంచ్ చేయనున్న ఎక్స్‌యూవీ400 ఈవీ ఫేస్‌లిప్ట్ ఫీచర్ల డిటైల్స్ లీక్ అయ్యాయి. దీని అధికారిక లాంచ్ తేదీని ఇంకా ప్రకటించనప్పటికీ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ అప్‌డేటెడ్ మోడల్ 2024 జనవరి లేదా ఫిబ్రవరిలో మార్కెట్లోకి వస్తుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఈవీ ఫేస్‌లిఫ్ట్ మోడల్ రెండు కొత్త ట్రిమ్‌లు, ఈసీ ప్రో, ఈఎల్ ప్రో మోడల్స్‌లో వస్తుందని తెలుస్తోంది. అయితే ఇది ఇప్పటికే ఉన్న ఈసీ, ఈఎల్ ట్రిమ్‌లతో వస్తుందా లేకపోతే వాటిని రీప్లేస్ చేస్తుందా అనే సమాచారం తెలియరాలేదు.
Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!